లఖిసరాయ్ జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో లఖిసరాయ్ జిల్లా ఒకటి. లఖిసరాయ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. లఖిసరాయ్ జిల్లా లఖిసరాయ్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 1228 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 8,01,173.

లఖిసరాయ్ జిల్లా
लक्खिसराय जिला
బీహార్ పటంలో లఖిసరాయ్ జిల్లా స్థానం
బీహార్ పటంలో లఖిసరాయ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుముంగేర్
ముఖ్య పట్టణంలఖిసరాయ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుముంగేర్
విస్తీర్ణం
 • మొత్తం1,228 కి.మీ2 (474 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం10,00,717
 • జనసాంద్రత810/కి.మీ2 (2,100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.95 %
 • లింగ నిష్పత్తి900
Websiteఅధికారిక జాలస్థలి

వ్యవసాయం

మార్చు
  • వ్యవసాయం:- వరి, గోధుమలు, మెంతులు.
  • నదులు: గంగా, మొహానే, హరోహర్.

చరిత్ర

మార్చు

1994 జూలై 3 న ముంగర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి లఖిసరాయ్ జిల్లాను రూపొందించారు. ఈ ప్రాంతం లఖిసరాయ్ డివిజన్‌లో ఉపవిభాగం.

భౌగోళికం

మార్చు

లఖిసరాయ్ జిల్లా వైశాల్యం 1228 చ.కి.మీ.[1] ఇది పపౌ న్యూ గునియాదేశ న్యూ హనోవర్ ద్వీపం జసంఖ్యకు సమానం.[2]

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లఖిసరాయ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

పరిశ్రమలు

మార్చు

జిల్లాలో పలు ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. లఖిసరాయ్ నగరంలో బీహార్ మినరల్ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో వస్త్రాలతయారీ సంస్థలు ఉన్నాయి. జిల్లాలో పలు దుకాణాలు అంచనాలను మించి పనిచేస్తున్నాయి.

విభాగాలు

మార్చు

జిల్లాలో 1 ఉపవిభాగం ఉంది. జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి ( లఖిసరాయ్, సూర్య గర్హ, బరహై,,హల్సి, పిపారియా, రాంగర్). జిల్లాలో భూమిహార్ - బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. పిరిబజార్, చనాన్ పోలీస్ స్టేషన్లు భౌగోళికంగా నక్సల్ బాధిత ప్రదేశంగా ఉంది. సింధూర్ తయారీకి జిల్లా ప్రసిద్ధిచెందింది.

లఖిసరాయ్ జిల్లాలో అశోక్‌ధాం ఆలయం, అభైపూర్ వద్ద భగవతి స్థాన్ ఆలయం, అభైపూర్ గ్రామం వద్ద ఉన్న కొండల వద్ద ఉన్న అభయ్‌నాథ్ ఆలయం, బరాహియా వద్ద ఉన్న మహారాణి ఆలయం, మనో - రాంపూర్ వద్ద ఉన్న బాబా గోవిందాలయం, శృంగిర్షి పర్వతాలు, అలిఘర్ పనచాయితీలోని పొఖ్రమ గ్రామంలో ఉన్న సూర్య మందిర్ ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఈ గ్రామంలో ప్రవేశించడం, బుద్ధుని అవశేషాలు ఉండడం వలన ఈ గ్రామం ఏర్పడింది.

గ్రామాలు

మార్చు

లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో దరియాపూర్ గ్రామం ఒకటి. ఇది ప్రస్తుతం లఖిసరాయ్ బ్లాకులో ఉంది.

విషషయం వివరణ
ప్రధాన గ్రామం లఖిసరాయ్
జనసంఖ్య 953
అక్షరాస్యత 43.72%.
పురుషుల అక్షరాస్యతt 59.05%.
స్త్రీల అక్షరాస్యత 28.53%.

