లింగం సూర్యనారాయణ

భారత శస్త్రవైద్యుడు

లింగం సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యులు, శస్త్రచికిత్స నిపుణుడు. ఆంధ్ర వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా, ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు వైస్ ఛాన్సలర్ గా పనిచెసాడు. [1]

లింగం సూర్యనారాయణ

జననం, విద్య

మార్చు

లింగం సూర్యనారాయణ గారు 1923 మే 16న గుంటూరులో జన్మించాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1946 లోఎం.బి.బి.ఎస్ లో పట్టభద్రుడై; 1949 లో ఎమ్.ఎస్. పూర్తిచేశాడు.

జీవిత విశేషాలు

మార్చు

డాక్టర్ సూర్యనారాయణ గారు ఆంధ్రా మెడికల్ కాలేజిలో 1964 వరకు సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అతను ఒక సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఉన్నత కేంద్రాలలో శిక్షణ కోసం వెళ్ళాడు. అతన్ని గుంటూరు మెడికల్ కళాశాలకి ప్రొఫెసర్‌గా, సర్జరీ విభాగాధిపతిగా బదిలీ చేశారు.

1968 నుండి 1974 వరకు గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా, 1974 లో కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1974 లో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా, శస్త్రచికిత్స విభాగాధిపతిగా బదిలీ అయ్యాడు. 1975 లో హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. అక్కడ 1978 వరకు పనిచేశాడు.

అతని పరిపాలనా సామర్థ్యాలు 1987 లో దేశంలోనే తోలి వైద్య విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము కు ప్రో వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టేటట్టు చేసాయి. తరువాత 1988 ఫిబ్రవరి 22 న వైస్ ఛాన్సలర్ గా భాద్యతలు చేపట్టి 1994 ఏప్రిల్ 18 వరకు కొనసాగాడు.[2] వైస్ ఛాన్సలర్‌గా అతను జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, జెనీవా, బ్యాంకాక్ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యునిగా సందర్శించాడు.

వైద్య విద్య, ఆరోగ్య చట్టంపై జరిగిన అనేక వర్క్‌షాపులకు వీరు ఛైర్మన్‌గా వ్యవహరించారు. "సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ సైన్సెస్ ఇన్ నేషనల్ ప్రొడక్టివిటీ అండ్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్" అనే పరిశోధనా పత్రాలతో సహా అనేక పత్రాలను అతను ప్రచురించాడు.

డా.సూర్యనారాయణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థలకు జీవిత కాల సభ్యుడు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా యొక్క ఆంధ్రప్రదేశ్ చాప్టర్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ యొక్క ఫెలో, ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడమీ గౌరవ ఫెలో.

సూర్యనారాయణ గారు వివిధ సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గోన్నారు. విశాఖపట్నం, గుంటూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి, అధ్యక్షుడు, జోనల్ చైర్మన్ గా పనిచేసారు. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోసం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఎంతో సహకరించాడు.

పురస్కారాలు

మార్చు
  • విజయ శ్రీ అవార్డు, విశిష్ట శాస్త్రవేత్త ఆఫ్ ఇండియా అవార్డు, సర్జన్ ఆఫ్ ఎమినెన్స్ అవార్డు గ్రహీత.
  • ఎన్.టి.ఆర్. యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2003 లో ఏడవ కాన్వొకేషన్ సందర్భంగా వీరికి గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్) ను అందజేసింది.[3]
  • విశాఖపట్నంలో వాల్తేరు క్లబ్ నిర్వహించిన ఆల్ ఇండియా గ్రాండ్ ప్రిక్స్ ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్‌లో విజేత కోసం 'డాక్టర్ లింగం సూర్యనారాయణ ట్రోఫీ' ని ఏర్పాటు చేశారు.

ప్రచురణలు

మార్చు
  • L. Suryanarayana, K. Vembu, R. Rajalakshmi and C. Satyanarayana:Performance of National Tuberculosis Programme, 1993:an appraisal, Indian Journal of Tuberculosis., 1995, 42, 121.[4]
  • Suryanarayan, L. and Jagannatha, P.S. (2001) Scoring method for diagnosis of tuberculosis in children: an evaluation. Indian Journal of Tuberculosis, 48. pp. 101–103.[5]

మూలాలు

మార్చు
  1. http://ngrkchowdary.blogspot.com/2008/02/doctors.html
  2. "Archived copy". Archived from the original on 2007-10-25. Retrieved 2020-07-13.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "The Hindu : Health varsity honours 3 doctors". Hinduonnet.com. 2003-02-14. Retrieved 2016-12-01.[permanent dead link]
  4. "Ind" (PDF). Archived from the original (PDF) on 3 March 2016. Retrieved 2016-12-01.
  5. "Archived copy". Archived from the original on 2009-01-20. Retrieved 2020-07-13.{{cite web}}: CS1 maint: archived copy as title (link)