రెండవ వీర భల్లాల
రెండవ వీర బల్లాలా (కన్నడం:ವೀರ ಬಲ್ಲಾಳ) (r. సా.శ.1173–1220) హొయసల సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ చక్రవర్తి. దేవగిరి, దక్షిణ కాలచురిలు, మదురై పాండ్యులు, క్షీణిస్తున్న పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం, తంజావూరులోని క్షీణిస్తున్న చోళులకు వ్యతిరేకంగా ఆయన సాధించిన విజయాలు హొయసలను వారి శక్తి శిఖరాగ్రానికి తీసుకువెళ్ళాయి.[1][2][3][4] చరిత్రకారుడు చౌరాసియా 12 వ శతాబ్దం చివరి నాటికి రెండవ బల్లాలా విజయాలు హొయసలను దక్కను అత్యంత శక్తివంతమైన రాజవంశంగా మార్చాయి.[5] చరిత్రకారుడు డెరెటు అభిప్రాయం ఆధారంగా రెండవ బల్లాలా "హొయశిల రాజులలో అత్యుత్తమమైన పాలకుడు" రెండవ బల్లాలాను విష్ణువర్ధన రాజుతో పోల్చడంలో చరిత్రకారుడు విలియం కోయెల్హో వ్రాస్తూ "ఆయన తన తాతతో కీర్తి సంపాదించడంలో పోటీపడ్డాడు".[6]
రెండవ వీర భల్లాల | |
---|---|
Hoysala King | |
పరిపాలన | సుమారు 1173 – 1220 CE |
పూర్వాధికారి | Narasimha I |
ఉత్తరాధికారి | Vira Narasimha II |
Spouse | Cholamahadevi |
వంశము | Vira Narasimha II, Somaladevi |
రాజవంశం | Hoysala |
ఆయన ఆస్థానం జైన కవులు జన్నా, నేమిచంద్ర, బ్రాహ్మణ కవి రుద్రభట్టతో సహా మధ్యయుగ కన్నడ భాషా కవులలో చాలా మందితో అలంకరించబడింది.[7][8] చరిత్రకారులు చోప్రా, ఇతరుల అభిప్రాయం ఆధారంగా హొయసల రాజ్యం సైఖ్యపరచబడి "హొయసల సామ్రాజ్యం" యుగాన్ని ప్రారంభించి స్వతంత్ర సామ్రాజ్యంగా అయ్యింది.[9] ఆయన నిర్మాణ వారసత్వంలో అనేక దేవాలయాలు అలంకరించబడడం, కేదరేశ్వర ఆలయం, వీర నారాయణ ఆలయం, అమృతేశ్వర ఆలయం ఉన్నాయి.[7] ఆయన కుమారుడు యువరాజు రెండవ వీర నరసింహ, ఆయన భార్య పట్టమహిషి రాణి ఉమదేవి ఆయనకు యుద్ధంలో, పరిపాలనా విషయాలలో బాగా మద్దతు లభించింది. అతని మరొక రాణి చోళమహదేవి చోళ యువరాణి. ఆయన కుమార్తె సోమలదేవి చోళ చక్రవర్తి మూడవ కులోత్తుంగ చోళుడు " తో వివాహం జరిగింది. [7]
పొరుగు రాజ్యాలతో యుద్ధాలు
మార్చుసి.లో హొయసల సింహాసనం మీద రెండవ బల్లాలా అధిరోహించాడు. సా.శ. 1173 ముందు తన బలహీనమైన తండ్రి మొదటి నరసింహ మీద చెంగల్వాలు, కొంగల్వాలు వంటి కొంతమంది మాల్నాడు ముఖ్యుల సహాయంతో చేసిన తిరుగుబాటు విజయవంతం అయింది. తరువాత ఆయన అదే ముఖ్యులు తనకు వ్యతిరేకంగా లేరని నిర్ధారించుకున్నాడు.[6] 12 వ శతాబ్దం చివరలో బలహీనపడుతున్న చాళుక్య సింహాసనం ప్రధాన సామంతులైన యాదవులు, హొయసలు, కలాచురీల మధ్య వివాదానికి దారితీసింది. సా.శ.1168 లో కలాచురి రాజు రెండవ బిజ్జల చాళుక్య రాజధాని బసవకళ్యాణ (అప్పటి కర్ణాటక రాష్ట్రంలోని ఆధునిక బీదరు జిల్లాలో కల్యాణి అని పిలుస్తారు) పై నియంత్రణ సాధించారు. చరిత్రకారుడు కామతు అభిప్రాయం ఆధారంగా c.సా.