లోపాముద్ర (సంస్కృతం: लोपामुद्रा) భారతీయ సాహిత్యంలో ప్రాచీన తత్వవేత్త. ఈమె అగస్త్య మహర్షి భార్య.[1] . ఈమె క్రీ.పూ 6వ లేదా 7వ శతాబ్దంలో జీవించినట్లు నమ్మకం.[2] తన భర్తతో పాటు లలితా సహస్ర నామాలను విస్తృత పరిచినట్లు తెలియుచున్నది.[1] ఈమెకు "కౌశితకి", "వరప్రద" అనే నామాలు కూడా ఉన్నాయి. She is also called Kaushitaki and Varaprada. ఋగ్వేదం లో ఒక శ్లోకం ఆమెను గూర్చి తెలియజేస్తుంది.

అగత్స్య, లోపాముద్ర

మహా భారతంలో అగత్స్య మహర్షి "గంగద్వార" (హరిద్వార్) వద్ద తన భార్య అయిన లోపాముద్ర సహకారంలో తపస్సు చేసినట్లు ఉన్నది. లోపాముద్ర విదర్భ రాజకుమారి.[3] పురాణం ప్రకారం లోపాముద్ర అగత్స్య మహర్షిచే సృషింపబడినదని, ఆయన వివిధ జంతువులలో అందమైన భాగాలతో(జింక కండ్లు మొదలైనవి) తయారుచేసినట్లు చెప్పబడింది.[4]

లోపాముద్ర అను పేరులో "లోప" అనగా వివిధ జంతువుల అందమైన భాగాల ఇచ్చుటవలన వాటికి యేర్పడిన "లోపం" అనీ, "ముద్ర" అనగా ఆయా జంతువుల అందమైన భాగాల ను "ముద్రలు" అనీ అంటారు. అనగా వివిధ జంతువులలోని అందమైన భాగాలతో యేర్పడిన మహిళ అని అర్థము. ఆమెను సృష్టించిన తరువాత అగత్స్యడు ఆమెను రహస్యంగా విదర్భ రాజ భవనానికి తరలించినట్లు చెప్పబడుచున్నది. ఆమె పెరిగి పెద్దయిన తరువాత అగత్స్యుడు ఆమెను వివాహమాడమని కోరాడు. లోపాముద్ర అందుకు అంగీకరించింది. వివాహమైన తరువాత రాజ్యాన్ని వదలి ఆయనతో వెళ్ళిపోయింది. కొంతకాలం తరువాత ఆమె అగత్స్యని కాఠిన్యానికి విసిగిపోయింది. ఆమె రెండు పద్యాలతో కూడిన శ్లోకం ద్వారా ఆయన ప్రేమకోసం తెలియజేసింది. ఈ శ్లోకం ద్వారా అగత్స్య మహర్షి పరివర్తన చెంది ఆమె పట్ల తన కర్తవ్యాన్ని తెలుసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు (ద్రిధశ్యుడు)కలడు. అతడు ప్రముఖ కవి.

ప్రస్తుతం కావేరి నది లోపాముద్ర పునర్జన్మ పొందిన రూపం అని చెప్పబడుతుంది.[ఆధారం చూపాలి]

గిరిధర రామాయణం లో లోపాముద్ర గూర్చి వేరొక కథ కలదు. అగత్స్య మహర్షి అనేక మంది కుమార్తెలు గల కన్యకుబ్జ మహారాజును కలసి ఒక కుమార్తెను వివాహం చేసుకొనుటకు అంగీకారం కోరాడు. రాజు తన కుమార్తెలు యుక్తవయస్సుకు వచ్చిన తదుపరి తన రాజ్యానికి వస్తే కన్యాదానం చేస్తానని వాగ్దానము చేశాడు. కొంత కాలం తరువాత మహర్షి రాజ్యానికి వచ్చినపుడు రాజు అందరు కుమార్తెలను వివాహం అప్పటికే చేశాడు. తాను మహర్షికిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చి ఆ మహారాజు తన కుమారుడైన "లోపాముద్ర" ను స్త్రీ వేషం వేసి అగత్స్యునికిచ్చి వివాహం జరిపించాడు. విచిత్రంగా "లోపాముద్ర" స్త్రీ రూపంలోనికి మారిపోయింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Vedic Women: Loving, Learned, Lucky!". Archived from the original on 2006-11-20. Retrieved 2006-12-24.
  2. "Siddha Central Research Institute". Archived from the original on 2013-10-21. Retrieved Nov 19, 2013.
  3. Lopamudra The Mahabharata, translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 3: Vana Parva: Tirtha-yatra Parva: Section XCVII.
  4. "Encyclopedia for Epics of Ancient India: Lopamudra". Retrieved 2006-12-24.