లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (దేవునిపల్లి)

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో ఉన్న ఒక దేవాలయం.

లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో ఉన్న ఒక దేవాలయం.[1] కొండపైన ఉన్న ప్రధాన దేవాలయంలో నరసింహస్వామి కొలువై ఉండగా, కొండ కింద మరో రెండు దేవాలయాలు నిర్మించబడ్డాయి. దేవులపల్లి నరసింహస్వామి స్వయంభు అని అంటారు. కొండ గుహలో స్వామి నామాలు (నరసింహుడి చిహ్నం), పాద ముద్రలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత రథోత్సవంతో అయిదు రోజుల వేడుకలు జరుగుతాయి.[2]

లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం is located in Telangana
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :18°40′N 79°24′E / 18.66°N 79.40°E / 18.66; 79.40
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:పెద్దపల్లి జిల్లా

చరిత్ర

మార్చు

కొండపై నుంచి భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి సమీపంలోని ఇళ్లపై పడకుండా వాలు అంచు వద్ద ఆగింది. ఆ సమయంలో రాయి రెండు ముక్కలుగా విరిగి, ఆ రాయి నుండి నరసింహస్వామి ఉద్భవించాడు. మరుసటి రోజు స్వామి ఒక గ్రామస్తుడి కలలో కనిపించి, తనకి ఆలయం నిర్మించమని కోరగా, ఆ గ్రామస్తుడు ఉదయం వెళ్ళిచూసేసరికి ఆ కొండపై స్వామి నామాలు, పాదముద్రలు కనిపించాయి. ఈ దేవాలయాన్ని జైనులు నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. హిందూ దేవాలయాలన్నీ తూర్పు దిక్కుగా ఉండగా, ఇక్కడి దేవాలయాలు పడమర వైపు ఉన్నాయి.

ప్రతిఏటా జరిగే జాతరలో నిత్యార్చన, భగవత్ పుణ్యవచనం, అంకుర్పారణం, దేవతాహ్వానం, ధ్వజారోహణం, గరుడాదివాసం, తిరు కళ్యాణం మమక్షత్సవం, తీర్ధ ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి.[3]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "వైభవంగా కొనసాగుతున్న దేవునిపల్లి జాతర". www.publicvibe.com. Archived from the original on 2021-09-06. Retrieved 2021-09-06.
  2. "దేవునిపల్లి జాతర ఆదాయం రూ. 6.47లక్షలు - Telangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-09-06.
  3. వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, ఆంధ్రభూమి, పెద్దపల్లి రూరల్, కరీంనగర్ జిల్లా ఎడిషన్, 15 నవంబరు 2016