రైలు నడిచే మార్గమును రైలు మార్గం అంటారు. రైలుమార్గం రోడ్డు మార్గమునకు భిన్నముగా ఉంటుంది. ఈ మార్గం రైలు నడిచేందుకు ప్రత్యేకంగా నిర్మించబడివుంటుంది. ఈ మార్గంలో రైలు చక్రాల వంటి చక్రాలు కలిగిన వాహనములు మాత్రమే ప్రయాణించగలవు. ఈ మార్గంపై పట్టాలు ఉంటాయి. వీటిని రైలు పట్టాలు అంటారు. ఈ పట్టాలపైనే రైలు చక్రాలు నడిపించబడతాయి. రైలు పట్టాలు ఒక పట్టాకు మరొక పట్టా ప్రక్కప్రక్కనే ఉంటాయి. వీటి మధ్య దూరం దారి పొడవునా సమంగా ఉంటుంది. పట్టాలు వంగకుండా, కుంగకుండా, పక్కకు జరిగిపోకుండా ఉండేందుకు పట్టాల కింద కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేస్తారు. దిమ్మెలు దిగ్గబడకుండా, రైలు స్వల్ప కదలికలకు అనుగుణంగా పట్టాల స్వల్ప కదలికలకు ఈ పట్టాల వెంబడి లావు కంకర పరచబడి ఉంటుంది. వంతెనలపై, రోడ్డు క్రాసింగ్ ల వద్ద మాత్రం విడి కంకర పరచరు. రైలు పట్టాలు ఇనుప లోహముతో తయారు చేయటం వలన ఈ పట్టాలు చాలా బలంగా ఉంటాయి. అందువలనే ఈ పట్టాలు బలమైన ఇనుప చక్రాలు కలిగిన బరువైన రైలు ప్రయాణించినప్పటికి తట్టుకోగలవు.

భారత దేశంలో ఒక రైలు మార్గం
డీజిలుతో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే)
విద్యుత్తో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే)
రైలు పట్టాలు

చిత్రమాలిక మార్చు

ఇతర లింకులు మార్చు