లీటరు

ఘనపరిమాణానికి ఒక ప్రమాణం

లీటరు మెట్రిక్‌ పద్ధతిలో ద్రవ పదార్ధాల ఘనపరిమాణం (volume) కొలిచే కొలమానం. ఇంగ్లీషులో రాసేటప్పుడు ఈ మాట వర్ణక్రమాన్ని litre అనిన్నీ, liter అనిన్నీ కూడా రాస్తారు. Liter అన్నది అమెరికా వారి వర్ణక్రమం.

జర్మనీలో ఉపయోగిస్తున్న ఒక లీటరు ఘనపరిమాణం గల బీరు జాదీలు

ఇది మెట్రిక్‌ పద్ధతిలో వాడుకలో ఉన్న కొలమానమే అయినప్పటికీ, ఘనపరిమాణం కొలవటానికి వాడే అంతర్జాతీయంగా స్థిరీకరించబడ్డ కొలమానం ఘన మీటరు (cubic metre). ఒక లీటరు = 0.001 ఘన మీటరు = ఒక ఘన డెసీమీటరు (decimetre). ఉరమరగా లీటరు బ్రిటన్‌లో వాడే 'ఇంపీరియల్‌ క్వార్ట్‌ ' కంటే కొద్దిగా చిన్నది, అమెరికాలో వాడే 'క్వార్ట్‌' కంటే కొద్దిగా పెద్దది కనుక సుమారుగా నాలుగు లీటర్లు ఒక గేలనుతో సమానం అని అనుకోవచ్చు. క్వార్ట్‌, గేలన్‌ అనే మాటల అర్ధాలలో నిబద్ధత లేదు; వాటి కొలత ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. కాని లీటరు, ఘన మీటరు ప్రపంచ వ్యాప్తంగా స్థాయీకరించబడ్డ కొలమానాలు.

వైజ్ఞానికంగా నిర్వచనం కావాలంటే లీటరు అంటే ఒక ఘన డెసీమీటరు (1 L = 1 dm3) అని చెప్పొచ్చు. లేదా 1 L ≡ 0.001 m3 (సరిగ్గా, ఉరమరికలు లేకుండా). కనుక 1000 L = 1 m3

సాధారణ వాడుకలో ఉన్న కొలతలకీ లీటరుకీ సంబంధంసవరించు

Litre expressed in non-metric unit   Non-metric unit expressed in litre
1 L ≈ 0.87987699 ఇంపీరియల్‌ క్వార్ట్‌             1 ఇంపీరియల్‌ క్వార్ట్‌ ≡ 1.1365225 లీటర్లు          
1 L ≈ 1.056688 అమెరికా క్వార్ట్‌   1 అమెరికా క్వార్ట్‌ ≡ 0.946352946 లీటర్లు  
1 L ≈ 1.75975326 ఇంపీరియల్‌ పైంట్‌   1 ఇంపీరియల్‌ పైంట్‌ ≡ 0.56826125 లీటర్లు  
1 L ≈ 2.11337641 అమెరికా పైంట్‌   1 అమెరికా పైంట్‌ ≡ 0.473176473 లీటర్లు  
1 L ≈ 0.2641720523 అమెరికా గేలను   1 అమెరికా గేలను ≡ 3.785411784 లీటర్లు  
1 L ≈ 0.21997 ఇంపీరియల్‌ గేలను   1 ఇంపీరియల్‌ గేలను ≡ 4.54609 లీటర్లు  
1 L ≈ 0.0353146667 ఘనపు అడుగు   1 ఘనపు అడుగు ≡ 28.316846592 లీటర్లు  
1 L ≈ 61.0237441 ఘనపు అంగుళం   1 ఘనపు అంగుళం ≡ 0.01638706 లీటర్లు  

1 లీటరు సుమారుగా 4 కప్పులకి సమానం.

1 లీటరులో పదో వంతుని డెసీలీటరు అంటారు. 1 డెసీలీటరుని 1dL అని రాస్తారు.

1 లీటరులో వెయ్యో వంతుని మిల్లీలీటరు అని ముద్దుగా 'మిల్‌' అని పిలుస్తారు. కాని 'మిల్‌' అంటే మీటరు (metre) లో వెయ్యోవంతు అనే అర్ధం కూడా ఉంది. కాని ఇది ఇబ్బంది పెట్టదు; ఎందుకంటే ఒకటి ఘనపరిమాణాన్ని సూచిస్తుంది, మరొకటి పొడుగుని సూచిస్తుంది. కనుక సంద్రభోచితంగా అర్ధం అయిపోతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=లీటరు&oldid=3257705" నుండి వెలికితీశారు