లీనా హార్న్

అమెరికన్ నర్తకి, నటి, గాయని, పౌర హక్కుల కార్యకర్త

లీనా మేరీ కాల్హౌన్ హార్న్ (1917, జూన్ 30 - 2010, మే 9) అమెరికన్ నర్తకి, నటి, గాయని, పౌర హక్కుల కార్యకర్త. సినిమా, టెలివిజన్, థియేటర్‌లో నటించిన హార్న్ డెబ్బై సంవత్సరాలపాటు తన కెరీర్ లో నిలిచింది. పదహారేళ్ళ వయసులో కాటన్ క్లబ్ కోరస్‌లో చేరింది. హాలీవుడ్‌కు వెళ్ళడానికి ముందు నైట్‌క్లబ్ ప్రదర్శనకారిణిగా మారింది.

మానవ హక్కుల కోసం వాదించిన హార్న్, 1963 ఆగస్టులో వాషింగ్టన్‌లో మార్చి‌లో పాల్గొన్నది. తర్వాత నైట్‌క్లబ్ నటిగా తిరిగి వచ్చి, మంచి ఆదరణ పొందిన రికార్డ్ ఆల్బమ్‌లను విడుదలచేసింది. టెలివిజన్‌ కార్యక్రమాలలో నటించింది. 1980, మార్చిలో తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించింది. బ్రాడ్‌వే నాటకరంగంలో 300 కంటే ఎక్కువ నాటకాలలో నటించింది.

లీనా హార్న్ 1917, జూన్ 30న బ్రూక్లిన్‌లోని బెడ్‌ఫోర్డ్-స్టూయ్వేసంట్‌లో జన్మించింది.[1]

సినిమాలు

మార్చు
  1. ది డ్యూక్ ఈజ్ టాప్స్ (1938)
  2. క్యాబిన్ ఇన్ ది స్కై (1943)
  3. థౌజండ్స్ చీర్ (1943)
  4. ఐ డూడ్ ఇట్ (1943)
  5. స్వింగ్ ఫీవర్ (1943)
  6. బూగీ-వూగీ డ్రీమ్ (1944)
  7. బ్రాడ్‌వే రిథమ్ (1944)
  8. స్టూడియో విజిట్ (1946)
  9. టిల్ ది క్లౌడ్స్ రోల్ బై (1946)
  10. జిగ్‌ఫెల్డ్ ఫోలీస్ (1946)
  11. డచెస్ ఆఫ్ ఇడాహో (1950)
  12. మీట్ మి ఇన్ లాస్ వెగాస్ (1956)
  13. ది హార్ట్ ఆఫ్ షో బిజినెస్ (1957)
  14. ది విజ్ (1978)
  15. స్ట్రేంజ్ ఫ్రేమ్ (ఆర్కైవ్ ఫుటేజ్, 2012)

టెలివిజన్

మార్చు
  1. ఎడ్ సుల్లివన్ షో ( 1957 జనవరి 6)
  2. ది జూడీ గార్లాండ్ షో ( 1963 అక్టోబరు 13)
  3. పెర్రీ కోమో షో ( 1965 మార్చి 5)
  4. సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #5.1, 1973 నవంబరు 19)
  5. శాన్‌ఫోర్డ్ & సన్ ("ఎ విజిట్ ఫ్రమ్ లీనా హార్న్", #2. 1973 జనవరి 12)
  6. ది ముప్పెట్ షో (1976)
  7. సెసేమ్ స్ట్రీట్ (ఎపిసోడ్ #7.76, 1976 మార్చి 15)
  8. ది కాస్బీ షో ("క్లిఫ్స్ బర్త్ డే" 1985 మే 9)
  9. ఎ డిఫరెంట్ వరల్డ్ ("ఎ రాక్, ఎ రివర్, ఎ లీనా" 1993 జూలై)

హార్న్ 2010, మే 9న గుండెపోటుతో మరణించింది.[2] తను సభ్యురాలుగా ఉన్న న్యూయార్క్‌లోని పార్క్ అవెన్యూలోని సెయింట్ ఇగ్నేషియస్ లయోలా చర్చిలో అంత్యక్రియలు జరిగాయి.[3]

