రెంజల్ మండలం

తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం

రేంజల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

రెంజల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, రెంజల్ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, రెంజల్ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, రెంజల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°46′35″N 77°54′14″E / 18.776316°N 77.903938°E / 18.776316; 77.903938
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం రేంజల్
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 113 km² (43.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,880
 - పురుషులు 19,403
 - స్త్రీలు 19,477
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.82%
 - పురుషులు 57.58%
 - స్త్రీలు 36.52%
పిన్‌కోడ్ 503235

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రెంజల్

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 113 చ.కి.మీ. కాగా, జనాభా 38,880. జనాభాలో పురుషులు 19,403 కాగా, స్త్రీల సంఖ్య 19,477. మండలంలో 9,076 గృహాలున్నాయి.[3]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 38,880 - పురుషులు 19,403 - స్త్రీలు 19,477.అక్షరాస్యత మొత్తం 59.73% -పురుషులు 67.66% - స్త్రీలు 51.95%.

2011 జనగణన సమాచారం ప్రకారం 10 గ్రామాలున్న ఈ మండలంలో 6 గ్రామాల్లో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, మండలంలో కళాశాలలు లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక్క గ్రామంలోనే ఉండగా, 7 గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు నెలకొన్నాయి. అన్ని గ్రామాలకు పంపులు, చేతిపంపుల ద్వారా తాగునీటి సౌకర్యం ఉంది. ఒక గ్రామంలో ప్రధాన పోష్టాఫీసు, 8 గ్రామాల్లో ఉప పోష్టాఫీసులు ఉన్నాయి. మండలం వ్యాప్తంగా ఫోన్, మొబైల్ కవరేజీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని గ్రామాలకు బస్సు, ఆటో సర్వీసులు, విద్యుత్ సౌకర్యం, పౌరసరఫరా కేంద్రాలు ఉన్నాయి. రేంజల్ మండల లింగ నిష్పత్తి సమతౌల్యంగా ఉంది, ఐతే స్త్రీల అక్షరాస్యత శాతం పురుషుల కన్నా 15 శాతం వరకూ వెనుకబడివుంది. మండలంలోని మొత్తం భూమిలో దాదాపు 40 శాతం భూమి సాగుకు ఉపకరించేది కాగా, దానిలో దాదాపు సగం భూమికి సాగునీరు లభిస్తుంది. మండలంలో సగానికి పైగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం పనిచేస్తున్నవారిలో ఎక్కువ భాగం వ్యవసాయ కూలీలుగా జీవితం సాగుస్తూండగా, 19 శాతం వరకూ సాగుచేస్తున్న రైతులు, మరో 12 శాతం మంది కుటీర పరిశ్రమల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు, 25 శాతం మంది ఇతర వృత్తులు చేసుకుంటున్నారు. 6 శాతం మందికి కనీసం ఆరు మాసాలైనా పనిచేసేందుకు పని దొరకడం లేదు.

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. భాగేపల్లె
  2. బోరేగావ్
  3. దూపల్లె
  4. కల్యాపూర్
  5. కందకుర్తి
  6. కూనేపల్లె
  7. నీల
  8. రెంజల్
  9. సాటాపూర్
  10. తాడ్‌బిలోలి

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు