రీమాఖాన్
రీమాఖాన్, పాకిస్తానీ టెలివిజన్ హోస్ట్, స్టేజ్ డాన్సర్, లాలీవుడ్ సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత. 1990లలో పాకిస్థాన్‌లోని ప్రముఖ సినీ నటీమణులలో ఒకరుగా పేరుపొందింది.[3] 1990లో సినిమారంగంలోకి వచ్చిన రీమాఖాన్, 200 కంటే ఎక్కువ సినిమాలలో నటించింది. తన నటనకు పాకిస్తాన్, భారతీయ సినీ విమర్శకులచే ప్రసంశలు పొందింది.[4] పాకిస్తానీ సినిమాకు రీమాఖాన్ చేసిన సేవలకు 2019 మార్చి 23న ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది.[2]
రీమాఖాన్ | |
---|---|
జననం | సమీనా ఖాన్ 1971 అక్టోబరు 27 |
వృత్తి | హోస్ట్, డాన్సర్, నటి, దర్శకురాలు, నిర్మాత. |
క్రియాశీల సంవత్సరాలు | 1985 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఎస్. తారిఖ్ షహబ్ (2011)[1] |
పిల్లలు | అలీ షహబ్[1] |
పురస్కారాలు | ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ (2019)[2] |
వెబ్‌సైటు | www.reemakhan.info |
జననం
మార్చుసమీనాఖాన్ 1971, అక్టోబరు 27న పాకిస్తాన్ లోని లాహోర్‌లో జన్మించింది.[5][6] 1985లో క్విస్మత్ సినిమాలో బాలనటిగా నటించిన రీమాఖాన్, మొదటిసారిగా 1990లో పాకిస్తానీ సినిమా దర్శకుడు జావేద్ ఫాజిల్ తీసిన బులంది సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.[6]
వ్యక్తిగత జీవితం
మార్చురీమాఖాన్, 2011 నవంబరులో పాకిస్థాన్-అమెరికన్ కార్డియాలజిస్ట్ ఎస్. తారిఖ్ షహబ్‌ను వివాహం చేసుకున్నది. 2015 మార్చి 24న, ఖాన్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.[1][7]
ఫిల్మోగ్రఫీ
మార్చునటిగా
మార్చు- బులంది (1990)
- జమీన్ ఆస్మాన్ (1994)
- జో దర్ గ్యా వో మర్ గయా (1995)
- ముండా బిగ్రా జే (1995)
- ప్రేమ 95 (1995)
- ఉమర్ ముఖ్తార్ (1997)
- నికాహ్ (1998)
- ముజే చాంద్ చాహియే (2000)
- పెహచాన్ (2000)
- ఫైర్ (2002)
- శరరత్ (2003)
- కోయి తుజ్ సా కహాన్ (2005)
- వన్ టూ కా వన్ (2006)
- లవ్ మే ఘుమ్ (2011)
దర్శకురాలిగా, నిర్మాతగా
మార్చుసంవత్సరం | సినిమా | భాష | నటవర్గం |
---|---|---|---|
2005 | కోయి తుఝ్ స కహాన్ | ఉర్దూ | మోఅమ్మార్ రాణా, రీమా ఖాన్, నదీమ్ బేగ్, వీణా మాలిక్, బబ్రక్ షా |
2011 | లవ్ మే ఘుమ్ | ఉర్దూ | రీమా ఖాన్, జియా అలీ, అలీ సలీమ్, జావేద్ షేక్, అఫ్జల్ ఖాన్, నబీల్ ఖాన్, అరైడా, జానీ లివర్ |
టెలివిజన్ సిరీస్
మార్చుసంవత్సరం | నిర్మాణం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2011 | తరంగ్ ("హీరో బన్నయ్ కి తరంగ్ సాహి జోడీ కి తలాష్") | ఏఆర్పై డిజిటల్ | |
2012 | యే ఘర్ ఆప్ కా హువా | జియో టివి ఉత్పత్తి[8] | |
2012 | రాతి మాషా తోలా | జీనత్ | టెలిఫిల్మ్ (ఇమ్రాన్ అబ్బాస్ సరసన పివిటి హోమ్ లో ప్రసారం) |
2012 | యాద్ తో అయేంగీ | జియో టీవీ ప్రొడక్షన్ | |
2013 | రీమా కా అమెరికా | ఎ అబ్రాడ్ మీడియా | |
2018 | క్రోన్ మే ఖేల్ | గేమ్ షో |
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | ఫలితం | పేరు | మూలాలు |
---|---|---|---|---|---|
1993 | నిగర్ అవార్డు | గెలుపు | హాథీ మేరే సాథీ | [9] | |
1998 | నిగర్ అవార్డు | గెలుపు | నికాహ్ | [9] | |
2000 | నిగర్ అవార్డు | గెలుపు | ముఝే చాంద్ చాహియే | [9] | |
2019 | ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ | గెలుపు | ఆమెనే | [2] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Reema blessed with baby boy". The Express Tribune. 24 March 2015.
- ↑ 2.0 2.1 2.2 Images Staff (2019-03-24). "8 artists including Mehwish Hayat and Babra Sharif receive civil awards on Pakistan Day". Images (in ఇంగ్లీష్). Retrieved 2022-04-18.
- ↑ tabloid!, Usman Ghafoor, Special to (2018-01-29). "Reema Khan poised for a comeback?". GulfNews. Retrieved 2022-04-18.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ ANI (8 June 2009). "Reema Khan is Pakistan's Aishwarya Rai". Hindustan Times. Archived from the original on 23 July 2011. Retrieved 2022-04-18.
- ↑ "Fact check: 20 famous celebrities and their real names". ARYNEWS. 2018-08-21. Retrieved 2022-04-18.
- ↑ 6.0 6.1 "ریما خان آج 45 ویں سالگرہ منائے گی". Daily Pakistan. 27 October 2016.
- ↑ "Reema and Dr Tariq Shahab celebrate 8 years together | SAMAA". Samaa TV. Retrieved 2022-04-18.
- ↑ "Pride of Pakistan: Reema Khan". Daily Times. 2018-08-26. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ 9.0 9.1 9.2 Swami Ji. "Pakistan's "Oscars"; The Nigar Awards (1957 - 2002)". The Hot Spot Film Reviews website. Archived from the original on 2015-07-22. Retrieved 2022-04-18.
బయటి లింకులు
మార్చు- ఇన్స్టాగ్రాం లో రీమాఖాన్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రీమాఖాన్ పేజీ