శ. 1171 లో ప్రతిష్ఠాత్మక బల్లాలా ఉచ్చాంగి కుటుంబానికి చెందిన పాండ్య రాజు కవదేవ మీద సాధించి మొదటి విజయాన్ని రుచి చూశాడు. దీని తరువాత సి సా.శ.1178 లో హంగలును స్వాధీనం చేసుకున్నారు. సి .1179 లో బెల్వోలా -300 మీద దాడి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నంలో హంగలును స్వాధీనం చేసుకున్న కలాచురి సైన్యాధ్యక్షుడు శంకమ చేతిలో ఓటమికి దారితీసింది. చోప్రా, ఇతరుల అభిప్రాయం ఆధారంగా 1179 లో హొయసల భూభాగంలోకి కలచురీ దండయాత్ర ఫలితంగా రెండవ బల్లాలా నామమాత్రంగా కలాచూరీల అధీనతను అంగీకరించి, చాళుక్యులకు వ్యతిరేకంగా వారి వ్యూహాలలో కలాచురీకి సహాయం చేయడానికి అంగీకరించాడు.[6][9][10] ఏదేమైనా, c.సా.శ.1183 నాటికి రెండవ బిజ్జల కుమారులు అసమర్ధ పాలన కారణంగా కలాచూరీలు తీవ్రంగా క్షీణించారు. చివరి చాళుక్య వంశస్త్యుడు నాలుగవ సోమేశ్వర కలాచురి సైన్యాధ్యక్షుడు బ్రహ్మ సహాయంతో తన రాజధాని బసవకళ్యాళి మీద తిరిగి నియంత్రణ తిరిగి సాధించాడు.
కృష్ణ-తుంగభద్ర దోయాబు ప్రాంతంలోని భూభాగాలకు ఇప్పుడు అసలు వివాదం యాదవ రాజు ఐదవ భిల్లమ, హొయసల చక్రవర్తి రెండవ బల్లాలా మధ్య ఉంది.[10] సి సా.శ.1189 నాటికి బసవకాల్యాణను ఐదవ భిల్లామా ఓడించాడు. అయినప్పటికీ రత్తాలు, బనావాసి, కదంబాలు, శిలాహర వంటి చాళుక్య సామంతుల నుండి గుర్తింపు పొందలేకపోయాడు. ఈ అనిశ్చితిని సద్వినియోగం చేసుకొని రెండవ బల్లాలా బహిష్కరించబడిన చాళుక్య రాజు నాలుగవ సోమేశ్వరకు వ్యతిరేకంగా బనావాసికి అనేక దడయాత్రలు చేశాడు. c.సా.శ.1190 నాటికి ఆయనను ఓడించాడు. C.సా.శ.1191 లో హొయసల చక్రవర్తి ఐదవ యాదవ భిల్లమకు వ్యతిరేకంగా సోరటూరు, లక్కుండి (ఆధునిక గడగ్ జిల్లాలో) క్లిష్టమైన యుద్ధాలలో పైచేయి సాధించాడు. అక్కడ ఆయన తన లాభాలను పదిలం చేసుకోవడానికి ఎక్కువ సమయం అక్కడ గడిపినట్లు తెలుస్తుంది. అందువలన రెండవ బల్లాల హొయసల సామ్రాజ్యం ఉత్తర సరిహద్దులను మలప్రభా నది, కృష్ణ నదుల వరకు పరిమితం చేసాడు.[10] C.సా.శ.1192 నాటికి రెండవ బల్లాలా మొత్తం ఆధునిక కర్ణాటక ప్రాంతం మీద తనను తాను చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. అతని నాటి c.సా.శ.1196 వ్రాతపూర్వక ఆధారాలు బనావాసి, హంగలు, హలాషి, నోలంబవాడి (నోలంబా రాజవంశం), బాగలుకోట, గుల్బర్గా (యెల్బుర్గి) వంటి అనేక చిన్న పాలక కుటుంబాల మీద విజయం సాధించినట్లు పేర్కొంది. C.సా.శ.1212 తరువాత ఆయన తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్న ఈ భూభాగాలన్నింటినీ యాదవ రాజు రెండవ సింఘానా చేతిలో కోల్పోయాడు.[7]
చోళులతో సంబంధాలు
