లోడాక్సమైడ్
లోడాక్సమైడ్, అనేది అలోమైడ్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది అలెర్జీ కండ్లకలక చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[2] ఇది 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉపయోగించవచ్చు.[2]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
ఎన్,ఎన్′-(2-క్లోరో-5-సైనో-1,3-ఫినిలిన్) డయోక్సామిక్ ఆమ్లం | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [53882-12-5] |
పబ్ కెమ్ | 44564 |
SMILES | N#Cc1cc(NC(=O)C(=O)O)c(Cl)c(NC(=O)C(=O)O)c1 |
| |
ధర్మములు | |
C11H6ClN3O6 | |
మోలార్ ద్రవ్యరాశి | 311.63 g·mol−1 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
కంటి అసౌకర్యం, పొడి కళ్ళు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2][1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితమైనదిగా కనిపిస్తుంది కానీ అలాంటి ఉపయోగం బాగా అధ్యయనం చేయబడలేదు.[3] ఇది మాస్ట్ సెల్ స్టెబిలైజర్.[2]
లోడాక్సమైడ్ 1993లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 10 మి.లీ.ల బాటిల్ ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £5 ఖర్చవుతుంది.[1] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 175 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1206. ISBN 978-0857114105.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Lodoxamide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 January 2021. Retrieved 24 November 2021.
- ↑ "Lodoxamide ophthalmic (Alomide) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2020. Retrieved 24 November 2021.
- ↑ "Lodoxamide Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 24 November 2021.