రేంబుటాన్ (Rambutan) అనేది సాపిండాసే (Sapindaceae) కుటుంబానికి చెందిన ఫల వృక్షము. దీని శాస్త్రీయ నామం నెఫిలియం లెప్పసియం (Nephelium Lappaceum) ఆంగ్లంలో ఈ వృక్షం కాసే కాయలను హెయిరీ లిచ్చీ (Hairy Lychee), రేంబుటాన్ అని అంటారు. ఇండొనేషియా, మలేషియా, థాయ్ లాండ్ వంటి దేశాలు రేంబుటాన్ పుట్టినిళ్ళు. రేంబుటాన్ చెట్లు గాలిలో నీటితేమ (Humidity) శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇటీవల కాలంలో భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోను, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోను కూడా రేంబుటాన్ సాగు మొదలైనది.

Rambutan
Unpeeled and peeled rambutan
Rambutan fruits in bunches
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
N. lappaceum
Binomial name
Nephelium lappaceum
A cluster of yellowish rambutan.

కాయల స్వరూపం

మార్చు

రేంబుటాన్ కాయల తొక్క ఎరుపు లేక పసుపు రంగులో ఉండి అంతటా మెత్తటి ముళ్ళు వ్యాపించి వుంటాయి. కాయల్లో బాదం పప్పు ఆకారంలో తెల్లటి గింజ ఉండి దాని చుట్టూరా తెల్లటి రుచికరమైన గుజ్జు ఉంటుంది. కాయలు తినడానికి కొద్దిగా లిచ్చీ (Lychee) కాయల రుచిని పోలివుంటాయి.

రేంబుటాన్ చెట్లు సుమారు 12 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి . రేంబుటాన్ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుండి మొలకెత్తిన చెట్లు సుమారు 6 - 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. అంట్లు మాత్రము 3 లేక 4 సంవత్సరమునుండి కాపుకొస్తాయి. రైతులు సాధారణంగా నర్సరీలనుండి రేంబుటాన్ అంట్లను కొనుగోలు చేస్తారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరిగే రేంబుటాన్ చెట్లకు కనీసం 200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది. సముద్ర మట్టానికి 10 నుండి 500 మీటర్ల ఎత్తులో రేంబుటాన్ చెట్లు చక్కగా పెరుగుతాయి. నీటి సుదుపాయం పుష్కలంగా ఉండాలి. నీరు నిల్వవుండకుండా తేలికగా నీటిని పీల్చుకోగల మట్టి రేంబుటాన్ చెట్లకు అనువైనది. కాయలు పక్వానికి రావడానికి 4 - 5 నెలలు పడుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మెట్టప్రాంతాలు కూడా రేంబుటాన్ సాగు అనుకూలం.

మార్కెట్

మార్చు

రేంబుటాన్ కాయల ధర సంపన్న వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో పరిచయం లేకపోయినా రేంబుటాన్ కాయలకు హైదరబాద్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై వంటి మెట్రో నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో కాయల ధర సుమారు 650 రూపాయలు పలుకుతున్నది. అయితే రేంబుటాన్ కాయల సాగు గురించి ప్రభుత్వానికి, రైతులకు ఇంకా అవగాహన కలుగవలసియున్నది.

సూచికలు

మార్చు

యితర లింకులు

మార్చు