రోసెట్టా వ్యోమనౌక
తోకచుక్కపై దిగిన తొలి ఫీలే ల్యాండర్ ను వదలిన వ్యోమనౌక రోసెట్టా . ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) కు చెందిన ఈ రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవంబరు 12, 2014 న ఫీలే ల్యాండర్ను తోకచుక్కపై జారవిడిచింది. ఖగోళ చరిత్రలో ల్యాండర్ ను తొలిసారిగా తోకచుక్కను చేర్చిన ఈ ఘటన ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతం అయింది. ఈ ఘటనతో ఒక తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను చేర్చిన ఘనతను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) సొంతం చేసుకుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు తోకచుక్కలపై అధ్యయనం సహకరిస్తుందని ఈసా సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
మిషన్ రకం | Comet orbiter/lander |
---|---|
ఆపరేటర్ | European Space Agency |
COSPAR ID | 2004-006A |
SATCAT no. | 28169 |
మిషన్ వ్యవధి | 20 సంవత్సరాలు, 8 నెలలు , 23 రోజులు elapsed |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | Astrium |
లాంచ్ ద్రవ్యరాశి | Orbiter: 2,900 కి.గ్రా. (6,400 పౌ.) Lander: 100 కి.గ్రా. (220 పౌ.) |
డ్రై ద్రవ్యారాశి | Orbiter: 1,230 కి.గ్రా. (2,710 పౌ.) |
పే లోడ్ ద్రవ్యరాశి | Orbiter: 165 కి.గ్రా. (364 పౌ.) Lander: 27 కి.గ్రా. (60 పౌ.) |
కొలతలు | 2.8 × 2.1 × 2 మీ. (9.2 × 6.9 × 6.6 అ.) |
శక్తి | 850 watts at 3.4 AU[1] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 2 March 2004, 07:17 | UTC
రాకెట్ | Ariane 5G+ V-158 |
లాంచ్ సైట్ | Kourou ELA-3 |
కాంట్రాక్టర్ | Arianespace |
Flyby of Mars | |
Closest approach | 25 February 2007 |
Distance | 250 కి.మీ. (160 మై.) |
Flyby of 2867 Šteins | |
Closest approach | 5 September 2008 |
Distance | 800 కి.మీ. (500 మై.) |
Flyby of 21 Lutetia | |
Closest approach | 10 July 2010 |
Distance | 3,162 కి.మీ. (1,965 మై.) |
67P/Churyumov–Gerasimenko (67P) orbiter | |
Orbital insertion | 6 August 2014, 09:06 UTC[2] |
Orbit parameters | |
Periapsis | 29 కి.మీ. (18 మై.)[3] |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | S band (low gain antenna) X band (high gain antenna) |
బ్యాండ్ వెడల్పు | 7.8 bit/s (S band) 22 kbit/s (X band)[4] |
Instruments | |
ALICE: Ultraviolet Imaging Spectrometer CONSERT: COmet Nucleus Sounding Experiment by Radio wave Transmission COSIMA: COmetary Secondary Ion Mass Spectrometer GIADA: Grain Impact Analyser and Dust Accumulator MIDAS: Micro-Imaging Dust Analysis System MIRO: Microwave Spectrometer for the Rosetta Orbiter OSIRIS: Optical, Spectroscopic, and InfraRed Remote Imaging System ROSINA: Rosetta Orbiter Spectrometer for Ion and Neutral Analysis RPC Rosetta Plasma Consortium RSI: Radio Science Investigation VIRTIS: Visible and Infrared Thermal Imaging Spectrometer | |
ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న 67పీ తోకచుక్క సెకనుకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. 67పీ తోకచుక్కపై ల్యాండర్ ను దించడానికి ఈ వ్యోమనౌక దాని చుట్టూ తిరుగుతూనే తోకచుక్క సమీపానికి వెళ్లి ల్యాండర్ ను జారవిడిచింది. తోకచుక్కను చేరుకున్న ల్యాండర్ తోకచుక్కపై తన మరలను దించి గట్టిగా పట్టుకున్నది.
ఇవి కూడా చూడండి
మార్చు- ఫీలే ల్యాండర్ - తోకచుక్కను చేరుకున్న తొలి ల్యాండర్.
మూలాలు
మార్చు- సాక్షి దినపత్రిక - 13-11-2014 - (తోకచుక్కపై తొలి అడుగు!)
- ↑ "Rosetta at a glance – technical data and timeline". DLR. Archived from the original on 8 జనవరి 2014. Retrieved 13 నవంబరు 2014.
- ↑ "Rosetta timeline: countdown to comet arrival". European Space Agency. 5 August 2014. Retrieved 6 August 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;esa20140910
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "No. 2 – Activating Rosetta". European Space Agency. 8 March 2004. Retrieved 8 January 2014.