లవ్ మ్యారేజ్
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.లెనిన్ బాబు
తారాగణం రంగనాథ్,
జయచిత్ర
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

చిత్రకథ సవరించు

ఎం.బి.ఎ.పట్టాపుచ్చుకున్న ప్రసాదుకు రైలులో సుజాత అనే యువతి తటస్థపడుతుంది. అప్పటి వరకు ఆడపిల్ల అంటే ఆమడదూరంలో ఉండే ప్రసాదుకు హృదయస్పందన ప్రారంభమైంది. ఆఫీసుకు వెళ్ళి తన మిత్రుడు మోహన్‌కు ఈ సంగతి చెబుతాడు. సుజాత కూడా ప్రసాద్ గురించి తన స్నేహితురాలు రాధకు చెబుతుంది. రాధ, మోహన్‌ల ప్రోద్బలంతో సుజాత, ప్రసాద్‌లు చేరువవుతారు. మనసులు కలుస్తాయి. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కాని ప్రసాద్ తండ్రి మాధవయ్య ససేమిరా వీలులేదంటాడు. సుజాతను సినిమాలలో చేర్పించి లక్షలు గడించాలనుకున్న సుజాత మేనమామ వెంకటప్పయ్యకు కూడా ఇష్టం వుండదు. దానితో సుజాత, ప్రసాద్‌లు రిజిస్టర్ మ్యారేజి చేసుకుని వేరు కాపురం పెడతారు. వెంకటప్పయ్య తన నక్క వినయాలతో వారి పంచన చేరతాడు. రాధ పెళ్ళికి వెళ్ళిన సుజాత రాధ భర్త సురేష్ ప్రోద్బలంతో అతని సినిమాలో ఒక చిన్నవేషం వేస్తుంది. ఇంటికి వచ్చాక ఈ విషయం మొగుడికి చెప్పదు. కాని ఆఫీసులోను, బయట ప్రసాదును సినిమాసుజాత మొగుడు అని పిలవడం విన్నాక ప్రసాద్ సుజాతను నిలదీసి అడిగితే ఆమె నిజం చెబుతుంది. ప్రసాద్ సుజాతను ఇంటినుండి తరిమివేస్తాడు. తమ ముద్దుల బాబును తన వద్దే ఉంచుకుంటాడు ప్రసాద్. తరువాత వాళ్ళిద్దరూ తిరిగి ఎలా కలుసుకుంటారనేది మిగిలిన కథ[1].

నటీనటులు సవరించు

 • జయచిత్ర
 • రంగనాథ్
 • చంద్రమోహన్
 • కర్నాటి లక్ష్మీనరసయ్య
 • కె.వి.చలం
 • కె.విజయ
 • నిర్మలమ్మ
 • ఝాన్సీ

సాంకేతికవర్గం సవరించు

 • దర్శకుడు : టి.లెనిన్ బాబు
 • నిర్మాత: పి.రాధాకిషన్ రావు
 • సంగీతం: టి.చలపతిరావు

పాటలు సవరించు

క్రమ సంఖ్య పల్లవి గాయనీగాయకులు సంగీతదర్శకత్వం గేయ రచయిత
1 గుండె కొట్టుకుంటుంది గడియారంలా వలపు విచ్చుకుంటుంది వి.రామకృష్ణ, పి.సుశీల టి.చలపతిరావు
2 తెలివి తెల్లారిందా వలపు చల్లారిందా ఏమి ఎరగనట్టు జరగనట్టు పి.సుశీల టి.చలపతిరావు వేటూరి
3 మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (విషాదం) పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టి.చలపతిరావు సినారె
4 మనజీవితం ఒక తోట అనురాగమే ఒక పాట (సంతోషం) పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టి.చలపతిరావు సినారె
5 రత్తి నా రత్తి నా మాట వినుకోవే ముద్దుల రత్తి రత్తి మాధవపెద్ది,అఖిల టి.చలపతిరావు అప్పలాచార్య
6 రా రా ఇటు రారా రావేమిరా ఈ రేయి గడిచి తెలవారక ముందే ఎస్.జానకి టి.చలపతిరావు

మూలాలు సవరించు

 1. వి.ఆర్ (16 March 1979). "చిత్రసమీక్ష - లవ్ మ్యారేజ్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65 సంచిక 338. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 11 December 2017.

బయటి లింకులు సవరించు