దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే మట్టితో చక్కని గూడు కట్టే పక్షి రూఫస్ ఆర్నెరో. మామూలుగా పక్షులు గడ్డిపరకలూ, ఎండు పుల్లలూ, ఆకులూ ఏరుకొచ్చి వివిధ ఆకృతులలో గూళ్లు కట్టుకుంటాయి. కాని ఈ పక్షి మాత్రం మట్టితో పటిష్ఠంగా గూడు నిర్మిస్తుంది. ఈ పక్షి అర్జెంటీనా జాతీయ పక్షిగా పేరు పొందింది. ఈ పక్షి కట్టే గూడు మట్టిపొయ్యిని పోలి ఉండటం వలన ఈ పక్షిని "రెడ్ ఓవెన్ బర్డ్" అంటారు. సాధారణంగా చెట్టు కొమ్మలపై గూడు నిర్మించుకునేందుకు ఇవి ముందుగా ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆపై మెత్తని మట్టి తెచ్చి అంచెలంచెలుగా గూడును నిర్మిస్తాయి. ఇవి తమ గూడును వాతావరణం నుంచి రక్షింపబడేలా పకడ్బందీగా నిర్మించుకుంటాయి. ఇవి గూడును ముందు చుట్టుగా ప్రారంభించి ముందు వైపుకు కట్టుకుంటూ చివరకు ఆ పక్షి దూరేంత ద్వారం మాత్రమే ఉండేలా గూడును నిర్మిస్తాయి. అంతేకాక ఇవి ఆడ, మగ రెండూ పక్షులు కలిసి గూడును కట్టడం విశేషం, అలాగే ఈ పక్షులు ఒకసారి జత కడితే ఆ జంట దాదాపు జీవితకాలం కలిసే ఉంటాయి.

రూఫస్ ఆర్నెరో
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
F. rufus
Binomial name
Furnarius rufus
(Gmelin, 1788)
రూఫస్ ఆర్నెరో పక్షి కూత కొరకు వినండి
బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వేలో సాధారణంగా కనిపించే రూఫస్ ఆర్నెరో గూడు

మూలాలు

మార్చు
  1. BirdLife International (2012). "Furnarius rufus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  • ఈనాడు ఆదివారం - 13-07-2014 చివరి పేజీ (పిట్ట కొంచెం... గూడు ఘనం!)