లింగమార్పిడి

పుట్టినప్పటి లింగం కాకుండా ఇతర లింగం మార్పిడి

లింగమార్పిడి అనగా జన్మతహ వచ్చిన లింగంను శస్త్ర చికిత్స ద్వారా మార్పు చేసుకోవడం. అనగా జన్మతహ స్త్రీ, పురుషునిగానూ అలాగే పురుషుడు స్త్రీ గానూ మారిపోవడము. కొన్ని జంతువులలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మానవులకు మాత్రం ప్రకృతి ఈ సౌలభ్యాన్ని ప్రసాదించలేదు. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గము [1].

నేపధ్యం

మార్చు

జంతువులలో

మార్చు
 
ప్రకృతి సిద్దంగా లింగమార్పిడి జరిగే క్లోన్ చేప

కొన్ని రకాల జంతువులలో లింగమార్పిడి పూర్తి సహజసిద్దంగా జరుగుతుంది, క్లోన్ చేప దీనికి ఉదాహరణ. మొదట ఇది పురుష లింగాన్ని కలిగి ఉండి కొద్ది కాలం తర్వాత స్త్రీ లింగాన్ని పొందుతుంది.

మానవులలో

మార్చు

మానవులలో ఈ ప్రక్రియ సహజంగా సాధ్యం కాదు. కాని కొన్ని మందులు వాడటం ద్వారా హార్మోనుల స్థాయిని పెంచి లింగంను మార్చవచ్చని వైద్యులు నిరూపించారు. అలాగే సంపూర్ణ శస్త్ర చికిత్సలు చేసి లింగమార్పిడిని కూడా చేస్తున్నారు. ఈ రెండు పద్ధతులలో అనేక శారీరక, సామాజిక సమస్యలు ఉన్నాయి.

సామాజిక కోణం

మార్చు

లింగ మార్పిడి చేయించుకున్నవారికి ప్రపంచంలో అత్యధిక ప్రాంతాలలో సామాజిక ఆదరణ లేదు. సమాజం వీరిని వెలివేసినట్లు చూడటం, వీరి పట్ల ఆదరణ చూపకపోవడం జరుగుతుంది. ఎక్కవ మంది పడుపు వృత్తిలో, హిజ్రా లుగా మిగిలిపోయి అతి దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనేక దేశాలు లింగమార్పిడిని నిషేధించాయి. లింగమార్పిడి చేసిన వైద్యులకు కఠిన శిక్షలు విధిస్తాయి. కానీ డబ్బుకు ఆశపడి కొంతమంది వైద్యులు రహస్యంగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు[2].[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.surgeryencyclopedia.com/Pa-St/Sex-Reassignment-Surgery.html
  2. http://www.lawyersclubindia.com/articles/Sex-Change-Operation-497.asp#.VGc_yNSUdCU
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-26. Retrieved 2014-11-15.

బయటి లంకెలు

మార్చు