లండ‌న్ బాబులు 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ బ్యానర్ పై మారుతి నిర్మించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ దర్శకత్వం వహించాడు. స్వాతి, రక్షిత్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 నవంబర్ 2017న విడుదలైంది.

లండ‌న్ బాబులు
దర్శకత్వంచిన్నికృష్ణ
రచనఎం.మనికందన్
నిర్మాతమారుతి
తారాగణంస్వాతి, రక్షిత్, మురళీ శర్మ
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుఎస్.బి.ఉద్దవ్
సంగీతంకె
నిర్మాణ
సంస్థ
మారుతి టాకీస్
విడుదల తేదీ
17 నవంబర్ 2017
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గాంధీ (ర‌క్షిత్‌) కి అన్నీ క‌ష్టాలే. ఊరి నిండా అప్పులున్న గాంధీ లండ‌న్ వెళ్లి, బాగా డ‌బ్బు సంపాదించి తిరిగి రావాల‌నుకొంటాడు. త‌న స్నేహితుడు (స‌త్య‌)తో క‌ల‌సి హైద‌రాబాద్ వ‌స్తాడు. ఇక్క‌డ బ్రోక‌ర్ (జీవా)ని క‌లుస్తాడు. పాస్ పోర్ట్ అప్లికేష‌న్‌లో పెళ్ల‌య్యింద‌ని రాస్తే, వీసా త్వ‌ర‌గా వ‌స్తుంద‌న్న మాట‌లు న‌మ్మి ‘భార్య‌’ పేరు ద‌గ్గర అనుకోకుండా ‘సూర్య‌కాంతం’ అని పేరు రాస్తాడు. అందుకే ఆ చిన్న త‌ప్పు ర‌క్షిత్‌ని ఎలాంటి స‌మ‌స్య‌ల్లోకి నెట్టింది? అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?? సూర్య‌కాంతం (స్వాతి) అనే టీవీ రిపోర్ట‌ర్‌కీ, గాంధీకి ప‌రిచ‌యం ఎలా అయ్యింది?? అస‌లు గాంధీ లండ‌న్ వెళ్లాడా? లేదా ?? అనేదే మిగతా సినిమా క‌థ‌.[1][2]

నటీనటులు

మార్చు
  • స్వాతి [3]
  • రక్షిత్ [4]
  • మురళీ శర్మ
  • ఆలీ
  • రాజార‌వీంద్ర‌
  • జీవా
  • ధ‌న‌రాజ్‌
  • స‌త్య‌
  • అజ‌య్ ఘోష్
  • సాయి పంపాన
  • వేణు
  • స‌త్య‌కృష్ణ

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మారుతి టాకీస్
  • నిర్మాత: మారుతి
  • దర్శకత్వం: చిన్నికృష్ణ
  • కథ: ఎం.మనికందన్
  • సంగీతం: కె
  • సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
  • ఎడిటర్: ఎస్.బి.ఉద్దవ్
  • ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కోసనం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్

మూలాలు

మార్చు
  1. The Times of India (17 November 2017). "London Babulu Review {2.5/5}: The chemistry between the lead pair is just not established and it is unfortunate because there was ample scope for it". Archived from the original on 7 August 2021. Retrieved 7 August 2021.
  2. Mana Telangana (18 November 2017). "మంచి వినోదంతో మెప్పించిన 'లండన్ బాబులు'". Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.
  3. Sakshi (6 May 2017). "కలర్స్ బ్యూటి కొత్త సినిమా". Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.
  4. "నవ్యమైన సినిమాలు చేసి మంచి నటుడిగా పేరుతెచ్చుకుంటా". 13 November 2017. Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.