వ్యవసాయ సమిష్ఠీకరణ

వ్యవసాయ సమిష్ఠీకరణ అంటే వ్యవసాయాన్ని జాతీయీకరించడం (Nationalization). రైతుల వద్ద ఉన్న ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకుని వాటిని సమిష్ఠి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి అందులో అందరికీ పని కల్పించడం.

సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ మార్చు

సోవియట్ సమాఖ్యలో 1922 తరువాత స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయ సమిష్ఠీకరణ మొదలయ్యింది. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జెర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి తీవ్ర నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20% కి తగ్గిపోయింది.

క్యూబాలో వ్యవసాయ సమిష్ఠీకరణ మార్చు

క్యూబాలో 1959లో సోషలిస్ట్ విప్లవం వచ్చింది. 1960 తరువాత క్యూబాలో వ్యవసాయ సమిష్ఠీకరణ మొదలయ్యింది. వ్యవసాయ సమిష్ఠీకరణ కోసం దేశ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కుటుంబ సభ్యులకై చెందిన ప్రైవేట్ భూముల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు అంగీకరించని కాస్ట్రో కుటుంబ సభ్యులు కొందరు దేశం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. క్యూబా ప్రభుత్వం సమిష్ఠి వ్యవసాయ క్షేత్రాలలో పండించిన చెరుకుని ఫాక్టరీలలో ప్రోసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 1989 వరకు క్యూబా రష్యాకు చక్కెర ఎగుమతి చేసింది. ఇప్పుడు క్యూబా చైనాకు చక్కెర ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల క్యూబా చక్కెర పరిశ్రమకి భారీ నష్టం వచ్చినా క్యూబాలో చెరుకు క్షేత్రాలు, చక్కెర పరిశ్రమలు ఇంకా ఉనికిలో కొనసాగుతున్నాయి.[1] చెరుకు క్షేత్రాల నుంచి చెరుకుని నేరో గేజ్ ట్రైన్ ల ద్వారా చక్కెర ఫాక్టరీలకి తరలించి భారీ మొత్తంలో ప్రోసెస్ చేస్తారు.

చైనాలో వ్యవసాయ సమిష్ఠీకరణ మార్చు

మావో జెడాంగ్ బతికి ఉన్నప్పుడు చైనాలో "పెద్ద ముందడుగు" కార్యక్రమంలో భాగంగా వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం జరిగింది. మావో చనిపోయిన తరువాత రివిజనిస్ట్ డెంగ్ సియావోపింగ్ నాయకత్వంలో వ్యవసాయాన్ని ప్రైవేటీకరించడం జరిగింది.

మూలాలు మార్చు

  • సోషలిజం విజయాలు, విఛ్ఛిన్నాలు - తెలకపల్లి రవి, పబ్లిషర్: ప్రజాశక్తి బుక్ హౌస్
  • చైనాలో ఏమి జరుగుతోంది? - రంగనాయకమ్మ (తెలుగు అనువాదం), ఆంగ్ల మూలం: చార్లెస్ బెటెల్హీం