లూజర్ (వెబ్ సిరీస్)

లూజర్ 2020లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్టూడియోస్, జీ5 నిర్మాణంలో ప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1]

లూజర్
దర్శకత్వంఅభిలాష్ రెడ్డి
తారాగణంప్రియదర్శి, కల్పిక గణేష్, శశాంక్, యానీ, పావని, కోమలి
సంగీతంశ్రీరామ్ మద్దూరి
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య10 ఎపిసోడ్స్ (list of episodes)
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంనరేష్ రామదురై
ప్రొడక్షన్ కంపెనీలుజీ5 ,అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5
వాస్తవ విడుదల20 మే 2020 (2020-05-20)

భారత క్రికెట్ జట్టులో 1985 కాలంలో చోటు కోసం అహర్నిశలు కృషి చేసే ఫాస్ట్ బౌలర్ విల్సన్ (శశాంక్). దుందుడుకు స్వభావానికి తోడు కొన్ని కారణాలు అతడు జట్టులో స్థానం కోల్పోయి, తాగుడుకి బానిసగా మారి కెరీర్ పాడు చేసుకుంటాడు. అలా ప్రేమించి పెళ్లాడిన భార్య నమ్మకం పోగొట్టుకుని ఆఖరికి 20 ఏళ్ల కుర్రాడికి ఒంటరి తండ్రిగా, లోకల్ క్రికెట్ ట్రయినింగ్ కోచ్ గా మిగిలిపోతాడు.

1993లో ఒక ముస్లిమ్ బాలిక (ఆనీ) బ్యాడ్మింటన్ క్రీడలో రాణించాలని కలలు కంటూ వుంటుంది. అమ్మాయిలు ఆటలాడడాన్ని అస్సలు సహించని ఆమె తండ్రికి తెలియకుండా కోచింగ్ తీసుకుంటూ వుంటుంది. తండ్రి మనసు కూడా మార్చుకుంటుంది కానీ ఆడవాళ్లకి క్రీడలలో ఎదురయ్యే అవరోధాలని అధిగమించలేక భారత్ తరుపున మాత్రం ఆడలేకపోతుంది.

2007లో ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టేట్ ప్లేయర్ అయిన సూరి యాదవ్‌కి (ప్రియదర్శి) నేషనల్స్‌కి వెళ్లే అవకాశం దక్కుతుంది. పెయింటింగ్స్ వేసుకుంటూ పొట్ట పోసుకునే అతను నేషనల్స్‌లో చోటు కోసం అయిదు లక్షలు సంపాదించాల్సిన అవసరం పడుతుంది. సూరి నేషనల్ లెవల్ కి వెళ్లడానికి రూబి, విల్సన్ ఎలా సహాయపడ్డారు? అసలెందుకు వీరు సూరికి సహాయం చేశారు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Andrajyothy (6 June 2020). "సక్సెస్‌మీట్‌లో 'లూజర్'". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  2. iDreamPost (21 July 2020). "లాక్ డౌన్ రివ్యూ 29 - ఓటమిలో గెలుపు" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.