లింబాద్రి నరసింహ స్వామి దేవాలయం ( వడ్డాడి)
లింబాద్రి నరసింహ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ,తాంసీ మండలంలోని వడ్డాడి (వడ్డాది) గ్రామంలో ఉంది.400 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయం. స్వయంభుగా వెలసిన నరసింహ స్వామిని భక్తులు అనునిత్యం దర్శించుకుంటారు[1].
లింబాద్రి నరసింహ స్వామి దేవాలయం వడ్డాడి | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°24′N 78°19′E / 19.40°N 78.32°E |
పేరు | |
ఇతర పేర్లు: | నరసింహ స్వామి దేవాలయం |
ప్రధాన పేరు : | శ్రీ నరసింహ స్వామి వారి దేవస్థానం వడ్డాది, ఆదిలాబాద్ జిల్లా |
దేవనాగరి : | लड्डाडि नरसिंह स्वामी देवस्थान |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాదు జిల్లా |
ప్రదేశం: | వడ్డాది, |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ నరసింహ స్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | మహాశివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 01 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 400వ సంవత్సరాల చరిత్ర |
సృష్టికర్త: | లింబాద్రి అనే పేరు గల భక్తుడు |
చరిత్ర
మార్చుపూర్వం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని వడ్డాది గ్రామంలో లింబాద్రి అనే పేరు గల భక్తుడు ఉండేవాడట. అతను పని పాటలు లేకుండా ఊర్లో తిరిగడంతో ఒక రోజు అతని తల్లి అతనిని కోపగించిగా అతను ఇల్లు వదిలి వెళ్లిపోయాడట . కొన్ని సంవత్సరాల తర్వాత అతను తిరిగి ఒక మహా యోగి రూపంలో రావడంతో ఆ వడ్డాది గ్రామ ప్రజలు అతనికి స్వామిగా గౌరవించడం,అతను వడ్డాది ప్రజలకు జ్ఞానబోధ చేయడం ఇలా తన జీవితాన్ని గడపడం మొదలు పెట్టాడు. ఒక రోజు అతను ఊరి చెరువు గట్టున వటవృక్షం కింద తపస్సు చేయడం ప్రారంభించాడు. అతను తపస్సులో కూర్చునా వెనుకాల ఒక పుట్ట ఆవిర్భవించింది. తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఒక రోజు ఒక మనిషి వచ్చి ఆ లింబాద్రి స్వామి ని పలుకరించడంతో స్వామి తన తపస్సుకు భంగం కలిగిందని తపస్సు నుండి నిష్క్రమించాడంతో ఆ పుట్ట పెరగడం ఆగిపోయిందట.మళ్ళి కొన్ని రోజులు తర్వాత ఆ పుట్టను గ్రామస్థులు పరిశీలించగా అచట మట్టి రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుగా వెలసినట్లు పెద్దలు చెబుతారు.ఈ వార్త ఆనోటా ఈనోటా చుట్టూ గ్రామస్థులకు వ్యాపించడంతో భక్తులు పుట్ట దగ్గరకు వచ్చి స్వామి వారికి పూజలు చేయడం ప్రారంభించారని కథ ఉంది.
ఆలయ నిర్మాణం
మార్చునాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పుట నరసింహ స్వామి కోరిక కోర్కెలు తీర్చడంతో గ్రామస్థులు ఒక గుడి కట్టాలని నిర్ణయించారు. గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు,గ్రామస్థుల సహాయ సహకారంతో దేవాలయాన్ని నిర్మించారు.
విశేషం
మార్చుఈ వడ్డాది గ్రామంలో స్వయంభువుగా వెలసిన నరసింహ స్వామి విగ్రహాన్ని మనం పరిశీలిస్తే శిల్పంతో కాకుండా పుట్ట మట్టిలతో మనకు దర్శనమిస్తాడు. సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వామి విగ్రహం ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
ఉత్సవాలు
మార్చుమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు స్వామి వారి రథోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా కొనసాగుతుంది. తాంసీ మండలం నుండే కాకుండా ఆదిలాబాద్ పట్టణం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు.అనంతరం దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూలాలు
మార్చు- ↑ "మెరుపులా నరసింహస్వామి స్వయంభుగా వెలసిన గుడి ఇదే.. భక్తుల పాలిట కొంగు బంగారం!". News18 తెలుగు. 2024-03-17. Retrieved 2024-11-16.