ఋగ్వేదం
ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. ఋగ్వేదం అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉంది. అష్టకాలలో అధ్యాయాలు, అధ్యాయలలో వర్గాలూ ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తాలు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10,580 ఋక్కులు 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన. వీటిలో మొదటిదైన శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాథలు తెలుపుతాయి. దీనిలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించబడింది. ఋగ్వేదం కామితార్థాలను తీర్చే వేదంగా పరిగణిస్తారు. వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు పఠించాలని సూచింపబడింది. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వత" అనే సూక్త పఠనం మానవులను దీర్ఘాయుష్కులను చేస్తుందని నమ్ముతారు. శంకరాచార్యులు ఋగ్వేదాన్ని ప్రశంసించారు.
ఋగ్వేదం విజ్ఞానం
మార్చుఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.
ఋగ్వేదంలోని విశేషాలు
మార్చు- ఋగ్వేదం పది మండలాల గా విభజింపబడింది. ఇందులో 10,622 ఋక్కులు, 1,53,326 పదాలు, 4,32,000 అక్షరాలూ ఉన్నాయి. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వే దేవతలు గాను స్తుతిస్తున్నాయి. ఎనిమిది తొమ్మిదవ మండలాల్లో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమలతను ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషులు పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయారణ్యకం,ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.[1]
శాఖలు
మార్చు- ఋగ్వేదం మొత్తం 21 ప్రధాన శాఖలు ఉండేవి. ప్రధాన శాఖలు అయిన 19 కాలగర్భంలో కలసి పోయాయి. ప్రస్తుతము ఇప్పుడు దొరుకుతున్నది కేవలం ఒక శాఖ మాత్రమే.((అదే శాకల శాఖ))
- ఇంక ఉప శాఖలు ఏవీ దొరకడము లేదు. కానీ కొన్నింటికి, దాదాపుగా 20 ఉప శాఖల పేర్లు మాత్రము మిగిలాయని, తెలుస్తున్నాయని ఉవాచ.
మండల విభాగం
మార్చు- మండలాలు సంఖ్య = 10.
అష్టక విభాగం
మార్చు- అష్టకములు సంఖ్య 8.
- అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8.
- అధ్యాయాలు సంఖ్య 64
- ఈ సంహితలో 64 అధ్యాయములు , 8 అష్టకములుగా విభజించ బడ్డాయి.
- ఋగ్వేదంలో ఋక్కులు సంఖ్య = 10472 + వాలఖిల్య సూక్తాల లోని ఋక్కులు = 80 కలిపి మొత్తం = 10552
- సూక్తములు సంఖ్య = 1017 + వాలఖిల్య సూక్తాల లోని ఖిల సూక్తములు = 11 కలిపి మొత్తం = 1028.
- వర్గములు సంఖ్య = 2006 + వాలఖిల్య సూక్తాల లోని వర్గములు = 18 కలిపి మొత్తం = 2024
- ఋగ్వేదంలో అక్షరములు సంఖ్య = 3,94,221 + వాలఖిల్య సూక్తాల లోని అక్షరములు = 3,044 కలిపి మొత్తం = 3,97,265.
వేదాలపై నిరాదరణ
మార్చు- ఒకానొకనాడు, ఆచార్యుడు గురు స్థానములో ఉండి వేద విద్యను బోధించాడు. అలా గురుశిష్య పరంపరగా వేదవిద్య వ్యాప్తి చెంది ప్రపంచ మానావాళికి సభ్యత ను, సంస్కృతిని నేర్పించింది. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అని ప్రపంచములోని మేధావులు అందరు ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు. వేద విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావటానికి కొందరు విదేశీ పరిశోధకులు చేసిన శ్రమ, ప్రయత్నాలు ఎంతైనా ప్రశంసనీయం.
- కొన్ని సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయకులైన వేదజ్ఞుల సంఖ్య తగ్గి, తద్వారా సరయిన ఆదరణ లభించక వేద విజ్ఞానం కొంతవరకూ అందుబాటులో లేకుండాపోతున్నది.