అవార్డులు

మార్చు

గ్రామీ అవార్డులు

మార్చు
లీనా హార్న్ గ్రామీ అవార్డు చరిత్ర [4][5]
1961 లీనా హార్న్ ఎట్ ది సాండ్స్ బెస్ట్ వోకల్ పెర్ఫార్మెన్స్ ఆల్బమ్, ఫిమేల్ ప్రతిపాదించబడింది
1962 పోర్గీ అండ్ బెస్ ఉత్తమ సోలో వోకల్ పెర్ఫార్మెన్స్, ఫిమేల్ ప్రతిపాదించబడింది
1981 లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్ ఉత్తమ పాప్ గాత్ర ప్రదర్శన, స్త్రీ గెలుపు
లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్ ఉత్తమ తారాగణం ప్రదర్శన ఆల్బమ్ గెలుపు
1988 ది మెన్ ఇన్ మై లైఫ్ ఉత్తమ జాజ్ గాత్ర ప్రదర్శన ప్రతిపాదించబడింది
"ఐ వోంట్ లీవ్ యు ఎగైన్" ఉత్తమ జాజ్ స్వర ప్రదర్శన, ద్వయం లేదా సమూహం ప్రతిపాదించబడింది
1989 లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గెలుపు
1995 ఎన్ ఈవినింగ్ విత్ లీనా హార్న్‌ ఉత్తమ జాజ్ గాత్ర ప్రదర్శన గెలుపు

ఇతర అవార్డులు

మార్చు
సంవత్సరం సంస్థ విభాగం ఫలితం ఇతర వివరాలు
1957 టోనీ అవార్డులు ఉత్తమ నటి నామినీ జమైకా
1980 హోవార్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ [6] సన్మానం
1980 డ్రామా డెస్క్ అవార్డులు అత్యుత్తమ నటి - సంగీత విజేత లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1980 న్యూయార్క్ డ్రామా క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ప్రత్యేక సైటేషన్ విజేత లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1981 టోనీ అవార్డులు ప్రత్యేక సైటేషన్ విజేత లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్
1984 జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కెన్నెడీ సెంటర్ ఆనర్స్[7] విజేత అసాధారణ ప్రతిభ, సృజనాత్మకత, పట్టుదల కోసం
1985 ఎమ్మీ అవార్డు లీనా హార్న్: ది లేడీ అండ్ హర్ మ్యూజిక్ నామినీ
1987 అమెరికన్ సొసైటీ ఆఫ్ కంపోజర్స్, రచయితలు, ప్రచురణకర్తలు పైడ్ పైపర్ అవార్డు[8] విజేత పదాలు, సంగీతానికి గణనీయమైన కృషి చేసిన వినోదకారులకు అందించబడింది
1994 సామీ కాహ్న్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పాటల రచయితల హాల్ ఆఫ్ ఫేమ్ విజేత
1997 గాయకుల సంఘం సొసైటీ ఆఫ్ సింగర్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు[9] విజేత "సమాజానికి , ప్రపంచవ్యాప్త కారణాలకు ప్రయోజనం చేకూర్చడానికి వారి అంకిత ప్రయత్నాలతో పాటు సంగీత ప్రపంచానికి చేసిన కృషికి గాను గాయకులు అవార్డు పొందారు"
1999 ఇమేజ్ అవార్డు అత్యుత్తమ జాజ్ కళాకారుడు విజేత
2006 మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ జాతీయ చారిత్రక ప్రదేశం అంతర్జాతీయ పౌర హక్కుల వాక్ ఆఫ్ ఫేమ్ [10] చేర్చబడింది
? హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ విజేత గౌరవం (చలన చిత్రాలు)
? హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ విజేత గౌరవం (రికార్డింగ్‌లు)

మూలాలు

మార్చు
  1. "About the Performer". American Masters. May 14, 2010. PBS. https://www.pbs.org/wnet/americanmasters/episodes/lena-horne/about-the-performer/487/. Retrieved December 18, 2011. 
  2. Bernstein, Adam (May 11, 2010). "Lena Horne Dies at 92". The Washington Post.
  3. Morman, Dr Robert R. (2010). Adieus to Achievers. AuthorHouse. ISBN 978-1456727550 – via Google Books.
  4. "GRAMMY Winners Search". Archived from the original on December 31, 2008. Retrieved December 5, 2008.
  5. "The Envelope: Hollywood's Awards and Industry Insider – Los Angeles Times". Theenvelope.latimes.com. July 13, 2017. Retrieved July 21, 2017.
  6. "Kennedy Center: Biographical information for Lena Horne". Archived from the original on June 13, 2007. Retrieved June 9, 2007.
  7. "Past Honorees". Kennedy-center.org. Retrieved July 21, 2017.
  8. "ASCAP Error Page". www.ascap.com. Archived from the original on 2009-07-17. Retrieved 2023-06-27.
  9. "Ella Award Special Events". February 12, 2011. Archived from the original on May 14, 2015. Retrieved May 10, 2015.
  10. [1] Archived డిసెంబరు 12, 2007 at the Wayback Machine

బయటి లింకులు

మార్చు