రూపకాలంకారము

(రూపకాలంకారం నుండి దారిమార్పు చెందింది)

ఉపమానోపమేయములకు అభేదం చెప్పుట లేదా ఉపమేయమునందు ఉపమాన ధర్మను ఆరోపించుట రూపకాలంకారం అంటారు. ఉదాహరణ : తిక్కన తాను రచించిన నిర్వచనోత్తర రామాయణమనే కావ్యకన్యకను మనుమ సిద్ధికి అంకితం చేసెను. పై ఉదాహరణమందు కావ్యం అనునది ఉపమేయం. కన్యక అనునది ఉపమానం. ఉపమానోపమేయములకు అభేదం చెప్పుటచే ఇది రూపకాలంకారమైనది. అలంకారకాలు వీటిని ప్రధానంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలుగా విభజించారు. తిరిగి శబ్దాలంకారాలును ఆరుగాను, అర్థాలంకారాలను పదిగా వర్గాకరించారు. [1]

అర్థ వివరణ

మార్చు

ఉపమాన, ఉపమేయములకు భేదమున్నను అభేదము చెప్పుటను రూపకాలంకారం అంటారు.

విశేషణ:

మార్చు
  • భాషావిభాగం
  • నామ వాచకం

పద ప్రయోగాలు

మార్చు

ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము

భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి, ఘోరసం

సారవికారసంతమసజాల విజృమ్భముఁ బాచి, సూరిచే

తోరుచిరాబ్జబోధనరతుం డగు దివ్యుఁ బరశరాత్మజాం

భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్ (శ్రీ ఆంధ్ర మహాభారతము 1-22)

మూలాలు

మార్చు
  1. "అలంకారాలు". www.sakshieducation.com. Retrieved 2020-08-30.