మండల విభాగం
మార్చుమండలాలు | మండల విభాగం సూక్తసంఖ్య | ఋక్కులు |
1 | 191 | 2006 |
2 | 43 | 429 |
3 | 62 | 617 |
4 | 58 | 589 |
5 | 87 | 727 |
6 | 75 | 765 |
7 | 104 | 842 |
8 | 92 | 1635 |
9 | 114 | 1108 |
10 | 191 | 1754 |
మొత్తం | 1,017 | 10,472 |
వాలఖిల్య సూక్తాలు | 11 | 80 |
మొత్తం | 1,028 | 10,552 |
అష్టక విభాగం
మార్చుఅష్టకం | సూక్తాలు | అష్టక విభాగం వర్గలు | ఋక్కులు | అక్షరాలు |
1 | 121 | 265 | 1370 | 48,931 |
2 | 119 | 221 | 1147 | 51,718 |
3 | 122 | 225 | 1209 | 47,636 |
4 | 140 | 250 | 1289 | 49,762 |
5 | 129 | 238 | 1263 | 48,022 |
6 | 124 | 313 | 1650 | 48,412 |
7 | 116 | 248 | 1263 | 47,562 |
8 | 146 | 246 | 1281 | 52,178 |
మొత్తం | 1,017 | 2006 | 10,472 | 3,94,221 |
వాలఖిల్య సూక్తాలు | 11 | 18 | 80 | 3,044 |
మొత్తం | 1,028 | 2024 | 10,552 | 3,97,265 |
ఇవి కూడా చూడండి
మార్చుబుగ్వేదంలో తెల్పబడినట్లు దేవపదము, దేవతలు అంటే యుస్కముని అర్థమును నిరుక్తమున వ్రాసియున్నాడు. 1. దానము: తమకున్నవి ఇతరులకు ఇచ్చుట దానము. వీరిని దేవపద మని పిలుస్తారు. 2. దీపనాత్: ప్రకాశింప చేయుట వలన సూర్యాదిలోకాలు దేవపదముచే పిలువబడుచున్నవి. 3. ద్యోతనము: సత్యమును, విద్యను ఉపదేశించుటచే పెద్దలు దేవపద మనబడుచున్నారు. 4. ధ్యుస్థానము: అంతరిక్షమున ప్రకాశించు కిరణాలు ప్రాణములు, ప్రకాశకిరణాలు. అందుచేత దేవపదమని పిలువబడుచున్నవి. దేవతలు: శతపధ బ్రాహ్మణమున యాజ్ఞవల్క్యుడు శాకల్యునితో త్రయస్త్రింశ దేవ దేవాః సంతి అని వ్యావహారికమున 33 దేవతలు కలరు. 8 మనువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి కలిసి 33 గా దేవతలు భగవంతుని సృష్టిగా చెప్పబడింది. 1,అష్టమవసువులు: అగ్ని, భూమి, వాయువు, ఆకాశము, ప్రకాశమయుద్యువాకం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అనేవి 8 ఉన్నాయి. 2, ఏకాదశరుద్రులు: ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అని దశప్రాణములు, మనస్సు కలిసి పదకొండు. 3, ద్వాదశాదిత్యులు: చైత్రము మొదలు ఫాల్గుణం వరకు 12 నెలలు. 4, ఇంద్రుడు: విద్యుత్తు (మెరుపు) 5, ప్రజాపతి: యజ్ఞము పదార్థములు అన్నియు వీనియందు వుండుట వలన వస్తువులు అన్నారు. ఇవి శరీరము నుండి వెడలి పోవునపుడు మరణములన్నారు. బంధువులు రోదింతురు కావున రుదృలు అన్నారు. పండ్రెడు మాసాలు ఆయువును గ్రహించును గతించును కావున ఆదిత్యులన్నారు. జీవితో శరీరం విద్యుత్తు (మెరుపు) కల్గి వుండటం ఇంద్రుడు, వాయువు, వర్షజలము శుద్ధి చేయబడుటచే యజ్ఞముగా ప్రజాపతిగా పిలవబడుచున్నారు. మానవులు తమ జ్ఞాననేత్రంతో సర్వం గ్రహించవచ్చు. ఆచరించనూ వచ్చు. తమ నమ్మకమే నిజం మాత్రం కాదు. మతం అనేది మేలుకొలుపు కావాలి. దైవత్వం సృష్టి అనేదే దేవుడు అని భావించాలి.
ఏకేశ్వర వాదం
మార్చు- 8 1,154 వరకు 1,156 సూక్తాలోని శ్లోకాలు (తదుపరి హిందూ మతం దేవుడు) విష్ణు ప్రధానార్చలు కలిగి ఉంటాయి. ఒక సూక్తంలో భాగంగా ఉన్నపద్యం 1.164.46, విశ్వేదేవతలు అర్చనలు ప్రధానముగా తరచుగా ఉద్భవిస్తున్న ఏకత్వం లేదా ఏకేశ్వర వాదం, అనగా ఈశ్వరుఁ డొకఁడే యను మతము ఒక ఉదాహరణగా ఉటంకించబడింది.
మూలాలు
మార్చు- ↑ "అష్టాదశ పురాణములు" - రచన: వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ: సోమనాధ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
బయటి లింకులు
మార్చు- http://www.indusladies.com/forums/community-chit-chat/208242-telugu-velugu-3.html—Vamshi 11:51, 2014 ఆగస్టు 16 (UTC) http://www.prabhanews.com/tradition/article-3782—Vamshi[permanent dead link] 11:52, 2014 ఆగస్టు 16 (UTC)