రోహిణి (ఉపగ్రహం)

ఇస్రో ప్రయోగించిన నాలుగు ప్రయోగాత్మక ఉపగ్రహాల శ్రేణి

రోహిణి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహాల శ్రేణి. రోహిణి శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయి, వీటన్నిటినీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ( SLV ) [1] ద్వారా ప్రయోగించారు. వాటిలో మూడు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించాయి. ఈ శ్రేణిలో ప్రధానంగా ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి.

రోహిణి
తయారీదారుఇస్రో
తయారీ దేశంభారతదేశం
ఆపరేటరుఇస్రో
అప్లికేషన్లుప్రయోగాత్మక ఉపగ్రహాలు
సాంకేతిక వివరాలు
డిజైను జీవిత కాలం8
ప్రయోగ సమయంలో ద్రవ్యరాశి30–41.5 kilograms (66–91 lb)
కొలతలు360
శక్తి3 watts (RTP)
16 watts (others)
పరికరాలువాహక నౌక పర్యవేక్షణ
సాలిడ్ స్టేట్ కెమెరా (RS-D2)
రెజీమ్400km వృత్తాకార భూ నిమ్న
ఉత్పత్తి
స్థితిజీవితం ముగిసింది
ప్రయోగించినది4
విశ్రాంత2
పోయినది2
మొదటి ప్రయోగంరోహిణీ టెక్నాలజీ పేలోడ్
1979 ఆగస్టు 10
చివరి ప్రయోగంరోహిణి ఆర్‌ఎస్-డి2
1983 ఏప్రిల్ 17
చివరి రెటైరుమెంటురోహిణి ఆర్‌ఎస్-డి2
Related spacecraft
Derived from6
Derivatives5

శ్రేణిలో ఉపగ్రహాలు మార్చు

రోహిణి టెక్నాలజీ పేలోడ్ (RTP) మార్చు

అది 35 kg (77 lb) ప్రయోగాత్మక స్పిన్ స్థిరీకరించిన ఉపగ్రహం. ఇందులో 3 W శక్తి సామర్థ్యం ఉంది. దీన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 1979 ఆగస్టు 10 న ప్రయోగించారు. [2] వాహక నౌక అయిన ఎస్సెల్వీ3 'పాక్షికంగానే విజయవంతమైంది' కాబట్టి ఉపగ్రహం అనుకున్న కక్ష్య లోకి వెళ్ళలేకపోయింది.

RS-1 మార్చు

అది కూడా 35 kg (77 lb) ప్రయోగాత్మక స్పిన్ స్థిరీకరించిన ఉపగ్రహం. 16 W శక్తి సామర్థ్యం ఉన్న ఈ ఉపగ్రహాన్ని 1980జూలై 18 న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం [3] నుండి 44.7° వంపుతో, 305 km × 919 km (190 mi × 571 mi) కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించారు. స్వదేశీ ప్రయోగ వాహనం ఎస్సెల్వీ3 ద్వారా విజయవంతంగా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఇది. ఇది ఎస్సెల్వీ3 లోని నాల్గవ దశకు సంబంధించిన డేటాను అందించింది. ఉపగ్రహానికి 1.2 సంవత్సరాల మిషన్ జీవితకాలం, 20 నెలల కక్ష్యా జీవితకాలం ఉంది.

RS-D1 మార్చు

అది 38 kg (84 lb) ప్రయోగాత్మక స్పిన్ స్థిరీకరించిన ఉపగ్రహం. ఇందులో 16 W శక్తి సామర్థ్యం ఉంది. 1981 మే 31 న దీన్ని ప్రయోగించారు. [4] SLV3 ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది. దీంతో ఉపగ్రహం అనుకున్న ఎత్తుకు చేరుకోలేదు, కేవలం 9 రోజులు మాత్రమే కక్ష్యలో ఉంది. ఇది 46° వాలు ఉన్న 186 km × 418 km (116 mi × 260 mi) కక్ష్య లోకి చేరింది. ఉపగ్రహంలో, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్‌ల (ల్యాండ్‌మార్క్ ట్రాకర్) కోసం సాలిడ్ స్టేట్ కెమెరా ఉంది. ఇది ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేసింది.

RS-D2 మార్చు

ఇది 16 W శక్తి సామర్థ్యం ఉన్న 41.5 kg (91 lb) ప్రయోగాత్మక స్పిన్ స్థిరీకరించిన ఉపగ్రహం. దీన్ని 1983 ఏప్రిల్ 17 న [5] 46° వాలుతో, 371 km × 861 km (231 mi × 535 mi) కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించారు. వంపు. ఉపగ్రహం 17 నెలలపాటు (మిషన్ లైఫ్) పనిచేసింది. దాని ప్రధాన పేలోడయిన స్మార్ట్ సెన్సార్ కెమెరా, 2500 చిత్రాలను తీసింది. ఈ కెమెరాకు కనిపించే బ్యాండ్ లోను, ఇన్‌ఫ్రారెడ్ బ్యాండ్‌ లోనూ చిత్రాలను తీయగల సామర్థ్యం ఉంది. 7 సంవత్సరాల కక్ష్యా జీవితం తర్వాత, ఉపగ్రహం 1990 ఏప్రిల్ 19 న భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించి మండిపోయింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "SLV". ISRO.gov. ISRO. 25 October 2015. Archived from the original on 29 మే 2017. Retrieved 25 October 2015.
  2. "RTP". ISRO.gov. ISRO. 25 October 2015. Archived from the original on 31 జూలై 2017. Retrieved 25 October 2015.
  3. "RS-1". ISRO.gov. ISRO. 25 October 2015. Archived from the original on 31 జూలై 2017. Retrieved 25 October 2015.
  4. "RS-D1". ISRO.gov. ISRO. 25 October 2015. Retrieved 25 October 2015.[permanent dead link]
  5. "RS-D2". ISRO.gov. ISRO. 25 October 2015. Retrieved 25 October 2015.[permanent dead link]