రెడ్ హ్యాట్ లినక్స్
రెడ్‌హ్యాట్ లినక్స్ అనేది రెడ్‌హ్యాట్ సంస్థచే కూర్చబడిన ఒక ప్రజాదరణ పొందిన లినక్స్ ఆధారిత వ్యవస్థ. [1] ఇది 2004 లో నిలిపివేయబడి తరువాత రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ గా రూపాంతరం చెందింది.
రెడ్ హ్యాట్ చిహ్నం | |
అభివృద్ధికారులు | రెడ్ హ్యాట్ |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్-వంటిది |
పనిచేయు స్థితి | నిలిపివేయబడింది |
మూల కోడ్ విధానం | ఓపెన్ సోర్స్ |
తొలి విడుదల | మే 13, 1995 |
ఇటీవల విడుదల | 9 alias Shrike / మార్చి 31, 2003 |
ప్యాకేజీ మేనేజర్ | RPM ప్యాకేజీ నిర్వాహకం |
Kernel విధము | Monolithic (Linux) |
వాడుకరిప్రాంతము | GNU |
లైెసెన్స్ | పలురకాలు |
Succeeded by | రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ |
తొలిదశవిడుదలలని రెడ్ హ్యాట్ కమర్షియల్ లినక్స్ అనేవారు. మే 1995 లో మొదటి బీటా కాని రూపం విడుదల చేసింది.[2][3] ఇదే తొలిసారిగా ఆర్పిఎమ్ ప్యాకేజీ మేనేజర్ ని వాడినది. దీనితో ప్రేరితమై మాండ్రీవా లినక్స్, యెల్లో డాగ్ లినక్స్ విడుదల అయ్యాయి.
2003 లో, రెడ్ హ్యాట్ దీనిని నిలిపివేసి, గృహాల్లో వాడుకునేందుకు, రెడ్ హ్యాట్ సముదాయం తోడ్పాటుతో తయారైన ఫెడోరా అనే పంపిణీని విడుదల చేసింది. దీనిపై ఆధారపడి, సంస్థలకొరకు రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ (RHEL) విడుదల చేసింది. రెడ్ హ్యాట్ లినక్స్ 9 2004 ఏప్రిల్ 30 తో జీవితం చాలించింది. 2006 వరకు నవీన రూపాలు ఫెడోరా లెగెసీ ప్రాజెక్టు ద్వారా అందిచబడ్డాయి. 2007లో పూర్తిగా ఆపివేయబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Free_Versions_of_Red_Hat_Linux_to_be_Discontinued". fusionauthority.com. Archived from the original on 2012-02-07. Retrieved 2019-08-08.
- ↑ "History of Red Hat Linux". Archived from the original on 2018-07-15. Retrieved 2018-07-14.
- ↑ "The Truth Behind Red Hat/Fedora Names". smoogespace.com. Archived from the original on 2017-12-11. Retrieved 2018-07-14.
- ↑ "The Fedora Legacy Project". fedoralegacy.org. Archived from the original on 2013-09-05. Retrieved 2019-08-08.