రుతురాజ్ గైక్వాడ్

రుతురాజ్‌ దశరత్ గైక్వాడ్‌ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరపున, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. రుతురాజ్ ఐపీఎల్-2021లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.[1]

రుతురాజ్ గైక్వాడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుతురాజ్‌ దశరత్ గైక్వాడ్‌
పుట్టిన తేదీ (1997-01-31) 1997 జనవరి 31 (వయసు 27)
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
పాత్రటాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 88)2021 28 జులై - శ్రీలంక తో
చివరి T20I2021 29 జులై - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016 - ప్రస్తుతంమహారాష్ట్ర క్రికెట్ టీమ్
2020 - ప్రస్తుతంచెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20 ఫస్ట్ ఎ క్రికెట్ టీ20
మ్యాచ్‌లు 2 21 59 53
చేసిన పరుగులు 35 1,349 2,681 1,684
బ్యాటింగు సగటు 17.50 38.54 47.87 36.60
100లు/50లు 0/0 4/6 7/16 1/12
అత్యుత్తమ స్కోరు 21 129 187 నాటౌట్ 101 నాటౌట్
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 14/0 16/0 24/0
మూలం: Cricinfo, 25 అక్టోబర్ 2021

జననం, విద్యాభాస్యం

మార్చు

రుతురాజ్ గైక్వాడ్‌ 1997 జనవరి 31న మహారాష్ట్ర రాష్ట్రం, పుణేలో జన్మించాడు. ఆయన ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు.[2]

క్రీడా జీవితం

మార్చు

రుతురాజ్‌ గైక్వాడ్‌ 2016 -17లో మహారాష్ట్ర తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రంజీ ట్రోఫీతో కెరీర్‌ ప్రారంభించాడు. ఆయన 2018లో ఇండియా-బి జట్టుకు, ఏసీసీ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. రుతురాజ్‌ 2019లో తొలిసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని కొనుగోలు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్

రుతురాజ్‌ గైక్వాడ్‌ 2019 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తొలిసారి అతడిని ఎంపిక చేసింది. అయితే ఆ సీజన్‌లో డగౌట్‌కే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించిన టోర్నమెంట్ లో 6 మ్యాచూలు ఆడి 204 పరుగులు చేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ 2021 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడి 635 పరుగులు చేసి 'ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా’ ఎంపికై ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.[3]

ఇంటర్నేషనల్ క్రికెట్

రుతురాజ్ గైక్వాడ్‌ 2021 జూన్లో శ్రీలంక టూర్ కు ఎంపికై రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడి 35 పరుగులు చేశాడు

వివాహం

మార్చు

రుతురాజ్‌ గైక్వాడ్‌ మహారాష్ట్ర దేశవాలీ క్రికెటర్‌ ఉత్కర్ష పవార్‌ను 2023 జూన్ 03న మహారాష్ట్ర మహాబలేశ్వర్‌లో పెళ్లి చేసుకున్నాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. తొలివెలుగు (15 October 2021). "ఆరెంజ్ క్యాప్ గైక్వాడ్ కే.. సరికొత్త రికార్డ్..!". Archived from the original on 15 October 2021. Retrieved 27 October 2021.
  2. Eenadu (16 October 2021). "'ఎమర్జింగ్‌ ప్లేయర్‌' అని ఊరికే అన్నారా..? రుతురాజ్‌ అంటే ఇదే మరి!". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  3. TV9 Telugu (27 October 2021). "రుతురాజ్ గైక్వాడ్‎కు ఘన స్వాతం పలికిన తల్లి.. తరలొచ్చిన అభిమానులు." Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (4 June 2023). "ఘనంగా క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పెండ్లి.. ఫొటోలు". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  5. V6 Velugu (4 June 2023). "ప్రియురాలిని పెళ్లాడిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. అంగరంగ వైభవంగా పెళ్లి". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)