రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ 2022లో విడుదలైన క్రైమ్ డ్రామా సిరీస్. ఇద్రీస్ ఎల్బా నిర్మించిన ‘లూథర్’ అనే బ్రిటీష్ డ్రామా వెబ్ సిరీస్ ఆధారంగా బిబిసి స్టూడియోస్ ఇండియా, , అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కు రాజేష్ మపుస్కర్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్, రాశి ఖన్నా, ఇషా డియోల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ లో మార్చి 4న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ | |
---|---|
జానర్ |
|
ఆధారంగా | ‘లూథర్’ బ్రిటీష్ డ్రామా వెబ్ సిరీస్ |
దర్శకత్వం | రాజేష్ మపుస్కర్ |
తారాగణం |
|
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 6 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | సమీర్ నాయర్ |
ప్రొడక్షన్ స్థానం | భారతదేశం |
ప్రొడక్షన్ కంపెనీలు | బిసి స్టూడియోస్ ఇండియా అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
డిస్ట్రిబ్యూటర్ | స్టార్ ఇండియా |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 4 మార్చి 2022 |
కాలక్రమం | |
సంబంధిత ప్రదర్శనలు | లూథర్ |
కథ
మార్చుడీసీపీ రుద్రవీర్ సింగ్ (అజయ్ దేవగన్) ఎలాంటి కేసునైనా ఛేదించగలిగిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. ముంబై నగరంలో జరుగుతున్న హత్యలను ఛేదించడానికి ఓ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో రుద్రకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి ? ఆ కిల్లర్ ఎవరు ? హత్యల వెనుక అసలు కారణం ఏంటి ? చివరకు రుద్ర కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- అజయ్ దేవ్‌గణ్ - డిసిపి రుద్రవీర్ సింగ్ (రుద్ర)[1][2]
- ఇషా డియోల్ - శైలా దుర్రానీ సింగ్ (షాయ్)[3]
- రాశి ఖన్నా - డాక్టర్ అలియా చోక్సీ[4]
- అతుల్ కులకర్ణి - డీసీపీ గౌతమ్ నవ్లాఖా
- అశ్విని కల్సేకర్ - కమీషనర్ దీపాలీ హండా
- తరుణ్ గహ్లోత్ - పిఐ ప్రబల్ ఠాకూర్
- ఆశిష్ విద్యార్థి - సీపీ రామన్ ఆచార్య
- రాజీవ్ కచ్రూ - మందర్ నాయక్
- మిలింద్ గునాజీ - కల్నల్ యశ్వంత్ నికోస్
- ల్యూక్ కెన్నీ - జేకే లాంబా
- విక్రమ్ సింగ్ చౌహాన్ - కెప్టెన్ అశోక్ నికోస్
- కె.సి.శంకర్ - సిద్ధేశ్వర్ కుమార్
- సత్యదీప్ మిశ్రా - రాజీవ్ దత్తాని
- సాద్ చౌదరి
- రాజేష్ జైస్ - కమిషనర్
మూలాలు
మార్చు- ↑ NTV (20 April 2021). "'రుద్ర'తో అజయ్ దేవగన్ డిజిటల్ ఎంట్రీ". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ Namasthe Telangana (20 April 2021). "డిజిటల్ వరల్డ్‌లోకి స్టార్ హీరో..!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ Eenadu (7 July 2021). "ఓటీటీలో ఈషా దేవోల్". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.
- ↑ Namasthe Telangana (15 June 2021). "సైకో కిల్లర్ పాత్రలో రాశీఖన్నా..!". Archived from the original on 6 March 2022. Retrieved 6 March 2022.