దరియాపూర్

మార్చు
విషయం వివరణ
గ్రామీణ కుటుంబాలు 142
పురుషులు 98.96% (బీహార్ 91.93%)
అక్షరాస్యత 43.72% (బీహార్ 47%)
పురుషుల 58.56%.
స్త్రీల 28.53%
శ్రామికులు 54.33%
పురుషులు 63.54%
స్త్రీలు 44.92%
దినసరి కూలీ చేసే పురుషులు 30.17%
పురుషులు 52.76%
స్త్రీలు 7.06%
అవసరార్ధం 24.16%
పురుషులు 10.77%
స్త్రీలు 37.85%
పనిచేయని వారు 45.67%
పురుషులు 36.46%
స్త్రీలు 55.08%

అలినగర్

మార్చు
జనసంఖ్య 4000
అక్షరాస్యత 64%
ప్రధాన వృత్తి వ్యవసాయం
స్త్రీలు 40%
రైల్వేస్టేషను కజ్ర
రహదారి జాతీయ రహదారి 80

నంద్నామా

మార్చు

లఖిసరాయ్ జిల్లాలోని గ్రామాలలో నంద్నామా గ్రామం ఒకటి. జిల్లా కేంద్రం లఖిసరాయ్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది. రాష్ట్ర కేంద్రం పాట్నాకు 117 కి.మీ దూరంలో ఉంది.

అభైపూర్

మార్చు
  • అభైపూర్:- లఖిసరాయ్ గ్రామంలో పెద్దగ్రామం.

హల్సి

మార్చు
  • లఖిసరాయ్ శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో హల్సి గ్రామం ఒకటి.
  • పోస్ట్ ఆఫీసు
  • ప్రభుత్వ ఆసుపత్రి
  • పోలీస్ స్టేషను స్టేషను
  • బ్లాక్ & వివిధ ప్రభుత్వ కార్యాలయాలు
  • ప్రభుత్వ. 10 + 2 స్కూల్ & ఆట మైదానాలు సహా 8 వ తరగతి వరకు రెండు మధ్య పాఠశాలలు.
  • గ్రామ-పంచాయతీ, రాషణ్ పంపిణీ సెంటర్ & గ్యాస్ ఏజెన్సీ
  • 2 పెద్ద చెరువులు, వ్యవసాయ కాలువలు
  • వ్యవసాయం సెంటర్ (క్రిషి కేంద్ర)
  • పలు బ్యాంకులు ఎ.టి.ఎం సౌకర్యాలు ఎస్బిఐ శాఖ సహా
  • టవర్లు : బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, టాటా డొకొమొ సహా వివిధ నెట్వర్క్ల
  • 2 చెరువులు, కాలువల నీటిపారుదల ప్రయోజనాల కోసం
  • మార్కెట్. పెట్రోల్ పంపులు సహా అన్ని సాధారణ వస్తువులు కొనుగోలు కంటే ఎక్కువ 200 దుకాణాలు సుమారు

పథలియా

మార్చు
  • పత్ల గ్రామం లఖిసరాయ్ పట్టణానికి 2 కి.మీ దూరంలో ఉంది. లఖిసరాయ్ జిల్లాలో శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలలో పథలియా గ్రామం ఒకటి.
  • పంచాయితీ : దామోదర్‌పూర్.
  • పోస్ట్ ఆఫీస్ : లఖిసరాయ్
  • జిల్లా : లఖిసరాయ్

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,000,717,[4]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 445వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 815 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.74%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 64.95%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

మార్చు

జిల్లాలో ఇండో- ఆర్యన్ భాధాకుటుంబానికి చెందిన ఆంగిక భాష వాడుకలో ఉంది. దీనిని వ్రాయడానికి దేవనాగరి భాషను వాడుతుంటారు. ఈ భాష ఆంగిక భూభాగంలో 7,25,000 మందికి వాడుక భాషగా ఉంది.[7]

బయటి లింకులు

మార్చు


మూలాలు

మార్చు
  1. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. New Hanover Island (Lavongai) 1,227km2
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
  7. M. Paul Lewis, ed. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

మార్చు