వంగపండు ఉష, తెలుగు భాషలో భారతీయ జానపదగాయకురాలు. ఆమె జానపద వాగ్గేయకారుడు స్వర్గీయ వంగపండు ప్రసాదరావు కుమార్తె.[1] ఆమె జానపద పాటలతో పాటు నృత్యాలకు తెలుగునాట ప్రసిద్ధి చెందింది. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్. అలాగే 2020 జనవరి 15న ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్‌ గా నియమితురాలైంది.[2]

వంగపండు ఉష
2020లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌తో వంగపండు ఉష
జాతీయతభారతీయురాలు
తల్లిదండ్రులు
  • వంగపండు ప్రసాదరావు (తండ్రి)
  • విజయలక్ష్మి (తల్లి)
బంధువులుదుష్యంత్ (సోదరుడు)

కెరీర్

మార్చు

ప్రజా కవి, ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాద రావుకు ఉత్తరాంధ్రలో ఆమె జన్మించింది. ఎప్పుడూ వామపక్ష సంస్థలలో చురుకుగా ఉండే ఆమె అనూహ్యంగా 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె గతంలో పలు ఉద్యమాలు, టీవీ జానపద షోలలో పాటలు పాడుతూ నాట్యం చేసింది.[3]

2006లో వచ్చిన ఆర్. నారాయణమూర్తి అడవి బిడ్డలు చిత్రంలో వంగపండు ఉష పాటలు ఆలపించింది.

మూలాలు

మార్చు
  1. "CM YS Jagan Phone Call To Vangapandu Prasada Rao Daughter Usha - Sakshi". web.archive.org. 2023-02-19. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "కళాకారుల సంక్షేమానికి కృషి | Prajasakti". web.archive.org. 2023-02-19. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Adavi Thalliki Dandalo Song by Vangapandu Usha | Marmogina Paata | hmtv Music, retrieved 2023-02-19