రోషగాడు (2018 సినిమా)
రోషగాడు 2019లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా.[1] నాగప్రసాద్ సన్నితి సమర్పణలో పార్వతి మిట్టపల్లి నిర్మించిన ఈ సినిమాకు గణేషా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో ‘తిమురు పుడిచావన్' పేరుతో తెలుగులో ‘రోషగాడు' పేరుతో నిర్మించగా విజయ్ ఆంటోని, నివేదా పేతురాజ్, సాయి దీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 16 నవంబర్ 2018న విడుదలైంది.[2]
రోషగాడు | |
---|---|
దర్శకత్వం | గణేశా |
నిర్మాత | పార్వతి మిట్టపల్లి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రిచర్డ్ నాథన్ |
సంగీతం | విజయ్ ఆంటోని |
విడుదల తేదీ | 16 నవంబర్ 2018 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకానిస్టేబుల్ కుమార స్వామి (విజయ్ ఆంటొని ) తన తమ్ముడు రవిని కూడా పోలీస్ ఆఫీసర్ ను చేయాలని అనుకుంటాడు. అతను మాత్రం ఊరు నుండి పారిపోయి హైదరాబాద్ చేరుకుంటాడు. కుమార స్వామికి రెండేళ్ల తర్వాత ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ రౌడీ (బాబ్జి ) దగ్గర తన తమ్ముడు రవి చేరి హత్యలు చేస్తున్నాడని గమనిస్తాడు. రవి చేసే అరాచకాలను చూసిన కుమార స్వామి రవిని ఎన్ కౌంటర్ చేస్తాడు. తన తమ్ముడిలానే కొంతమంది పిల్లలు బాబ్జి కోసం పనిచేస్తున్నారని గమనించిన కుమారస్వామిని వారిని ఎలా మార్చాడు ? కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడు ? ఇంతకీ బాబ్జి ఎవరు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- విజయ్ ఆంటోని
- నివేదా పేతురాజ్
- సాయి దీనా
- లక్ష్మి రామకృష్ణన్
- స్వామినాథన్
- ప్రభాకరన్
- జాక్ రాబిన్
- నిక్సన్
- సంపత్ రామ్
- బల్లా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:
- నిర్మాత: పార్వతి మిట్టపల్లి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గణేషా
- సంగీతం: విజయ్ ఆంటొని
- సినిమాటోగ్రఫీ: రిచర్డ్ నాథన్
మూలాలు
మార్చు- ↑ Sakshi (1 August 2018). "'రోషగాడు'గా బిచ్చగాడు". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
- ↑ The Times of India (12 November 2018). "'Roshagadu': Release date of the Vijay Antony starrer announced" (in ఇంగ్లీష్). Retrieved 9 September 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (16 November 2018). "`రోషగాడు` మూవీ రివ్యూ". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.