ఎలుగుబంటి

(ఎలుగుబంట్లు నుండి దారిమార్పు చెందింది)

ఎలుగు, ఎలుగుబంటి లేదా భల్లూకము (ఆంగ్లం: Bear) ఒక క్రూరమృగము. ఇవి అర్సిడే (Ursidae) కుటుంబానికి చెందిన క్షీరదాలు. వీటిని కానిఫార్మిస్ (Caniformis) ఉపక్రమంలో కుక్క వంటి మాంసాహారులుతో చేర్చారు. ఎలుగుబంట్లలో ఎనిమిది జాతులు జీవించి, ప్రపంచమంతటా విస్తరించాయి.

ఎలుగుబంటి
Temporal range: Early Miocene - Recent
Kodiak Brown Bear
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Superfamily:
Family:
అర్సిడే

ప్రజాతులు

Ailuropoda
Helarctos
Melursus
Ursus
Tremarctos
Agriarctos (extinct)
Amphicticeps (extinct)
Amphicynodon (extinct)
Arctodus (extinct)
Cephalogale (extinct)
Indarctos (extinct)
Parictis (extinct)
Plionarctos (extinct)
Ursavus (extinct)
Kolponomos (extinct)

ఆధునిక ఎలుగుబంట్లకు సామాన్యంగా భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి, గరుకైన వెండ్రుకలు, పొట్టి తోకను కలిగివుంటాయి. వీటి పంజాకు ఐదు పదునైన గోర్లుంటాయి. ధృవపు ఎలుగుబంటి మాంసాహారి కాగా పాండా శాకాహారిగా వెదురు చిగుళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. మిగతా జాతులు సర్వభక్షకాలుగా మొక్కల్ని, ఇతర జీవుల్ని తింటాయి.

ఎలుగుబంట్లు ఒంటరిగా జీవించి రాత్రి సమయంలో చురుకుగా తిరుగుతాయి. ఇవి మంచి ఘ్రాణశక్తిని కలిగియుండి భారీగా ఉన్నా కూడా చలాకీగా పరుగెత్తగలవు. ఇవి చెట్లు ఎక్కగలవు, ఈదగలవు. కొన్ని జాతులు చలికాలం కోసం పండ్లను దాచుకుంటాయి.[1] ఇవి గుహలు, పెద్ద గోతులలో నివసిస్తాయి.

ఎలుగుబంట్లు చరిత్రపూర్వం నుండి వీటి మాంసం, చర్మం కోసం వేటాడబడ్డాయి. ఇవి ప్రాచీనకాలం నుండి సంస్కృతి, కళలు మొదలైన వాటిలో ముఖ్య పాత్రను పోషించాయి. ఆధునిక కాలంలో వివిధ కారణాల మూలంగా వీటి ఉనికికి ఆటంకం కలుగుతుంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి ఆరు జాతుల ఎలుగుబంట్లను అంతరించిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించింది.

పోలార్ ఎలుగుబంటి తల్లి తన పిల్లకు పాలిస్తోంది

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో ఎలుగు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[2] ఎలుగును ఎలుగుబంటి, ఎలుగుమంటి, ఎలుగుగొడ్డు అని కూడా పిలుస్తారు. దీనికి బహువచనం ఎలుగులు. ఈ పదాన్ని బిగ్గరగా కూత వేయడానికి కూడా వాడతారు. ఉదా: ఎలుగెత్తి యేడ్చెను.

వర్గీకరణ

మార్చు
 
Brown Bear Ursus arctos, at the Moscow Zoo
 
Asiatic Black Bear Ursus thibetanus, at the Wrocław Zoo, Poland
 
Sun Bear Helarctos malayanus, at the Columbus Zoo
 
Giant Panda Ailuropoda melanoleuca, "Tian Tian"

The genera Melursus and Helarctos are sometimes also included in Ursus. The Asiatic black bear and the polar bear used to be placed in their own genera, Selenarctos and Thalarctos which are now placed at subgenus rank.

పురాణాలలో

మార్చు

మూలాలు

మార్చు
  1. "Slovakia warns of tipsy bears". Archived from the original on 2012-07-06. Retrieved 2008-11-11.
  2. బ్రౌన్ నిఘంటువులో ఎలుగు ప్రయోగాలు.[permanent dead link]