లఘుసిద్ధాన్తకౌముదీ

(లఘుసిద్ధాంతకౌముది నుండి దారిమార్పు చెందింది)


లఘుసిద్ధాన్తకౌముదీ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాసిన సంస్కృత వ్యాకరణమునకు సంబంధించిన తెలుగు పుస్తకము. దీనికి ఆయన గురువైన కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి ఆశీర్వాదాలనిచ్చి దీవించాడు.

లఘుసిద్ధాన్తకౌముదీ
పుస్తక ముఖచిత్రం
కృతికర్త:
అనువాదకులు: డా. పుల్లెల శ్రీరామచంద్రుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సంస్కృత వ్యాకరణము
ప్రచురణ: సంస్కృత భాషా ప్రచార సమితి
విడుదల: 1971
పేజీలు: 930

దీనిలో సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన 1,275 సూత్రాలను రచయిత ఆంధ్రీకరించడమే కాకుండా వ్యాఖ్యాన రూపముగా వివరణను కూడా తెలియజేసి, కౌముదీపాఠ సాంప్రదాయమును అనుసరించెను. ముందుగా సంస్కృత వ్యాకరణము - దాని సంక్షిప్తచరిత్ర గురించి 46 పేజీలలో వివరంగా తెలియజేశారు. చివరగా సూత్రసూచీ, ధాతుసూచీ లను కూడా చేర్చారు.

ఇది 1971 లో మొదటిసారిగా ముద్రించబడి; 1980, 1998 లలో ద్వితీయ, తృతీయ ముద్రణలను విడుదలచేసింది. దీనిని జి. పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్టు అనుబంధ సంస్థ యైన సంస్కృతభాషా ప్రచార సమితి, హైదరాబాదు వారు ముద్రించారు.

మూలాలు

మార్చు
  • లఘుసిద్ధాన్తకౌముదీ బాలానన్దిన్యాఖ్యయా ఆంధ్రభాషావ్యాఖ్యయా సమేతా, వ్యాఖ్యాతా డా. పుల్లెల శ్రీరామచంద్రః, సంస్కృతభాషా ప్రచార సమితి, హైదరాబాద్, 1998.