లేరు కుశలవుల సాటి సరి వీరులో ధారుణిలో

లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో పాట లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీలలు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నేపథ్యం

మార్చు

లవకుశులు రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వమును బంధిస్తారు. రాముని సోదరులు, సైన్యం అందరూ అశ్వాన్ని విడిపించడానికి లవకుశులతొ యుద్ధం చేసి ఓడిపోతారు. అప్పుడు స్వయంగా రాముడే హనుమంతునితో కూడి అశ్వమును బంధించిన ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ సమయంలో లవకుశులు ఈ విధంగా గానం చేస్తారు.


పల్లవి :
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో .....
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో .....
లేరు కుశలవుల సాటి .....


చరణం :
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా .....
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
హయమును విడువముగా .....

లేరు కుశలవుల సాటి .....


చరణం :
బీరములాడి రాముని తమ్ములు దూరమున మాతో నిలువగలేక .....
బీరములాడి రాముని తమ్ములు దూరమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా .....
పరువము మాసిరిగా .....

లేరు కుశలవుల సాటి .....


చరణం :
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని.....
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని.....
యశమిక మాదేగా .....
యశమిక మాదేగా .....
యశమిక మాదేగా


లేరు కుశలవుల సాటి ..... సరి వీరులు ధారుణిలో .....
లేరు కుశలవుల సాటి .....

సాహిత్య విశేషాలు

మార్చు

లవకుశులు శ్రీరాముని యాగాశ్వాన్ని బంధించి విచ్చేసిన శతృఘ్నున్ని, లక్ష్మణుని ఓడిస్తారు. శ్రీరాముని సైతం ఎదిరించి ఓడించాలని ఉత్సాహంతో ముందుకు వస్తారు. తమకు సీతమ్మ తల్లి ఆశీర్వాదబలం, గురువు వాల్మీకి ప్రసాదించిన విద్యాబలం కొండంత అండగా వుంటాయని భావించి రామునితో యుద్ధానికి సిద్ధులౌతారు. పాటలో "వెన్నుకాయగా" (అండగా వుండటం) అనే అందమైన జాతీయాన్ని సముద్రాల సీనియర్ ఇందులో చేర్చారు.[1] ఈ పాటను మోహనరాగంలో స్వరపరచి వీరరసాన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.

బయటి లింకులు

మార్చు