మాధవపెద్ది సత్యం

నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 - డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

మాధవపెద్ది సత్యం
వ్యక్తిగత సమాచారం
జననం(1922-05-11)1922 మే 11
మూలంబ్రాహ్మణ కోడూరు, బాపట్ల
ఆంధ్ర ప్రదేశ్, India
మరణం2000 డిసెంబరు 18(2000-12-18) (వయసు 78)
సంగీత శైలినేపథ్య గాయకుడు
వృత్తినేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు
క్రియాశీల కాలం1946–2000

జీవిత విశేషాలు

మార్చు

సత్యం 1922, మార్చి 11బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట) ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు[1]

చలనచిత్ర రంగం

మార్చు

గాయకునిగా

మార్చు
సంవత్సర చిత్రం పాట రిమార్కులు
1954 బంగారు పాప తధిమి తకధిమి నటులు: ఎస్. వి. రంగారావు
1957 మాయా బజార్ వివాహ భోజనంబు
భళి భళి భళి దేవా
నటులు: ఎస్. వి. రంగారావు
తనకోసమే పాడుకున్నాడు
తోడికోడళ్ళు నీ షోకు చూడకుండా
1959 ఇల్లరికం భలే ఛాన్స్ లే
1960 శ్రీ వేంకటేశ్వర మహత్యం వేగరార ప్రభో
1961 జగదేక వీరుని కథ
1962 కులగోత్రాలు అయ్యయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే రమణా రెడ్డి
1963 లక్షాధికారి ఓహో అందమైన చినదాన బంగారు వన్నెదాన
1966 శ్రీ కృష్ణ పాండవీయం భళా భళా నా బండి పరుగు
1975 బలిపీఠం ఏసుకుందాం బుడ్డోడా ఏసుకుందాం
  • యశోద కృష్ణ (1975)
  • తాతా మనవడు (1972)
  • సంపూర్ణ రామాయణం (1971)
  • రహస్యం (1967)
  • పల్నాటి యుద్ధం (1966)
  • అంతస్తులు (1965)
  • బబ్రువాహన (1964)
  • బొబ్బిలి యుద్ధం (1964)
  • డాక్టర్ చక్రవర్తి (1964)
  • దేవత (1964)
  • రాముడు భీముడు (1964)
  • వెలుగు నీడలు (1964)
  • నర్తనశాల (1963)
  • తిరుపతమ్మ కథ (1963)
  • శ్రీ కృష్ణార్జున యుద్ధము (1963)
  • చదువుకున్న అమ్మాయిలు (1963)
  • మహామంత్రి తిమ్మరుసు (1962)
  • దక్ష యజ్ఞము (1962)
  • ఇద్దరు మిత్రులు (1961)
  • శభాష్ రాజా (1961)
  • సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  • జయభేరి (1959)
  • కృష్ణ లీలలు (1959)
  • అప్పు చేసి పప్పు కూడు (1958)
  • మాంగల్య బలం (1958)
  • భాగ్య రేఖ (1957)
  • దొంగల్లో దొర (1957)
  • పాండురంగ మహత్యం (1957)
  • సారంగధర (1957)
  • జయం మనదే (1956)
  • పెంకి పెళ్ళాం (1956)
  • కన్యాశుల్కం (1955)
  • పిచ్చి పుల్లయ్య (1953)
  • పల్లెటూరు (1952)
  • మల్లీశ్వరి (1951)
  • నవ్వితే నవరత్నాలు (1951)
  • షావుకారు (1950)
  • లైలా మజ్ను (1949)
  • రామదాసు (1946)

నటునిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర
1962 దక్షయజ్ఞం
1957 మాయాబజార్ దారుకుడు
1950 షావుకారు
1946 రామదాసు కబీరు

మాధవపెద్ది సత్యం అవార్డు

మార్చు

మాధవపెద్ది సత్యం కుమారుడు మాధవపెద్ది మూర్తి ఒక కూచిపూడి కళాకారుడు. ఈయన మాధవపెద్ది అవార్డులను ప్రారంభించాడు. ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. http://www.hindu.com/fr/2007/03/23/stories/2007032300150200.htm[permanent dead link]

బయటి లింకులు

మార్చు