సిరివెన్నెల సీతారామశాస్త్రి
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు' అని చెబుతారు.[1]2019లో భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.
సీతారామశాస్త్రి | |
---|---|
జననం | చేంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20 అనకాపల్లి, విశాఖపట్నంజిల్లా,ఆంధ్రప్రదేశ్ |
మరణం | 2021 నవంబరు 30 | (వయసు 66)
నివాస ప్రాంతం | హైదరాబాద్,తెలంగాణ |
ఇతర పేర్లు | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
వృత్తి | కవి, రచయిత, గాయకుడు, , నటుడు |
మతం | బ్రాహ్మణ హిందూ |
భార్య / భర్త | పద్మావతి |
పిల్లలు | యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు |
తండ్రి | డా.సి.వి.యోగి |
తల్లి | సుబ్బలక్ష్మి |
బాల్యం
మార్చుశాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాకు[1] పాటలు రాసే అవకాశం కల్పించారు. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున పాట తో బహుళ ప్రాచుర్యం పొందారు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.
కుటుంబం
మార్చుసిరివెన్నెల సీతారామశాస్త్రి కు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు.[2]
సినిమా పాటల రచయితగా
మార్చువిధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.
ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:
- ఆరంగేట్రం సిరివెన్నెల లోని ప్రతి పాట అణిముత్యమే.
- స్వయంకృషిలోని పాటలు
- రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ
- స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశంలో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిది
- శృతిలయలులో - తెలవారదేమో స్వామి
- శివలో బోటని పాఠముంది
- క్షణక్షణంలో కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా
- గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు, రాష్ట్ర నంది అవార్డు సాధించిన స్వరాజ్యమవలేని
- గులాబిలో ఏ రోజైతె చూశానో నిన్నూ, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ
- మనీలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ
- శుభలగ్నం లోని చిలకా ఏ తోడు లేకా
- నిన్నే పెళ్ళడతా లోని కన్నుల్లో నీ రూపమే, నిన్నే పెళ్ళాడేస్తానంటూ
- సింధూరం లోని అన్ని పాటలు ముఖ్యంగా - సంకురాత్రి పండగొచ్చెరో, అర్థ శతాబ్దపూ
- దేవీపుత్రుడు లోని ఓ ప్రేమా
- చంద్రలేఖ లోని ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూడయ్యో
- నువ్వే కావాలి నుంచి ఎక్కడ ఉన్నా, కళ్ళలొకి కళ్ళు పెట్టీ
- నువ్వు నాకు నచ్చావు నుంచి ఆకశం దిగివచ్చి
- శుభ సంకల్పం నుంచి హైలెస్సో, సీతమ్మ అందాలూ
- పట్టుదల నుండి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
మరణం
మార్చుసిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబరు 30న మరణించాడు.[3]
సినిమాల జాబితా (గేయ రచయితగా)
మార్చుసంవత్సరం | చిత్రం | దర్శకుడు | సంగీత దర్శకుడు | పాటలు |
---|---|---|---|---|
1986 | సిరివెన్నెల | కె. విశ్వనాథ్ | కె.వి. మహదేవన్ |
|
1986 | లేడీస్ టైలర్ | వంశీ | ఇళయరాజా |
|
1987 | గౌతమి | క్రాంతి కుమార్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
1987 | శ్రుతిలయలు | కె. విశ్వనాథ్ | కె.వి. మహదేవన్ | |
1987 | స్వయంకృషి | కె. విశ్వనాథ్ | రమేష్ నాయుడు |
|
1987 | మహర్షి | వంశీ | ఇళయరాజా |
|
1988 | రుద్రవీణ | కె. బాలచందర్ | ఇళయరాజా |
