లక్ష్మణ్‌చాందా మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం

లక్ష్మణ్‌చందా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] లక్ష్మణ్‌చాందా, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

లక్ష్మణ్‌చందా మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లక్ష్మణ్‌చందా మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లక్ష్మణ్‌చందా మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, లక్ష్మణ్‌చందా మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°05′54″N 78°18′07″E / 19.098458°N 78.302078°E / 19.098458; 78.302078
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం లక్ష్మణ్‌చాందా
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,739
 - పురుషులు 17,515
 - స్త్రీలు 19,224
అక్షరాస్యత (2011)
 - మొత్తం 38.83%
 - పురుషులు 52.34%
 - స్త్రీలు 26.36%
పిన్‌కోడ్ 504106

గణాంక వివరాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 34,739 - పురుషులు 17,515 - స్త్రీలు 19,224. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 126 చ.కి.మీ. కాగా, జనాభా 30,389. జనాభాలో పురుషులు 14,453 కాగా, స్త్రీల సంఖ్య 15,936. మండలంలో 7,744 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వద్యాల్
  2. కంకాపూర్
  3. నర్సాపూర్
  4. బోరెగావ్
  5. కంజర్
  6. బాబాపూర్
  7. పోతపల్లి
  8. తిర్పల్లి
  9. లక్ష్మణ్‌చందా
  10. పీచర
  11. ధర్మారం
  12. పర్పల్లి
  13. పొత్‌పల్లి
  14. మల్లాపూర్
  15. మాచాపూర్
  16. మునిపల్లి
  17. చమన్‌పల్లి
  18. చింతల్‌చందా

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.