లింగనబోయిన లేఖానంద స్వామి

లింగనబోయిన లేఖానందస్వామి రచయిత, రంగస్థల కళాకారుడు. [2]

లింగనబోయిన లేఖానంద స్వామి
జననంలింగనబోయిన లేఖానంద స్వామి
16 జనవరి 1957
భారతదేశం అప్పన్నపేట, సూర్యాపేట జిల్లా
మరణం19 ఫిబ్రవరి 2024[1]
నల్లగొండ, తెలంగాణ
నివాస ప్రాంతంనల్లగొండ, తెలంగాణ
వృత్తికవి, నటుడు, నాటక, గేయ, కథా రచయిత,
సాహితీవేత్త
పిల్లలుఇద్దరు
తండ్రిజగన్నాధం
తల్లిఆదెమ్మ

బాల్యం - విద్యాభ్యాసం

మార్చు

లింగనబోయిన లేఖానంద స్వామి ఉమ్మడి నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం లోని అప్పన్నపేట గ్రామంలో  అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1957 జనవరి 16న ఆదెమ్మ, జగన్నాథం దంపతులకు జన్మించాడు. చరిత్ర, తెలుగు, సామాజికశాస్త్రాలతోబాటు ఎడ్యుకేషన్ లో మాస్టర్ డిగ్రీని చదివాడు. “నల్లగొండ జిల్లాలో భిక్షుకుంట్ల సామాజిక జీవనం” అనే అంశంపై యం.ఫిల్, “నల్లగొండజిల్లా నాటకసాహిత్యం”పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు.

చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తిని కనపరిచి, అనేక నాటకాలను రచించినాడు. ఆ తరువాత కథలు, పద్యాలు వంటి సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రను కనపరిచినాడు. డాక్టరేట్ పట్టాను సాధించినాడు. ఇట్లా తన జీవిత ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఉద్యోగం

మార్చు

రాఘవేంద్ర ఎయిడెడ్ డిగ్రీ కళాశాల నల్లగొండ లో చరిత్ర అధ్యాపకుడిగా చేరి, పదవీవిరమణ అనంతరం రాఘవేంద్ర బి.ఈ.డి. కళాశాలనల్లగొండకు ప్రిన్సిపాల్ గా పనిజేశాడు.

ప్రత్యేకతలు

మార్చు

డా. లింగనబోయిన లేఖానందస్వామి నల్లగొండలోని ప్రముఖ నాటకసంస్థ కోమలి కళాసమితి సంస్థకు చాలా కాలంపాటు కోశాధికారిగా పనిజేశాడు. నటుడుగా పౌరాణిక, జానపద, సాంఘీక, చారిత్రక నాటకాలలో సుమారు 50కి పైగా నాటకాలలో వివిధరకాల పాత్రలను పోషించాడు. సుమారు 25కు పైగా నాటికలు, నాటకాలకు దర్శకత్వం వహించాడు. ముప్పై షార్ట్ ఫిలింలలో నటించాడు. “రెడ్ లిస్టు, ప్రేమ సందేశం” అనే చిత్రాలలో నటించాడు.

డా. లింగనబోయిన లేఖానందస్వామి నటుడు మాత్రమే కాదు. మంచి నాటక, కథా రచయిత. “పట్వారి”, “క్షమిత” అనే నాటికలు, “తొలగిన తెరలు” అనే నాటకంను రచించాడు. సుమారు వందకుపైగా జానపద గేయాలు, భక్తి పాటలు, చైతన్య గీతాలు రాసి, రికార్డు చేశాడు. “మా పల్లె”, “జయహో రాఘవేంద్ర”, “జయహో ముదిరాజ్” , దీన బంధు”, భక్తి గీతాలు”, “అక్షర జ్యోతి”, జయహో రమణన్న”, “మహా మనిషి మల్లన్న” వంటి గేయాలు రాశాడు. వలిగొండలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన గురించి రాసిన గీతం చాలా మందిని కదిలించింది. ఆ గేయానికి మెచ్చిన నాటి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గీతరచయితగా అవార్డును అందుకున్నాడు. కథా రచయితగా “కుంకుడు ముండ” కథతో బాటు మరో నాలుగు కథలు తంగేడు పత్రికలో అచ్చయ్యాయి. ముదిరాజ్ కులంలో పుట్టిన లేఖానంద స్వామి కుల చైతన్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గేయాలు రాసి, పాడి ప్రజలలో చైతన్యాన్ని కలుగజేశాడు. తల్లిదండ్రుల పేరుమీద “లింగనబోయిన ఆదెమ్మ, జగన్నాధం స్మారక విద్య, మరియు సాంస్కృతిక సంస్థ” ను ఏర్పాటుచేశాడు. ఈ సంస్థ ద్వారా తన స్వగ్రామం అప్పన్నపేటలో కళావేదికను నిర్మించడంతో బాటు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాడు.

అతను 2024 ఏప్రిల్ 19న గుండెపోటుతో మరణించాడు.

పురస్కారాలు

మార్చు
  1. ఉత్తమ నటనకుగానూ “కోహినూర్” అనే నాటికకు 2006లో ‘జాతీయ ఉత్తమనటుడు' అవార్డు
  2. ఒరిస్సా రాష్ట్రం కటక్లో ప్రదర్శించిన “హుష్ కాకి” నాటికకు “నటభూషణ్” అవార్డు
  3. “నైవేద్యం” అనే నాటికకు జాతీయ ఉత్తమ ప్రదర్శన జ్యూరీ అవార్డు

రచనలు

మార్చు

ఊట(ఖండకావ్యం

  • కుంకుడుముండ
  • నల్లగొండ జిల్లా- భిక్షకుంట్ల సామాజిక జీవనం
  • నల్లగొండ నాటక చరిత్ర వ్యాసం
  • పట్వారి (నాటకం)
  • క్షమిత(నాటకం)


మూలాలు

మార్చు
  1. మూస:Sakshi news
  2. "లేఖానంద స్వామి ఇకలేరు | Aakshitha News" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-02-19. Retrieved 2024-05-03.

బయటి లింకులు

మార్చు