లావు శ్రీకృష్ణ దేవరాయలు

లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[2]

లావు శ్రీకృష్ణ దేవరాయలు
లావు శ్రీకృష్ణ దేవరాయలు


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – 2024 జనవరి 23
ముందు రాయపాటి సాంబశివరావు
నియోజకవర్గం నరసరావుపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1983-04-29) 1983 ఏప్రిల్ 29 (వయసు 40)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లావు రత్తయ్య, నిర్మల [1]
జీవిత భాగస్వామి మేఘన లావు
సంతానం రతన్ లావు
పూర్వ విద్యార్థి లా ట్రోబ్ యూనివర్సిటీ
వెబ్‌సైటు https://www.krishnalavu.com

జననం, విద్యాభాస్యం మార్చు

లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులో డాక్టర్‌ లావు రత్తయ్య, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 29న జన్మించాడు. ఆయన ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ (మీడియా స్టడీస్‌) పూర్తి చేశాడు. లావు శ్రీకృష్ణ లావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌గా, శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో ఏలూరులో సీబీఎస్‌ఇ సీల్‌బస్‌తో నడుస్తున్న స్కూల్‌కి అధ్యక్షుడిగా, ఈఎస్‌ఎస్‌ వీఇఇ ఏఏఆర్‌ కే ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏలూరు) డైరక్టర్‌గా ఉన్నాడు.[3]

రాజకీయ జీవితం మార్చు

లావు శ్రీకృష్ణ రాజకీయాలపై ఆసక్తితో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పై ఓట్ల 153978 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. లావు శ్రీకృష్ణ 2019లో ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4]

లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 జనవరి 23న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,  లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[5] ఆయన 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[6]

మూలాలు మార్చు

  1. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi. "Narasaraopet Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
  4. News18 Telugu (17 December 2019). "నరసరావుపేట వైసీపీ ఎంపీకి కీలక పదవి... ఆ కమిటీలో..." Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (23 January 2024). "ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  6. Andhrajyothy (2 March 2024). "ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.