|
1988 | ఆడదే ఆధారం | విసు |
| |
1988 | ఇల్లు ఇల్లాలు పిల్లలు | విసు |
| |
1988 | కళ్ళు | ఎస్పీబీ |
| |
1988 | పెళ్ళి చేసి చూడు | రేలంగి నరసింహారావు | హంసలేఖ |
|
1988 | శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ | వంశీ | ఇళయరాజా |
|
1988 | స్వర్ణ కమలం | కె. విశ్వనాథ్ | ఇళయరాజా |
|
1989 | జయమ్ము నిశ్చయమ్మురా | జంధ్యాల | రాజ్-కోటి |
|
1989 | స్వరకల్పన | వంశీ | అమర్ |
|
1989 | సూత్రధారులు | కె. విశ్వనాథ్ | కె.వి.మహదేవన్ |
|
1990 | అన్న-తమ్ముడు | కృష్ణ | రాజ్-కోటి |
|
1990 | అల్లుడుగారు | కె. రాఘవేంద్రరావు | కె.వి. మహదేవన్ |
(to be confirmed) |
1990 | శివ | రామ్ గోపాల్ వర్మ | ఇళయరాజా |
|
1990 | బొబ్బిలిరాజా | బి. గోపాల్ | ఇళయరాజా |
|
1990 | చెవిలో పువ్వు | ఇ.వి.వి.సత్యనారాయణ | చక్రవర్తి |
|
1991 | ఆదిత్య 369 | సింగీతం శ్రీనివాసరావు | ఇళయరాజా |
|
1991 | కలికాలం | ముత్యాల సుబ్బయ్య | not known
(to be confirmed) source:cinegoer.com | |
1991 | కూలీ నెం.1 | కె. రాఘవేంద్రరావు | ఇళయరాజా |
|
1991 | రౌడీ అల్లుడు | కె. రాఘవేంద్రరావు | బప్పిలహరి |
|
1991 | క్షణక్షణం | ఎం. ఎం. కీరవాణి |
| |
1991 | అసెంబ్లీ రౌడీ | బి. గోపాల్ | కె.వి.మహదేవన్ |
|
1991 | ఏప్రిల్ 1 విడుదల | వంశీ | ఇళయరాజా |
|
1992 | ఆపద్బాంధవుడు | కె. విశ్వనాథ్ | ఎం. ఎం. కీరవాణి |
|
1992 | పట్టుదల | ఇళయరాజా |
| |
1992 | పరువు ప్రతిష్ఠ | రాజ్-కోటి |
| |
1992 | స్వాతి కిరణం | కె. విశ్వనాథ్ | కె.వి.మహదేవన్ |
|
1993 | అల్లరి ప్రియుడు | కె. రాఘవేంద్రరావు | ఎం. ఎం. కీరవాణి |
|
1993 | మనీ | శివనాగేశ్వరరావు | శ్రీ |
|
1993 | మేజర్ చంద్రకాంత్ | కె. రాఘవేంద్రరావు | ఎం. ఎం. కీరవాణి |
|
1993 | గాయం | రామ్ గోపాల్ వర్మ | శ్రీ |
|
1993 | రక్షణ | ఉప్పలపాటి నారాయణరావు | ఎం. ఎం. కీరవాణి |
|
1993 | నిప్పురవ్వ | ఎ.కోదండరామిరెడ్డి | బప్పిలహరి, రాజ్-కోటి, ఎ.ఆర్.రెహమాన్ |
|
1993 | అంతం | రామ్ గోపాల్ వర్మ | ఆర్ డి బర్మన్, ఎం. ఎం. కీరవాణి , మణిశర్మ |
|
1994 | గోవిందా గోవిందా | రామ్‌గోపాల్‌వర్మ | రాజ్-కోటి |
|
1994 | నంబర్ వన్ | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1994 | శుభలగ్నం | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1994 | భైరవద్వీపం | సింగీతం శ్రీనివాసరావు | మాధవపెద్ది సురేష్ |
(to be confirmed) source:ghantasala.info
|
1994 | ముద్దులప్రియుడు | కె.రాఘవేంద్రరావు | ఎం. ఎం. కీరవాణి |
|
1994 | యమలీల | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1994 | ప్రియరాగాలు | ఎం. ఎం. కీరవాణి |
| |
1994 | మనీ మనీ | శివనాగేశ్వరరావు | శ్రీ |
|
1995 | క్రిమినల్ | మహేష్ భట్ | ఎం. ఎం. కీరవాణి |
|
1995 | గులాబి | కృష్ణవంశీ | శశిప్రీతమ్ |
|
1995 | శుభసంకల్పం | కె.విశ్వనాథ్ | ఎం. ఎం. కీరవాణి |
|
1995 | సిసింద్రీ | రాజ్ |
| |
1995 | పెదరాయుడు | రవిరాజా పినిశెట్టి | కోటి |
|
1995 | సొగసు చూడతరమా | గుణశేఖర్ | రమణి భరద్వాజ్ |
|
1995 | అనగనగా ఒకరోజు | రామ్ గోపాల్ వర్మ | శ్రీ |
|
1996 | లవ్‌బర్డ్స్ (డబ్బింగ్) | పి వాసు | ఏఆర్ రెహమాన్ |
|
1996 | మావిచిగురు | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1996 | పవిత్ర బంధం |
| ||
1996 | మైనా | ఉప్పలపాటి నారాయణరావు | ఎం. ఎం. కీరవాణి |
|
