లక్ష్మీ నారాయణ హిందూ దేవాలయం (బ్రాడ్‌ఫోర్డ్)

ఉత్తర ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం

లక్ష్మీ నారాయణ హిందూ దేవాలయం ఉత్తర ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం.[1] స్థానిక యార్క్‌షైర్ వాస్తుశిల్పులు ఈ దేవాలయాన్ని రూపొందించారు. దేవాలయం యార్క్‌షైర్ రాతితో నిర్మించబడింది.

బ్రాడ్‌ఫోర్డ్ లక్ష్మీ నారాయణ హిందూ దేవాలయం

సంస్థ ఏర్పాటు సవరించు

హిందూ సమాజ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక సంస్థను స్థాపించడానికి కెకె మిట్టల్, సక్సేనా, జగదీష్ చావ్లా, పిఎన్ చావ్లా, పోప్లీ, భోలా, బల్వంత్ రాయ్ శారదా, పండిట్ హరి క్రిషన్ శర్మ, రామ్ పియరీ శర్మ, డిఎన్ ప్రభాకర్, తీరత్ రామ్ శర్మ, సోహన్ లాల్ ధరి, రాజ్ పాల్ ధరణి తదితరులు కలిసి 1968లో బ్రాడ్‌ఫోర్డ్ హిందూ కల్చరల్ సొసైటీని ఏర్పాటు చేశారు. జగదీష్ చావ్లా ఈ సొసైటీకి తొలి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యాడు. దేవాలయ నిర్మాణంకోసం అనువైన స్థలానికి ప్రయత్నం చేశారు. అయితే తొలి ప్రయత్నంగా బ్రాడ్‌ఫోర్డ్ 7లో ఒక ఇంటిని కొనుగోలు చేసి టెర్రేస్డ్ హౌస్‌లో దేవాలయాన్ని ఏర్పాటు చేసింది.[2]

నిర్మాణం సవరించు

ఆ తరువాత 1973 జూలైలో, బ్రాడ్‌ఫోర్డ్ హిందూ కల్చర్ సొసైటీ నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, దేవాలయాన్ని స్థాపించారు. 1974 ఆగస్టు 3న బ్రాడ్‌ఫోర్డ్ చుట్టూ దేవతల ఊరేగింపు నిర్వహించి, మూర్తి స్థాపన జరిగింది. బ్రాడ్‌ఫోర్డ్ నగరంలో మొదటి హిందూ దేవాలయమిది. ఆధునిక డిజైన్, సమకాలీన యార్క్‌షైర్ శైలీలో భాగంగా హిందువుల సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.[3] ఈ దేవాలయంలో లక్ష్మీ నారాయణతోపాటు ఇతర ప్రధాన దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి.[4]

కొత్త దేవాలయం సవరించు

బ్రాడ్‌ఫోర్డ్, చుట్టుపక్కల ప్రాంతాలలో హిందువుల సంఖ్య పెరుగుతుండడంతో వారి అధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఒక కొత్త ఆలయాన్ని నిర్మించడానికి ఏ.పి. ధరణి అధ్యక్షతన బిల్డింగ్ కమిటీని ఏర్పాటు చేయబడింది. రాజీవ్ దేవీది, పుష్పా ప్రభాకర్, సరోజ్ జోషి, బల్దేవ్ క్రిషన్ భరద్వాజ్, సుభాష్ ధరణి, నీలం దేవేర్ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు. కొత్త దేవాలయం ప్రాజెక్ట్ బిల్డింగ్ కమిటీకి కో-ఆర్డినేటర్‌లుగా కమల్ జిత్ శర్మ, అశోక్ నాయర్ నియమితులయ్యారు.

2006 మే 14న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి బ్రెన్‌విల్లే నిర్మాణ సంస్థకు £2.7 మిలియన్ల కాంట్రాక్ట్‌ను అందించారు. ధర్మరత్న హెచ్‌హెచ్ స్వామి శ్రీ గోపాల్ శరణ్ దేవాచారయ జీ మహారాజ్‌ 2007 మే 5న మొదటిసారిగా దేవాలయాన్ని సందర్శించాడు. ప్రధాన దేవుడిగా శ్రీ లక్ష్మీ నారాయణుని ప్రతిష్టించాలని, దేవాలయానికి శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయం అని పేరు పెట్టాలని నిర్ణయించబడింది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ 2007 మే 24న దేవాలయాన్ని అధికారిక ప్రారంభోత్సవంలో పాల్గొన్నది.[2]

మూలాలు సవరించు

  1. Evans, Fiona (2006-05-15). "£3m Hindu temple soon to take shape". Telegraph and Argus. Bradford.
  2. 2.0 2.1 "History – Hindu Cultural Society of Bradford". Archived from the original on 2022-01-26. Retrieved 2022-05-14.
  3. "Faith creates a £3m Temple" Bradford Telegraph and Argus feature.
  4. Prabhu Prana Pratistha, A book given to congregation at dedication ceremony of temple.

బయటి లింకులు సవరించు