లంక సత్యానంద్ నట శిక్షకుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత. సత్యానంద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితర సుమారు 80 మంది కథానాయకులను నటులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.[1]

బాల్యం మార్చు

సత్యానంద్ బాల్యం నుంచే నాటకాల మీద ఆసక్తి కనబరచేవాడు. ఏడేళ్ళ వయసులో విధి అనే నాటకంలో నటించాడు. ఆ నాటకానికి ముఖ్య అతిథిగా వచ్చని యస్వీ రంగారావు చేతులమీదుగా బహుమతి అందుకున్నాడు.

నాటకాలు మార్చు

ఇరవయ్యేళ్ళ వయసులో శంకరాభరణం ఫేమ్ సోమయాజులు నటించిన అడవి దివిటీ అనే నాటకానికి దర్శకత్వం వహించాడు. అది ఒకే థియేటర్ లో 51 రోజులు నడిచింది. బొమ్మలాట అనే నాటకం 102 రోజులపాటు టికెట్ షోగా ప్రదర్శితమై జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 98 సార్లు ఉత్తమ నాటక దర్శకుడిగా వేర్వేరు పురస్కారాలు అందుకున్నాడు.[2]

విశేషాలు మార్చు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థి సత్యానంద్ గారి దర్శకత్వ శైలి ఒక పరిశీలన అనే అంశంపైన పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా అందుకున్నాడు.

పురస్కారాలు మార్చు

2017లో అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ నుండి సరిలేరు నీకెవ్వరు విశిష్ట నాటక రచనా పురస్కారం అందుకున్నాడు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (7 January 2017). "నాటకమే నిత్యానందం". www.andhrajyothy.com. బి.వి. అప్పారావు. Archived from the original on 4 నవంబరు 2019. Retrieved 4 November 2019.
  2. ఈనాడు ఆదివారం సెప్టెంబరు 7, 2014