మార్చుసా.శ.1216 లో మరవర్మను సుందర పాండ్య మదురై వద్ద సింహాసనాన్ని అధిష్టించారు. చోళ చక్రవర్తి మూడవ కులోతుంగ చోళుడు తన అన్నయ్య జాతవర్మను కులశేఖరుడుని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి చోళ భూభాగం మీద దాడి చేసి, కులోత్తుంగను బహిష్కరించాడు. మూడవ కులోత్తుంగ హొయసల సహాయం కోరాడు.[11][12][13][14][15] పాండ్యులను తిప్పికొట్టి చోళ రాజ్యాన్ని తిరిగి స్థాపించడంలో విజయం సాధించడానికి యువరాజు రెండవ నరసింహ నాయకత్వంలో రెండవ బల్లాలా వెంటనే తన బలగాలను పంపాడు. ఈ విజయంతో రెండవ బల్లాలా చోళరాజ్యప్రతిష్ఠచార్య ("చోళ రాజ్యం స్థాపకుడు"), హొయసల చక్రవర్తి ("హొయసల చక్రవర్తి"), దక్షిణా చక్రవర్తి ("దక్షిణ చక్రవర్తి") వంటి సామ్రాజ్య బిరుదులను స్వీకరించాడు. శ్రీరంగం (మధ్య తమిళనాడు) చుట్టూ ఉన్న గొప్ప కావేరి మైదాన ప్రాంతాలను నియంత్రించి ఆయన తన ప్రత్యక్ష పరిధిలోకి తీసుకువచ్చాడు. తెలుగు చోళూలు, వారి అధిపతులైన కాకతీయ రాజవంశంతో శత్రుత్వం కొనసాగించడానికి హొయసల సైన్యం కంచిలో నిలబడి ఉంది. [11][12][13][14][15] చరిత్రకారుడు జాన్ కీ మాటల్లో చెప్పాలంటే "కన్నడ మాట్లాడే దక్కను అంతటా క్లుప్తంగా హొయసలు ఉంటే. తూర్పు కనుమల క్రింద ఉన్న పచ్చని భూములలో మధ్యవర్తులను ఉంచవచ్చు".[16]
నిర్మాణ కళలో ఆసక్తి
మార్చురెండవ వీర బల్లాలా గొప్ప కన్నడ సాహిత్యానికి పోషకుడు. 13 వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన కన్నడ కవులలో ఒకరైన జన్నా, ఆయన ఆస్థానాన్ని అలంకరించాడు. రెండవ భల్లాల కవిచక్రవర్తి ("కవులలో చక్రవర్తి") బిరుదుతో సత్కరించాడు. ఆయన అత్యంత ముఖ్యమైన రచన, గొప్ప కవిత్వం యశోధర చరిత్రే (c.1209) జైన సిద్ధాంతాలతో వ్యవహరిస్తుంది.[17][18] నెమిచంద్ర రెండవ భల్లాల, ఖోలాపూరు శిలాహర రాజు లక్ష్మణ ఇద్దరికీ ఆస్థాన కవి. ఆయన కన్నడలో లభించిన తొలి శృంగార వాస్తవ కల్పన అయిన లీలవతి ప్రబంధ (సుమారు c.సా.శ.1170), రెండవ బల్లాలా మంత్రి నెమినాథపురాణా అని పిలువబడే అసంపూర్తిగా ఉన్న జైన ఇతిహాసం రాశారు.[8][19] 12 వ శతాబ్దం చివరలో ప్రసిద్ధ బ్రాహ్మణ రచయిత రుద్రభట్ట రాజు, ఆయన మంత్రులలో ఒకరు పోషించారు. ఆయన కన్నడ భాషలో లభించిన తొలి వైష్ణవ ఇతిహాసం c.సా.శ. 1180 లో జగన్నాథ విజయ రచించాడు. చేశాడు.[20][21]
రెండవ బల్లాలా పాలనలో ఆలయ నిర్మాణం విస్తరణ వెసర నిర్మాణానికి కట్టుబడి ఉంది. ఈ శైలి మొదట పాశ్చాత్య చాళుక్యులచే ప్రాచుర్యం పొందింది.[22] ఆయన పాలనలో నిర్మించిన కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు హలేబిడులోని కేదరేశ్వర ఆలయం, బెలవాడిలోని వీర నారాయణ ఆలయం, అమృతుపురలోని అమృతేశ్వర ఆలయం, మోసలేలోని చెన్నకేశవ, నాగేశ్వర దేవాలయాల జంట సమితి ప్రధానమైనవి.[7][23][24]
మూలాలు
మార్చు- ↑ Kamath (1980), pp.126-127
- ↑ Chopra, Ravindran and Subrahmanian (2003), part I, pp.154-155
- ↑ Sastri (1955), p.193
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 58–60. ISBN 978-9-38060-734-4.