1996 | లిటిల్ సోల్జర్స్ | గుణ్ణం గంగరాజు | శ్రీ |
|
1996 | వజ్రం | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1996 | నిన్నే పెళ్ళాడతా | కృష్ణవంశీ | సందీప్ చౌతా |
|
1996 | శ్రీకారం |
| ||
1996 | అక్కుమ్ బక్కుమ్ |
| ||
1996 | సంప్రదాయం | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1996 | రాముడొచ్చాడు | ఎ.కోదండరామిరెడ్డి | కోటి |
|
1996 | శ్రీ కృష్ణార్జున విజయం | సింగీతం శ్రీనివాసరావు | మాధవపెద్ది సురేష్ |
|
1997 | వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ | వంశీ | కీరవాణి |
|
1997 | పెళ్ళి | కోడి రామకృష్ణ | ఎస్.ఎ.రాజ్‌కుమార్ |
|
1997 | ఆరోప్రాణం | వీరు కె. | వీరు కె. |
|
1997 | పెళ్ళి చేసుకుందాం | ముత్యాల సుబ్బయ్య | కోటి |
|
1997 | గోకులంలో సీత | ముత్యాల సుబ్బయ్య | కోటి |
|
1997 | తారకరాముడు | కోటి |
| |
1997 | దేవుడు | శిర్పి |
| |
1997 | శుభముహూర్తం | కీరవాణి |
| |
1997 | వీడెవడండీ బాబూ | ఇ.వి.వి | శిర్పి |
|
1997 | ప్రేమించుకుందాం రా | మహేష్ |
| |
1997 | ఆహ్వానం | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1997 | చిన్నబ్బాయి | కె. విశ్వనాథ్ | ఇళయరాజా |
|
1998 | సింధూరం | కృష్ణవంశీ | శ్రీ |
|
1998 | పవిత్ర ప్రేమ | ముత్యాల సుబ్బయ్య | కోటి |
|
1998 | ఆవిడా మా ఆవిడే | ఇ.వి.వి | శ్రీ |
|
1998 | గణేష్ | మణిశర్మ |
| |
1997 | ప్రేమతో (డబ్బింగ్) | మణిరత్నం | ఎ.ఆర్.రెహమాన్ |
|
1998 | సూర్యవంశం | ఎస్ ఎ రాజ్ కుమార్ |
| |
1998 | ఊయల | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1998 | శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి | వై.వి.ఎస్.చౌదరి | ఎం. ఎం. కీరవాణి |
|
1998 | ఆహా | వందేమాతరం శ్రీనివాస్ |
| |
1998 | అంతఃపురం | కృష్ణవంశీ | ఇళయరాజా |
|
1999 | రాజా | ఎస్ ఎ రాజ్ కుమార్ |
| |
1999 | మా బాలాజీ | కోడి రామకృష్ణ | వందేమాతరం శ్రీనివాస్ |
|
1999 | సీతారామరాజు | వై.వి.ఎస్. చౌదరి | కీరవాణి |
|
1999 | శీను | మణిశర్మ |
| |
1999 | మనసులో మాట | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
1999 | నా హృదయంలో నిదురించే చెలి | శ్రీ |
| |
1999 | ప్రేమకథ | రామ్‌గోపాల్‌వర్మ | సందీప్ చౌతా |
|
1999 | ప్రేమంటే ఇదేరా | రమణ గోగుల |
| |
2000 | ఆజాద్ | తిరుపతిస్వామి | మణిశర్మ |
|
2000 | చిరునవ్వుతో | మణిశర్మ |
| |
2000 | నువ్వే కావాలి | విజయ్ భాస్కర్ | కోటి |
|
2000 | ఒకేమాట | కోటి | (to be confirmed)
| |
2000 | జయం మనదేరా | వందేమాతరం శ్రీనివాస్ |
| |
2000 | చూసొద్దాం రండి | రాజా వన్నెంరెడ్డి | ఎం. ఎం. కీరవాణి |
|
2000 | సర్దుకుపోదాం రండి | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
2000 | శ్రీ శ్రీమతి సత్యభామ | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.వి.కృష్ణారెడ్డి |
|
2000 | నిన్నే ప్రేమిస్తా | షిండే | ఎస్.ఎ. రాజ్‌కుమార్ |
|
2000 | అంతా మన మంచికే | వీరు కె. |
| |
2000 | నువ్వు వస్తావని | వి.ఆర్. ప్రతాప్ | ఎస్.ఎ. రాజ్‌కుమార్ |
|
2000 | మురారి | కృష్ణవంశీ | మణిశర్మ |
|
2000 | రాయలసీమ రామన్న చౌదరి | సురేష్ కృష్ణ | మణిశర్మ |
|
1992 | లాఠీ | ఎం. ఎం. కీరవాణి |
| |
2001 | ఆనందం | శ్రీను వైట్ల | దేవి శ్రీ ప్రసాద్ |
|
2001 | మనసంతా నువ్వే | వి ఎన్ ఆదిత్య | ఆర్ పి పట్నాయక్ |
|
2001 | నువ్వు నాకు నచ్చావ్ | కోటి |
| |
2001 | ప్రేమతో రా | మణిశర్మ |
| |
2001 | అమ్మాయి కోసం | ముప్పలనేని శివ | వందేమాతరం శ్రీనివాస్ |
|
2001 | వేచి ఉంటా | ఆకాష్ |
| |
2001 | బావ నచ్చాడు | కె.ఎస్. రవికుమార్ | ఎం. ఎం. కీరవాణి |
|
2001 | ఎదురులేని మనిషి | ఎస్.ఎ. రాజ్‌కుమార్ |
| |
2001 | వాసు | కరుణాకరన్ | హారిస్ జయరాజ్ |
|
2002 | ఒక్కడు | గుణశేఖర్ | మణిశర్మ |
|
2002 | ఓ చినదాన | విద్యాసాగర్ |
| |
2002 | సంతోషం | దశరథ్ | ఆర్ పి పట్నాయక్ |
|
2002 | అల్లరి | రవిబాబు | పాల్ జె. |
|
2002 | మనసుంటే చాలు | శివశంకర్ |
| |
2002 | లాహిరి లాహిరి లాహిరిలో | వై.వి.ఎస్. చౌదరి | ఎం. ఎం. కీరవాణి |
|
2003 | డాడీ | సురేష్ కృష్ణ | ఎస్ ఎ రాజ్‌కుమార్ |
|
2003 | వసంతం | ఎస్ ఎ రాజ్‌కుమార్ |
| |
2003 | ఎలా చెప్పను | కోటి |
| |
2003 | మన్మథుడు | విజయ భాస్కర్ | దేవి శ్రీ ప్రసాద్ |
|
2003 | సింహాద్రి | రాజమౌళి | ఎం. ఎం. కీరవాణి |
|
2004 | గుడుంబా శంకర్ | మణిశర్మ |
| |
2004 | వర్షం | శోభన్ | దేవి శ్రీ ప్రసాద్ |
|
2004 | శ్రీ ఆంజనేయం | కృష్ణవంశీ | మణిశర్మ |
|
2004 | ఆర్య | సుకుమార్ | దేవి శ్రీ ప్రసాద్ |
|
2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | ప్రభుదేవా | దేవి శ్రీ ప్రసాద్ |
|
2005 | చక్రం | కృష్ణవంశీ | చక్రి |
|
2005 | సంక్రాంతి | ఎస్ ఎ రాజ్‌కుమార్ |
| |
2006 | హ్యాపీ | కరుణాకరన్ | యువన్ శంకర్ రాజా |
|
2006 | శివ 2006 (డబ్బింగ్) | రామ్ గోపాల్ వర్మ | ఇళయరాజా |
|
2007 | బొమ్మరిల్లు | భాస్కర్ | దేవి శ్రీ ప్రసాద్ |
|
2007 | ఆట | వి.ఎన్. ఆదిత్య | దేవి శ్రీ ప్రసాద్ |
|
2007 | చిరుత | పూరీ జగన్నాథ్ | మణిశర్మ |
|
2007 | క్లాస్‌మేట్స్ | విజయ్ భాస్కర్ | కోటి |
|
2007 | ఒక్కడున్నాడు | చంద్రశేఖర్ యేలేటి | ఎం. ఎం. కీరవాణి |
|
2007 | ఆడవారి మాటలకు అర్థాలే వేరులే | యువన్ శంకర్ రాజా |
| |
2007 | అతిథి | మణిశర్మ |
| |
2008 | విశాఖ ఎక్స్‌ప్రెస్ | వర ముళ్ళపూడి | విజయ్ కూరాకుల |
|
2008 | వాన | ఎమ్.ఎస్. రాజు | కమలాకర్ |
|
2008 | పరుగు | భాస్కర్ | మణిశర్మ |
|
2008 | హరే రామ్ | మిక్కీ జె. మేయర్ |
| |
2008 | గమ్యం | ఇ.ఎస్. మూర్తి |
| |
2008 | జల్సా | త్రివిక్రమ్ | దేవి శ్రీ ప్రసాద్ |
|
2008 | కంత్రి | మణిశర్మ |
| |
2008 | రెడీ | శ్రీను వైట్ల | దేవి శ్రీ ప్రసాద్ |
|
2008 | అష్టా చమ్మా | ఇంద్రగంటి | కళ్యాణి మాలిక్ |
|
2008 | కొత్త బంగారు లోకం | మిక్కీ జె. మేయర్ |
| |
2009 | శశిరేఖా పరిణయం | కృష్ణవంశీ | మణిశర్మ |
|
2009 | మహాత్మ | కృష్ణవంశీ | విజయ్ ఆంటోని |
|
2009 | కిక్ | సురేందర్ రెడ్డి | థమన్ |
|
2014 | అలా ఎలా? | అనీష్ కృష్ణ | భీమ్స్ సెసిరోలియో | |
2018 | దేవదాస్ | శ్రీరామ్ అదిత్య | మణిశర్మ |
|
2020 | అల వైకుంఠపురములో | త్రివిక్రమ్ | థమన్ |
|
2021 | శ్యామ్ సింగరాయ్ | రాహుల్ సాంకృత్యన్ | మిక్కీ జె. మేయర్ |
|
నటుడిగా
మార్చుప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని... అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా,[1] తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది[1] పురస్కారం లభించటం విశేషం.
పురస్కారాలు
మార్చుఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1986 - సిరివెన్నెల - విధాత తలఁపున...
- 1987 - శ్రుతిలయలు - తెలవారదేమో ...
- 1988 - స్వర్ణకమలం - అందెల రవమిది...
- 1993 - గాయం - సురాజ్యమవలేని...
