రెసుబెల్‌పారా

మేఘాలయ రాష్ట్రంలోని ఉత్తర గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం,

రెసుబెల్‌పారా (రెసు), మేఘాలయ రాష్ట్రంలోని ఉత్తర గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] డామింగ్ నది పక్కన ఈ పట్టణం ఉంది.

రెసుబెల్‌పారా
రెసు
నగరం
రెసుబెల్‌పారా is located in Meghalaya
రెసుబెల్‌పారా
రెసుబెల్‌పారా
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
రెసుబెల్‌పారా is located in India
రెసుబెల్‌పారా
రెసుబెల్‌పారా
రెసుబెల్‌పారా (India)
Coordinates: 25°53′40″N 90°35′59″E / 25.8943300°N 90.5997800°E / 25.8943300; 90.5997800
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాఉత్తర గారో హిల్స్
Government
 • Bodyరెసుబెల్‌పారా పురపాలక సంస్థ
జనాభా
 (2001)
 • Total17,652
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
794108
టెలిఫోన్ కోడ్913659
Vehicle registrationఎంఎల్ - 13

జనాభా

మార్చు
 
2016లో రెసుబెల్‌పారాలో పండుగ ప్రారంభానికి ముందు సాంప్రదాయ దుస్తులలో ఉన్న గారో అమ్మాయిలు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] రెసుబెల్‌పారా పట్టణంలో 17,652 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు పట్టణ సగటు అక్షరాస్యత రేటు 68% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 69% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

రవాణా

మార్చు

రెసుబెల్‌పారాలో రైల్వే స్టేషను ఉంది. సమీప విమానాశ్రయం గువహాటి నగరంలో ఉంది.

పర్యాటక ప్రాంతాలు

మార్చు
  • హాట్ స్ప్రింగ్, బక్రా
  • జోల్డింగ్ వారీ
  • రంగ్డోక్రామ్
  • శివ సుసు (లింగం), నోకాట్
  • రంగోకోరం సరస్సు
  • డ్యాప్
  • డామరింగ్ బీచ్, డెకాచాంగ్

ప్రజలు

మార్చు

ఇక్కడ గారోలు, రభాలు నివసిస్తున్నారు.

ప్రాంతాలు

మార్చు
  • సాంగ్మా
  • రోంగ్ · డిపాంగ్
  • డెకాచాంగ్
  • నంగబురి
  • డిసి కాలనీ
  • మెడికల్ కాలనీ
  • మెపాన్ ఎ బ్రి
  • చిబాగోక్
  • జోంగ్లా
  • రోంగ్‌పేట్చి
  • దరం
  • బక్రా (హాట్ స్ప్రింగ్)
  • బిజెఎన్
  • రీబాగ్రే
  • బోల్సాల్డమ్
  • హలుపారా (వేడి వసంత)
  • బాబుకోనా

పండుగలు

మార్చు
 
2017లో జరిగిన వంగల ఎవ్ వింటర్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శన

ఇక్కడ ప్రతి ఏటా డిసెంబరు నెలలో ఎవ్ వింటర్ ఫెస్టివల్, మిలీనియం ఫెస్టివల్ జరుపుకుంటారు. డ్యాన్స్, రాక్ కన్సర్ట్, గేమ్స్, ఫ్యాషన్ షో వంటి పోటీలు ఇక్కడ నిర్వహించబడుతాయి. ప్రతి ఏటా సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వంగల పండుగను జరుపుకుంటారు. "కట్టా డోక్కా", "అజియా", డాని డోక్కా చంబిల్ మో లేదా పోమెలో డాన్స్ మొదలైనవి ఈ పండుగ సందర్భంగా ప్రదర్శించబడతాయి.

మూలాలు

మార్చు
  1. "Mukul to inaugurate N. Garo Hills today". The Telegraph. Calcutta. 27 July 2012. Retrieved 2 January 2021.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2 January 2021.

ఇతర లింకులు

మార్చు