ప్రధాన మెనూను తెరువు
దక్కన్ పీఠభూమి

దక్కన్ పీఠభూమి (ఆంగ్లం : Deccan Plateau), ఇంకనూ ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు.[1] భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దీని ఎలివేషన్ ఉత్తరభాగాన 100 మీటర్లు, దక్షిణాన 1000 మీటర్లు గలదు. ఇది పర్వత శ్రేణుల్లో ప్రారంభమై, ఎనిమిది రాష్ట్రాలలో వ్యాపించియున్నది. భారత ఉపఖండంలోని అంతర్భాగంలో త్రికోణాకృతిలో సముద్రతీరం వరకూ వ్యాపించియున్నది.[2] ఈ పీఠభూమి మధ్యభారతంలోనూ మరియు దక్షిణ భారతంలోనూ వ్యాపించియున్నది.[3] దీని పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులు కల్గివున్నది. ఈ కనుమల మధ్య ఎత్తుగా ఏర్పడిన భూభాగం ఈ పీఠభూమి. ఈశాన్యాన వింధ్య పర్వతాలు సత్పురా పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పర్వత శ్రేణులు, ఉత్తరానగల నదీమైదానప్రాంతాలనుండి ఈ పీఠభూమికీ వేరు చేస్తున్నాయి. ఈ పీఠభూమి విశాలంగా వ్యాపించియున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మరియు కర్నాటక, మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాకు చెందిన భాగాలు. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది.[3] అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతం.[2]

దక్కన్ అనే పేరు ప్రాకృత పదమైన దక్ఖిన్, సంస్కృతపదమైన दक्षिण దక్షిణ నుండి ఆవిర్భవించింది.[4]

హంపి వద్ద పీఠభూమి దృశ్యం
దక్కన్ పీఠభూమి పొడి అడవులు, అనంతగిరి
కంబాలకొండ అభయారణ్యము, విశాఖపట్నం

విషయ సూచిక

భూగర్భ శాస్త్రముసవరించు

ఇవీ చూడండిసవరించు

పాదపీఠికలుసవరించు

  1. Page 46, Dr. Jadoan, Atar Singh (Published September 2001). Military Geography of South-East Asia. India: Anmol Publications Pvt. Ltd. pp. 270 pages. ISBN 8126110082. Retrieved 2008-06-08. Check date values in: |date= (help)
  2. 2.0 2.1 "The Deccan Peninsula". sanctuaryasia. Retrieved 2007-01-05.
  3. 3.0 3.1 "The Deccan Plateau". rainwaterharvesting.org. Retrieved 2007-01-05.
  4. Monier-Williams Sanskrit-English Dictionary, p. 498 (scanned image at SriPedia Initiative): Sanskrit dakṣiṇa meaning 'right', 'southern'.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు