లింగవారిగూడెం యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలానికి చెందిన ఒక శివారు గ్రామం.ఇది సర్వేల్ రెవెన్యూ, గ్రామ పంచాయితి పరిధి చెందిన గ్రామం.లింగవారిగూడెం గ్రామంలో జనాభా సుమారు 600 వరకు ఉంటుంది. లింగవారిగూడెం గ్రామానికి 3 కి.మీ. దూరంలో పుట్టపాక (నారాయణపూర్, 4 కి.మీ. దూరంలో సర్వేల్ గ్రామాలు ఉన్నాయి. అలాగే 8 కి.మీ. దూరంలో గుడిమల్కాపురం, 3 కి.మీ. దూరంలో గుజ్జ, 6 కి.మీ. దూరంలో కంకనాలగూడెం, 6 కి.మీ. దూరంలో కోతులాపురం, వాయిలపల్లె 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. నారాయణపూర్ మండలం 10 కి.మీ. దూరంలో ఉంది. చౌటుప్పల్ మండలం 15 కి.మీ. దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి 55 కి.మీ.దూరంలో లింగవారిగూడెం గ్రామం ఉంటుంది. లింగవారిగూడెం గ్రామానికి ఉత్తరాన సర్వేల్, దక్షిణాన పుట్టపాక, తూర్పున చలమడ, పశ్చిమాన నారాయణపూర్ సరిహద్దులు.

ఈ గ్రామంలో గత 10 ఏళ్లుగా పత్తి పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు