లాప్‌కాట్ (LAPCAT - Long-Term Advanced Propulsion Concepts and Technologies) అనునది ప్రయోగదశలో ఉన్న ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ అందుబాటు లోకి వస్తే భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యాన్ని చేరవచ్చు.

వాతావరణ పై పొరలలో ప్రయాణిస్తున్న లాప్‌కాట్ 2 విమానపు ఊహాచిత్రము.

నేపధ్యము

మార్చు
 

భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో అంతరిక్ష విమానములను వాడుతారు. బ్రిటన్ కంపెనీ రియాక్షన్ ఇంజన్స్ సాయంతో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) 7 మిలియన్ల యూరో లతో దీనిని అభివృద్ధిపరుస్తోంది[1][2]. 'సబేర్ ' అనే రాకెట్ ఇంజన్‌తో నడిచే ఈ విమానం ధ్వని కంటే ఏకంగా ఐదు రెట్లు అంటే.. గంటకు 5,632 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఒకేసారి 300 మంది ప్రయాణికులతో 15 నిమిషాల్లోనే ఇది అంతరిక్షానికి చేరుకుంటుంది.

గమ్యస్థానం చేరువయ్యాక తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి భూమి మీదికి దిగిపోతుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విమానాలు నడిపేందుకు అయ్యే ఖర్చులో 95% వరకూ ఆదా అవుతుంది. 2019లో దీనిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సబేర్ ఇంజన్‌తో రూపొందిస్తున్న 'స్కైలాన్ ' అనే అంతరిక్ష విమానాన్ని కూడా ఈసా అభివృద్ధిపరుస్తోంది. ఆ విమానం ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లి నేరుగా కక్ష్యలో వదిలిపెట్టి వస్తుంది.

మూలాలు

మార్చు
  1. "LAPCAT aims at supersonic civil aviation". Gizmo Watch. 30 August 2007. Archived from the original on 2009-02-20. Retrieved 2009-07-03.
  2. "LAPCAT – Long-Term Advanced Propulsion Concepts and Technologies". European Commission. Retrieved 2009-07-03.

బయటి లంకెలు

మార్చు