రూపనగుడి నారాయణరావు

రూపనగుడి నారాయణరావు (అక్టోబరు 21, 1881 - ఆగష్టు 30, 1963) [1] బళ్లారికి చెందిన సాహితీశిల్పి. నాటకకర్త.

రూపనగుడి నారాయణరావు
జననంరూపనగుడి నారాయణరావు
అక్టోబరు 21, 1881
మరణంఆగష్టు 30, 1963
బళ్లారి
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి,నాటకకర్త,అనువాదకుడు
మతంహిందూ
భార్య / భర్తగౌరమ్మ
పిల్లలుకృష్ణమూర్తి, వెంకట సుబ్బారావు, సోమసుందరరావు
తండ్రిరూపనగుడి నరసింగరావు
తల్లిసీతమ్మ

జీవిత విశేషాలు మార్చు

రూపనగుడి నారాయణరావు 1881, అక్టోబర్ 28న రూపనగుడి నరసింగరావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడిది హరితస గోత్రము. ఇతని తండ్రి ప్రొద్దుటూరులో మెజిస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బళ్లారిలో స్థిరపడి పోయినందు వల్ల ఇతని బాల్యం బళ్లారిలో గడిచింది. బళ్లారిలోని వార్డ్‌లా హైస్కూలులో విద్యాభ్యాసం జరిగింది. ఇతనికి క్రికెట్, చదరంగం అంటే ఎక్కువ ఇష్టం. ఇతడు ఎఫ్.ఎ. చదువుకొనే సమయంలో ఇతని తండ్రి చనిపోయాడు. దానితో కాలేజీ మానివేసి ఇంటి నుండి ప్రైవేటుగా ఎఫ్.ఎ.పూర్తి చేశాడు. కొన్ని రోజులు బళ్లారిలో తాలూకాఫీసులో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొంది అనంతపురం గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూలులో తెలుగుపండితుడిగా పనిచేశాడు. ఆ తరువాత బళ్లారి, కర్నూలు, రాయచోటి మొదలైన చోట్ల 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1940లో బళ్లారిలో పదవీవిరమణ చేశాడు.

రచనలు మార్చు

నాటకాలు మార్చు

  • విప్రనారాయణ నాటకము (1932)
  • గౌతమబుద్ధుడు (1936) [2]
  • సౌందరనందనము
  • ఉన్మత్త రాఘవము
  • కాకతి రుద్రమాంబ
  • విషాదరామరాజీయము
  • క్షమావతీ విజయము
  • మానవ విజయము

పద్యకృతులు మార్చు

  • పంపాపురీ శతకము
  • కవితానీరాజనము
  • ఆర్యా సుభాషితములు
  • రూపన కుమారభారతము (ద్విపద కావ్యము)

అనువాద గ్రంథాలు మార్చు

  • గీతాంజలి - రవీంద్రనాథ్ టాగూరు
  • మాలిని - రవీంద్రనాథ్ టాగూరు
  • యజ్ఞము - రవీంద్రనాథ్ టాగూరు
  • మొదటి సారాయిబట్టి - టాల్‌స్టాయ్
  • త్రాగుబోతు - టాల్‌స్టాయ్
  • కాళిదాసు
  • భారతీయ ప్రజ్ఞ - అరవిందులు
  • యోగభూమికలు - అరవిందులు
  • జాతీయ విద్యావిధానము - అరవిందులు
  • జీవిత సమస్యలు - సమాధనములు - అరవిందులు
  • మాతృశ్రీ - అరవిందులు
  • పాతకాలం నాటి పలుకులు - మాతృశ్రీ
  • మాతృశ్రీ ప్రార్థనలు -ధ్యానములు
  • శ్రీ అరవింద జీవిత సంగ్రహము
  • విద్య
  • శ్రీ అరవిందుల యోగము - నళినీకాంత్ గుప్త

ఇతర రచనలు మార్చు

  • కావ్యనిదానము
  • శిశుమానసిక శాస్త్రము
  • ఆధ్యాత్మికోపాసన
  • మాతృభాషాబోధిని
  • పరిణయ కథామంజరి[3]
  • కథామణిప్రవాళముక్తావళి
  • ఆంధ్ర వ్యాకరణ దర్పణము
  • నారాయణ తెలుగు వాచకములు
  • నారాయణ తెలుగు ఉపవాచకములు
  • జీవిత చరిత్రము
  • సుధేష్ణ శీలపరిశీలనము
  • వ్యాస మంజూష
  • ఆంధ్రభాష - వ్యవహారికము - గ్రాంథికము

బిరుదులు/సత్కారాలు మార్చు

  • 1956లో హిందూపురము శారదాపీఠము సాహితీశిల్పి అనే బిరుదుతో సత్కరించింది.

మరణం మార్చు

ఇతడు తన 83వ యేట 1963, ఆగస్టు 30న పరమపదించాడు.

మూలాలు మార్చు

  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటం - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. రూపనగుడి, నారాయణరావు (1936). గౌతమబుద్ధుడు.
  3. రూపనగుడి, నారాయణరావు (1933). పరిణయ కథామంజరి. ఆంధ్రవిద్యార్ధి ప్రచురణాలయము. Retrieved 2020-07-13.