మొఘలుల సామ్రాజ్యకాంక్షను, వారి దాష్టీకాలను ఎదుర్కున్న భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజపుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రసాల్ వంటివారు. వారికోవకు చెందినవాడే వీర లచిత్ బర్ఫుకన్ (Lachit Borphukan). 1671లో సరాయ్ ఘాట్ యుద్ధంలో రాజా రాంసింగ్ నేతృత్వతంలోని అసంఖ్యాక మొఘలు సేనను అప్రతిహంగా ఎదుర్కుని వారిని అహోం రాజ్యం నుండి తరిమికొట్టిన వీరుడు.

లచిత్ బర్ఫుకన్
Lachit Borphukan or (Lachit Phu-Kan-Lung in Tai Ahom)
লাচিত বৰফুকন
జోర్హాట్ వద్ద లచిత్ బర్ఫుకన్ విగ్రహం
జననం
లచిత్ ఫు ల కుంగ్
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాహసం
గుర్తించదగిన సేవలు
1671 సరాయ్‌ఘాట్ యుధ్ధం

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

లచిత్ బర్ఫుకన్ నేడు అస్సాంగా పిలవబడుతున్న ఒకనాటి అహోం రాజ్యంలో 17వ శతాబ్దంలో జన్మించాడు.వీరి తండ్రి మొమై తములి బర్బరువ, అహోం రాజు రాజా ప్రతాపసింహ సేనాధిపతి. చిన్ననాటి నుండి యుద్ధవిద్యలలో, భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో లచిత్ తర్ఫీదు పొందాడు. తన నైపుణ్యంతో అహోం రాజుల వద్ద వివిధ శాఖలలో పనిచేసాడు. ఇతని ప్రతిభను గుర్తించి రాజా చక్రధ్వజ సింహ లచిత్ ను బర్ఫుకన్ గా నియమించాడు. బర్ఫుకన్ అంటే అహోం రాజ్యంలో 5మంది ప్రధానమైన మంత్రిమండలిలోని మంత్రి. వీరికి కార్యనిర్వాహక, న్యాయాధికారాలు ఉండేవి.

సరాయిఘాట్ యుద్ధం మార్చు

మొహమ్మద్ ఘోరి కాలం నాటి నుండి ముస్లిం రాజులు అహోం రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసారు. అహోం రాజులు వీరోచిత పోరాట పటిమతో వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. భారతదేశాన్నంతా (మరాఠా రాజ్యాన్ని మినహా )ఆక్రమించిన మొఘలులు కూడా అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి, తమ రాజ్యాన్ని తూర్పువైపు విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అహోం రాజ్యంలోని అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకొని గౌహతిని ఆక్రమించారు. అహోం రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించటానికి మొఘలుల సేనలు రాజా రాంసింగ్ నేతృత్వంలో 1671లో బ్రహ్మపుత్ర నది తీరంలో సరాయిఘాట్ లో మోహరించాయి. వీరిని ఎదుర్కొనడానికి రాజా చక్రధ్వజ సింహ తన సర్వ సైన్యాధిపతిగా వీర లచిత్ బర్ఫుకన్ ను నియమించాడు. లచిత్ గొరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరినవాడు. అహోం రాజ్య భౌగోళిక, నైసర్గిక విశేషాలు బాగా తెలిసినవాడు. అహోం రాజ్య సంఖ్యాబలం మొఘలుల సేనతో పోలిస్తే చాలా తక్కువైనప్పటికీ నదీ జలాల మీద యుద్ధ తంత్రాన్ని నడిపి మొఘలుల సేనలను ఉచకోతకోసాడు.

యుద్ధం మధ్యలో రాజా రాంసింగ్ లచిత్ ను ప్రలోభపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. మాతృభూమి సేవకు అంకితమైన ఆ వీరుడు దేనికీ లొంగక పోయేసరికి, ఒక బాణానికి లచిత్ కు లక్ష రూపాయల లంచమిచ్చి కొన్నట్టు, అతడు మొఘలుల తరపున పనిచేస్తున్నట్టు ఒక లేఖను సృష్టించి దాన్ని అహోం స్థావరాలవద్ద వదిలారు. ఆ లేఖ చక్రధ్వజుడికి చేరి అతను లచిత్ను అనుమానించాడు. కానీ ప్రధానమంత్రి ఇదంతా మొఘలుల కుట్ర అనీ, లచిత్ దేశభక్తిని శంకించవలసిన అవసరం లేదని నచ్చచెప్పాడు.యుద్ధం చివరి దశలో ఉండగా లచిత్ యుద్ధంలో గాయపడటం వాల్ల అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది. వైద్యులు వారిస్తున్నా అతడు తన ఆరోగ్యాన్ని లెక్క చేయక నదీ మార్గం ద్వారా మొఘలు సేనలపై విరుచుకుపడి వారిని అహోం రాజ్యం నుండి ప్రారదోలి గౌహతిని తిరిగి స్వాధీన పరచుకున్నారు.

ఆ విధంగా సరాయిఘాట్ యుద్ధము మొఘలులు ఓడిపోయిన అతి కొద్ది యుద్ధాలలో ఒకటిగా నిలిచిపోయింది.

గ్యాలరీ మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Lachit Borphukan : A great 'unknown' Son of Sanatan Dharma | Hindu Human Rights Online News Magazine". Hinduhumanrights.info. 2012-06-10. Archived from the original on 2013-03-02. Retrieved 2013-04-03.