- ↑ Radhey Shyam Chaurasia, p.248, History of Ancient India: Earliest Times to 1000 A. D., Atlantic Publishers (2002), New Delhi, ISBN 978-81-269-0027-5
- ↑ 6.0 6.1 6.2 Kamath (1980), p.126
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 Kamath (1980), p.127
- ↑ 8.0 8.1 E.P. Rice (1921), p.43
- ↑ 9.0 9.1 Chopra, Ravindran and Subrahmanian (2003), part I, p.154
- ↑ 10.0 10.1 10.2 Sastri (1955), p.180
- ↑ 11.0 11.1 Kamath (1980), p.129
- ↑ 12.0 12.1 Sastri (1955), pp.193-194
- ↑ 13.0 13.1 Sen 1999, p.499
- ↑ 14.0 14.1 Thapar (2003), p.368
- ↑ 15.0 15.1 Chopra, Ravindran and Subrahmanian (2003) p155, part1
- ↑ Keay (2000), p.252
- ↑ Sastri (1955), pp. 358–359
- ↑ Kamath (1980), p. 133
- ↑ Sastri (1955), p.358
- ↑ Narasimhacharya (1988), p20
- ↑ Sastri (1955), p.364
- ↑ Kamath (1980), p. 134
- ↑ Foekema (1996), p.53
- ↑ Foekema (1996), p.82
వనరులు
మార్చు- Chopra, P.N.; Ravindran, T.K.; Subrahmanian, N (2003) [2003]. History of South India (Ancient, Medieval and Modern) Part 1. New Delhi: Chand Publications. ISBN 81-219-0153-7.
- Kamath, Suryanath U. (2001) [1980]. A concise history of Karnataka: from pre-historic times to the present. Bangalore: Jupiter books. LCCN 80905179. OCLC 7796041.
- Sen, Sailendra Nath (1999) [1999]. Ancient Indian History and Civilization. New Age Publishers. ISBN 81-224-1198-3.
- Sastri, K.A. Nilakanta (2002) [1955]. A history of South India from prehistoric times to the fall of Vijayanagar. New Delhi: Indian Branch, Oxford University Press. ISBN 0-19-560686-8.
- Majumdar, Ramesh Chandra (1977) [1952]. Ancient India. New Delhi: Motilal Banarsidass. ISBN 81-208-0436-8.
- Thapar, Romila (2003) [2003]. The Penguin History of Early India. New Delhi: Penguin Books. ISBN 0-14-302989-4.
- Foekema, Gerard (1996) [1996]. A Complete Guide To Hoysala Temples. New Delhi: Abhinav. ISBN 81-7017-345-0.
- Narasimhacharya, R (1988) [1988]. History of Kannada Literature. New Delhi, Madras: Asian Educational Services. ISBN 81-206-0303-6.
- Rice, E.P. (1982) [1921]. A History of Kanarese Literature. New Delhi: Asian Educational Services. ISBN 81-206-0063-0.
- Keay, John (2000) [2000]. India: A History. New York: Grove Publications. ISBN 0-8021-3797-0.
వెలుపలి లింకులు
మార్చు- History of Karnataka, Arthikaje Archived 2006-11-04 at the Wayback Machine
అంతకు ముందువారు మొదటి నరసింహ |
హొయశిల 1173–1220 |
తరువాత వారు రెండవ వీర నరసింహ |