లంకాదహనం
(లంకా దహనం నుండి దారిమార్పు చెందింది)
లంకాదహనం చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి.ఎస్. నటేశన్ అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేదో ఎవరికీ అంతుపట్టలేదు.[1]
లంకాదహనం (1936 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కాళ్ళకూరి సదాశివరావు |
---|---|
తారాగణం | కళ్యాణం రఘురామయ్య, సి.ఎస్. నటేశన్ |
నిర్మాణ సంస్థ | రాధ ఫిల్మ్ కంపెనీ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాత్రలు - పాత్రధారులుసవరించు
ఈ చిత్రంలో నటించిన నటీనటులు వారు ధరించిన పాత్రలు[2] :
- హనుమంతుడు - సి.యస్.నటేశన్
- శ్రీరాముడు - భీమరాజు గురుమూర్తిరావు
- లక్ష్మణుడు - ఎం.మల్లికార్జునరావు
- రావణుడు - పిప్పళ్ల రామకృష్ణారావు నాయుడు
- విభీషణుడు - కళ్యాణం రఘురామయ్య
- ఇంద్రజిత్తు - జె.రామకృష్ణారావు నాయుడు
- మారీచుడు & సుగ్రీవుడు - డి.నరసింహారావు
- జటాయువు - కె.వెంకట్రాజు
- సీత - దాసరి కోటిరత్నం
- త్రిజట - కె.వి.రవణమ్మ
- మండోదరి - సి.హెచ్.రాజరత్నం
- భూదేవి - ఎ.సామ్రాజ్యం
- తార - స్వరాజ్యం
- శూర్పణఖ - సి. ఎన్. రాజారావు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: కాళ్ళకూరి సదాశివరావు
- నిర్మాణసంస్థ: రాధ ఫిల్మ్ కంపెనీ