లినక్స్ అనే కంప్యూటర్ నిర్వహణ వ్యవస్థ ని తెలుగుభాషవారు వాడుకోవడానికి తగిన రూపమే లినక్స్-తెలుగు.

లినక్సు-తెలుగు నిర్వహణ వ్యవస్థ చరిత్ర మార్చు

ఇండ్ లినక్స్ [1] జట్టు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కృషి వలన లినక్స్ లో భారతీయ భాషల తోడ్పాటు వీలైంది. ఫైర్ ఫాక్స్ విహరిణిలో భారతీయ భాషల తోడ్పాటు, నకలుహక్కులు నియంత్రణలు గల జాల స్థలాలను ఫైర్ఫాక్స్ లో చూపటానికి తెలుగు వికీ స్థాపకుడు అయిన నాగార్జున వెన్న రూపొందించిన పద్మ పొడిగింత చాలా ఉపయోగపడింది. ఆ తరువాత వివిధ సాఫ్ట్వేర్ స్థానికీకరణ కృషి జరిగింది. దీనిలో ముఖ్య మైలు రాళ్లు క్రింద యివ్వబడినవి.

  • 2005 అక్టోబరు 28 లో తెలుగు సాఫ్ట్వేర్ ఉపకరణాల సిడీ భారతప్రభుత్వం సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో విడుదలయ్యింది. దీనిలో వివిధ అక్షరశైలులు, కీ బోర్డు డ్రైవర్లు, వివిధ వుపకరణాలు ఉన్నాయి.
  • జూన్ 2006 లో తెలుగు భాష మొదటిసారిగా ఇండ్ లినక్స్ జట్టుకు అనుబంధంగా వున్న స్వేచ్ఛ జట్టు [2] కృషి వలన తెలుగు స్థానికతతో లినక్స్ విడుదలయింది.
  • 2008 సెప్టెంబరు 4 న బాస్ (‌BOSS),[3][4] అని పిలవబడే భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యుషన్స్ యొక్క 3.0 విడుదలతో తెలుగు తోడ్పాటు ఇవ్వబడింది.ఇది డెబియన్ పై ఆధారపడిన పంపిణి. ప్రభుత్వ సంస్థలలో బాస్ వాడుకని పెంచటానికి సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సి-డాక్ హైద్రాబాదు అందులో ఒకటి.
  • 2010లో స్థాపించేటప్పుడే తెలుగు కనిపించుటకు వీలుగా వచ్చిన పంపిణీ ఫెడోరా.
  • ప్రారంభంనుండే తెలుగు వాడే వీలుతో 2011లో ఉబుంటు 11.04 విడుదలైంది.[5]

ఉపకరణాలు మార్చు

కొన్ని తెలుగు మాధ్యమంగాపనిచేసే సాఫ్టువేరుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వీటిలో కొన్ని ఇతర నిర్వహణ వ్యవస్థల రూపాలలో కూడా దొరుకుతాయి.

వాడుకరి అంతరవర్తులు మార్చు

పాఠం సరిచేయ ఉపకరణాలు మార్చు

కార్యాలయసాధనాలు మార్చు

విహరిణులు మార్చు

పాఠం నుండి వాక్కు వుపకరణం మార్చు

తెలుగు పాఠం నుండి వాక్కు వుపకరణం (Text To Speech (TTS) ) ఫెస్టివల్ కు తెలుగు తోడ్పాటు [6] సునీల్ మోహన్, చైతన్య కామిశెట్టి తదితరులు అభివృద్ధి చేశారు.యూనికోడ్ తోడ్పాటుతో 2006 జూలై 7 న విడుదలచేశారు.మగ గొంతుకతో యిది తెలుగు పాఠాన్ని కంప్యూటర్ ద్వారా అర్థవంతంగా చదివి విన్పించగలదు.

ముద్రణ అక్షర రూపాన్ని గ్రహించి అక్షర కోడ్ గా మార్చగల వుపకరణం మార్చు

ఓసిఆర్ (OCR) అని పిలిచే ముద్రణ అక్షర రూపాన్ని గ్రహించి అక్షర కోడ్ గా మార్చగల వుపకరణం (Optical Character Recognition) టెస్సెరాట్ లో తెలుగు తోడ్పాటు విడుదలైంది. [7]

మూలాలు మార్చు

  1. ఇండ్ లినక్స్
  2. "స్వేచ్ఛ జట్టు". Archived from the original on 2008-12-17. Retrieved 2010-12-02.
  3. "బాస్ సమాచారం". Archived from the original on 2010-06-14. Retrieved 2011-01-12.
  4. బాస్ లినక్స్
  5. "Ubuntu to support local languages with boot time". Silicon India. 2011-04-28. Archived from the original on 2019-08-07.
  6. ఫెస్టివల్-తెలుగు
  7. Jonas Brunsgaard (2018-10-19). "4.0 with LSTM Release notes".