లేడీస్ డాక్టర్
లేడీస్ డాక్టర్ 1996 లో రాము దర్శకత్వంలో వచ్చిన కామెడీ సినిమా.[1] శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, రాము దర్శకత్వంలో బి. వనజ, సి. కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వినీత, కీర్తన ప్రధాన పాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.[3]
లేడీస్ డాక్టర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | రాము |
కూర్పు | కె.రమేష్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
కథసవరించు
రామ్ ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ప్రాక్టీసు లేని డాక్టరు. రాణి (కీర్తన) అనే అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. జానకి (వినీత) ఒక సాంప్రదాయిక మహిళ. ఆమె పూర్వపు ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూంటుంది. తన కాబోయే భర్త తప్ప మరో మగవాడు తనను తాకనే కూడదనే నిబంధన పెట్టుకుంది.. ఒకసారి ఆమె తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతుంటే, లేడీ డాక్టర్ లేకపోవడం వల్ల, రామ్ ప్రసాద్ మహిళ వేషంలో ఆపరేషన్ చేస్తాడు. తరువాత, విషయం తెలుసుకున్న జానకి రామ్ ప్రసాదే తన భర్త అని ప్రకటిస్తుంది. జానకి సోదరుడు రామదాసు (కె. అశోక్ కుమార్), కరుడు గట్టిన నేరస్థుడు. రామ్ ప్రసాద్ ను బలవంతపెట్టి తన సోదరిని పెళ్ళి చేసుకునేందుకు ఒప్పిస్తాడు. ఇప్పుడు, రామ్ ప్రసాద్ ఇద్దరి మధ్య చిక్కుకున్నాడు. అతడు ఈ సమస్యల నుండి ఎలా బయట పడతాడు, అతను ఎవరిని పెళ్ళి చేసుకుంటాడనేది మిగతా కథ.
నటవర్గంసవరించు
- గద్దె రాజేంద్ర ప్రసాద్
- వినీత
- కీర్తన
- బ్రహ్మానందం
- బాబూ మోహన్
- ఎ. వి. ఎస్
- కాస్ట్యూమ్ కృష్ణ
- రాళ్లపల్లి
- ఎం.ఎస్. నారాయణ
- కళ్ళు చిదంబరం
- రమ్యకృష్ణ
- వై. విజయ
పాటలుసవరించు
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓ ఆకాశవాణీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, కె.ఎస్.చిత్ర | 4:02 |
2. | "చలిగాలి చెంగుచాటు" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, కె.ఎస్.చిత్ర | 2:33 |
3. | "వైద్యో నారాయణో హరీ" | శ్రీహర్ష | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్ | 3:45 |
4. | "ఎన్నెన్నో నోములు నోచి" | శ్రీహర్ష | మనో, కె.ఎస్.చిత్ర | 4:34 |
5. | "ఇటుపక్క చక్కని బొమ్మ" | శ్రీహర్ష | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత | 4:00 |
6. | "అమ్మోరు" | శ్రీహర్ష | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సింధు | 4:53 |
Total length: | 23:47 |
మూలాలుసవరించు
- ↑ "లేడీస్ డాక్టర్ (1996)". youtube.com. మల్లెమాల టీవీ. Retrieved 18 October 2016.
- ↑ "Ladies Doctor (Cast & Crew)". Archived from the original on 2018-10-02. Retrieved 2020-08-11.
- ↑ "Ladies Doctor (Review)".