- 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక...
- 1995 - శ్రీకారం - మనసు కాస్త కలత...
- 1997 - సింధూరం - అర్ధ శతాబ్దపు...
- 1999 - ప్రేమకథ - దేవుడు కరుణిస్తాడని...
- 2005 - చక్రం - జగమంత కుటుంబం నాది...
- 2008 - గమ్యం - ఎంతవరకూ ఎందుకొరకూ...
- 2013 - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - మరీ అంతగా.. (నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు)[5][6][7][8]
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :
- 2005 - నువ్వొస్తానంటే నేనొద్దంటానా -
- 2008 - గమ్యం - ఎంతవరకు...
- 2009 - మహాత్మ - ఇందిరమ్మ
- 2015 - కంచె
కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1986 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
- 1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
- 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
- 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
- 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
- 1998 - మనసిచ్చి చూడు - బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
- 1999 - అల్లుడుగారు వచ్చారు - నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషినికానా
కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా
భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1992 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
- 1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
- 1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!
అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
- 2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 2000 - నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :
- కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
- అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
- ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి
రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
- 1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ
బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
- 1999 - తులసి దళం, టి.వి. సీరియల్ - హాయిగా వుంది, నిదురపో
- 2021 - లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డు (మరణానంతరం)[9]
సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత
- 2015: "ఇటు ఇటు ఇటు" (కంచె)
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 హిందూ దిన పత్రిక వెబ్సైట్ నుండి Poet who loves to churn the mind Archived 2008-03-07 at the Wayback Machine సీతారామశాస్త్రి గురించి వ్యాసంజూన్ 11,2008న సేకరించబడినది.
- ↑ 10TV (30 November 2021). "సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే.. | Sirivennela Family" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Popular Telugu lyricist Sirivennela Sitaramasastri is No More, Died of Lung Cancer". Moviezupp. 2021-11-30. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
- ↑ 10TV (30 November 2021). "సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే.. | Sirivennela" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)