లోనార్ సరస్సు
లోనార్ బిలం అని కూడా పిలువబడే లోనార్ సరస్సు నేషనల్ జియోలాజికల్-హెరిటేజ్ స్మారక చిహ్నం. ఇది మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోగల లోనార్ వద్ద ఉంది. ఇది ప్లీస్టోసీన్ యుగంలో ఉల్క తాకిడి ప్రభావంతో ఏర్పడింది. ఈ సరస్సు సగటు వ్యాసం 1.2 కిలోమీటర్లు (3,900 అడుగులు), లోతు దాదాపు 137 మీటర్లు (449 అడుగులు) ఉంది.[1]
లోనార్ సరస్సు | |
---|---|
ప్రదేశం | బుల్ఢానా జిల్లా, మహారాష్ట్ర, |
అక్షాంశ,రేఖాంశాలు | 19°58′30″N 76°30′27″E / 19.97500°N 76.50750°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 1,830 మీ. (6,000 అ.) |
ఉపరితల వైశాల్యం | 1.13 కి.మీ2 (0.44 చ. మై.) |
సరాసరి లోతు | 137 మీ. (449 అ.) |
గరిష్ట లోతు | 150 మీ. (490 అ.) |
భౌగోళికం
మార్చులోనార్ క్రేటర్ దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇది దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటనాల ద్వారా ఏర్పడిన భారీ అగ్నిపర్వత బసాల్ట్ రాతి మైదానం.[2] [3]
పరిశోధనలు
మార్చుభూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, ప్రకృతి శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ సరస్సు పర్యావరణ వ్యవస్థ వివిధ అంశాలపై అధ్యయనాలు చేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సాగర్ విశ్వవిద్యాలయం, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీని గురించి విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించాయి. 2007 లో జరిపిన అధ్యాయాలు ఈ సరస్సులో జీవ నైట్రోజన్ ను కనుగొన్నాయి.[4]
రామ్‌సర్ ప్రదేశం
మార్చుఐఐటి బాంబే నిర్వహించిన 2019 అధ్యయనంలో, సరస్సు నేలలోని ఖనిజాలు అపోలో ప్రోగ్రామ్ సమయంలో తీసుకొచ్చిన చంద్రుని శిలల్లో ఉండే ఖనిజాలతో సమానంగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ సరస్సు నవంబర్ 2020 లో రక్షిత రామ్‌సర్ ప్రదేశంగా ప్రకటించబడింది.[5]
మూలాలు
మార్చు- ↑ "National Geological Monument, from Geological Survey of India website". Archived from the original on 12 July 2017. Retrieved 23 May 2017.
- ↑ Crósta, A.P.; Reimold, W.U.; Vasconcelos, M.A.R.; Hauser, N.; Oliveira, G.J.G.; Maziviero, M.V.; Góes, A.M. (April 2019). "Impact cratering: The South American record – Part 1". Geochemistry. 79 (1): 1–61. Bibcode:2019ChEG...79....1C. doi:10.1016/j.chemer.2018.06.001.
- ↑ Deshpande, Rashmi (3 December 2014). "The Meteor Mystery Behind Lonar Lake". National Geographic Traveller Idia. National Geographic Group. Archived from the original on 6 January 2015. Retrieved 27 July 2015.
- ↑ Dhayade, Kundan, ed. (29 November 2004). "Earth observatory NASA". www.earthobservatory.nasa.gov.
- ↑ name="eid">"Lonar". The Planetary and Space Science Center. University of New Brunswick. Archived from the original on 24 September 2015. Retrieved 8 September 2008.