లూడో మార్టెన్స్

లూడో మార్టెన్స్ (Ludo Martens) బెల్జియం దేశానికి చెందిన ఒక ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. ఇతను 1968లో "ఆల్ పవర్ టు ద వర్కర్స్" అనే మావోయిస్ట్ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ ప్రస్తుతం బెల్జియన్ కార్మిక పార్టీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బెల్జియం) పేరుతో పని చేస్తోంది. 1994లో లూడో మార్టెన్స్ "మరో కోణంలో స్టాలిన్" [1] అనే గ్రంథం వ్రాశాడు. సోవియట్ యూనియన్ లో వ్యవసాయ సమిష్ఠీకరణ సమయంలో జరిగిన రైతుల అరెస్టులు, మరణాల పై సామ్రాజ్యవాద మీడియా చూపిస్తున్న లెక్కలు అవాస్తవాలని అందులో పేర్కొన్నాడు. సోవియట్ యూనియన్ ని నిజాయితీగా పరిపాలించిన చివరి నాయకుడు స్టాలిన్ అని అతను ఆ పుస్తకంలో వివరించారు.

లూడో మార్టెన్స్
వర్కర్స్ పార్టీ ఆఫ్ బెల్జియం కు అధ్యక్షుడు
In office
4 నవంబరు 1979 – 2 మార్చి 2008
అంతకు ముందు వారుకార్యాలయ ప్రారంభం
తరువాత వారుపీటర్ మార్టిన్స్
వ్యక్తిగత వివరాలు
జననం
లూడో మార్టెన్స్

(1946-03-12)1946 మార్చి 12
టార్హాట్, బెల్జియం
మరణం2011 జూన్ 5(2011-06-05) (వయసు 65)
రాజకీయ పార్టీవర్కర్స్ పార్టీ ఆఫ్ బెల్జియం
వృత్తి
  • ఉద్యమకారుడు
  • రచయిత

మూలాలు

మార్చు
  1. "మరో కోణంలో స్టాలిన్ పుస్తకం". Archived from the original on 2006-06-01. Retrieved 2008-12-10.

బాహ్యలంకెలు

మార్చు