పెద్దపల్లి జిల్లా
తెలంగాణ లోని జిల్లా
పెద్దపల్లి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాలోనివి.
పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు
మార్చుఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ( పెద్దపల్లి, మంథని,), 14 రెవెన్యూ మండలాలు, 215 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 8 నిర్జన గ్రామాలు. పునర్య్వస్థీకరణలో 3 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
స్థానిక స్వపరిపాలన
మార్చుజిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 261 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]
జిల్లాలోని మండలాలు
మార్చుగమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)
సరిహద్దులు
మార్చు- ఉత్తరం= మంచిర్యాల
- తూర్పు=జయశంకర్ భూపాలపల్లి
- దక్షిణం= కరీంనగర్
- నైరుతి= కరీంనగర్
- పశ్చిమ= జగిత్యాల
పర్యాటక ప్రదేశాలు
మార్చు- గౌరీగుండాలు
- పెద్దపల్లి జిల్లాలోని జలపాతాలు
- రాఘవాపూర్ జలపాతం పెద్దపల్లి
చారిత్రాక ప్రదేశాలు
మార్చు1.ధూళి కట్ట బౌద్ధ స్తూపం-ఎలిగెడు మండలం
2.రామగిరి ఖిలా-రామగిరి మండలం[3]
దేవాలయాలు
మార్చు- బుగ్గ రామస్వామి దేవాలయం- పాలకుర్తి
- జనగామ త్రిలింగేశ్వరాలయం-జనగామ
- శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం- ఓదేల
- లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం-కమాన్ పూర్
- లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (దేవునిపల్లి)
కొండలు
మార్చు- రామగిరి కొండలు
- పాండవ లంక కొండలు
విశేషాలు
మార్చురామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.
- ↑ ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా (8 August 2021). "కనువిందు చేస్తున్న జలపాతాలు". andhrajyothy. కుందారపు సతీష్. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.